గాజాపై ఇజ్రాయేల దాడులను (Israel Attach) కొనసాగిస్తూనే ఉంది. ఒకవైపు గాజా పట్టణమంతా పూర్తిగా శిథిలావస్థకు వచ్చింది. అక్కడి ప్రజల జీవనవిధానం కడుదయనీయంగా మారింది. దుర్భరమైన పరిస్థితుల్లో అక్కడి మహిళలు, పిల్లలు ఉన్నారు. ఆహారం దొరకడం గగనమై పోయింది. ఇక వైద్యసేవలు పూర్తిగా కనుమరుగైపోతున్నది. పారిశుద్ధపనులు ఏమాత్రం జరగడం లేదు. దీనికితోడు ఎప్పుడు ఎక్కడ ఏ బాంబుదాడి జరుగుతుందో తెలియని అయోమయపరిస్థితిలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. దాదాపు 21 నెలలుగా గాజాలో కొనసాగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు 59వేలమందికి పైగానే పాలస్తీనియన్లు మరణించారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడులు చేసి, 251 మందిని బంధీలుగా తీసుకెళ్లింది. దాదాపు 1,200 మందికిపైగా ఇజ్రాయేల్ (Israel Attach) ప్రజలను హమాస్ హతమార్చింది. ప్రస్తుతం హమాస్ (Hamas) చెరలో ఇంకా 51మంది బంధీలుగా ఉన్నారు. వారి విడుదల కోసం ఇజ్రాయెల్ తీవ్రప్రయత్నాలు చేస్తున్నది.

హమాస్ అంతం వరకు యుద్ధం ఆగదు: గాజాలో ఆహార సంక్షోభం తీవ్రతరం – నెతన్యాహు స్పష్టం
ఈ దాడితో ఉలిక్కిపడ్డ ఇజ్రాయేల్ ఆనాటి నుంచి ప్రత్యక్ష యుద్ధానికి దిగింది. హమాస్ అంతం చేసేవరకు యుద్ధం ఆగదు: నెతన్యాహు గాజాలో (Netanyahu in Gaza) హమాస్ పూర్తిగా అంతం చేసేవరకు తమ యుద్ధం ఆగదని ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్ ట్రంప్ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన రోజునుంచే హమాస్, ఇజ్రాయేల మధ్య యుద్ధనివారణకు కృషి చేస్తున్నారు. రష్యా, ఉక్రేయిన్ల మధ్య సంధికి కూడా ట్రంప్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. హమాస్ ఇజ్రాయేల్‌పై మెరుపు దాడికి ప్రతికారంగా గాజాపై ఇజ్రాయేల్ యుద్ధాని ప్రకటించింది. ఇప్పటిదాకా 59,029 మంది మరణించి నట్లు అక్కడి వైద్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. గాజాలో ఆహార సంక్షోభం ఈ యుద్ధం వల్ల గాజాలో తీవ్రమైన ఆహార సంక్షోభం ఏర్పడింది.
గాజాలో మానవీయ సంక్షోభం తీవ్రమవుతోంది
మృతుల్లో సగం మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. దాదాపు 1.42లక్షల మంది గాయాలపాలయ్యారని ఆ శాఖ పేర్కొంది. అక్కడ ఆహారం కోసం పడిగాపులు కాస్తున్న గాజా ప్రజలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోందని ప్రపంచ ఆహార సంస్థ తెలిపింది. ఆహారం కోసం వేచివున్న వారిపై ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేసింది. ఈ ఘటనలో 80 మంది మృతి చెందారు. ఖండించిన ఇజ్రాయెల్ ఇప్పటివరకు పాలస్తీనియన్లు ప్రకటించిన మృతుల సంఖ్యపై ఇజ్రాయెల్ ఖండించింది. గాజా మరణాల సంఖ్యను ఎక్కువ చేసి చెబుతున్నారని ఇజ్రాయెల్ ఆరోపించింది. ముప్పు ముంచుకొస్తుందని ముందుగానే హెచ్చరించి గాల్లో కాల్పులు జరిపిన తర్వాతే జనాలపై గురిపెట్టామని ఇజ్రయెల్ పేర్కొంది. ప్రస్తుతం మధ్య గాజానగరంలోకి ఇజ్రాయెల్ దళాలు ప్రవేశించాయి.
ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య యుద్ధానికి కారణం ఏమిటి?
హమాస్ స్వాధీనం చేసుకున్న తర్వాత, ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌పై దిగ్బంధన విధించింది, ఇది దాని ఆర్థిక వ్యవస్థను గణనీయంగా దెబ్బతీసింది. భద్రతా సమస్యలను పేర్కొంటూ ఇజ్రాయెల్ దిగ్బంధనను సమర్థించింది, కానీ అంతర్జాతీయ హక్కుల సంఘాలు దీనిని సామూహిక శిక్షగా అభివర్ణించాయి.
హమాస్ దేని కోసం పోరాడుతోంది?
ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా సాయుధ ప్రతిఘటనకు మరియు పాలస్తీనా రాజ్య సృష్టికి HAMAS కట్టుబడి ఉంది. HAMAS మరియు ఇజ్రాయెల్ మధ్య ఇటీవలి సాయుధ ఒప్పందం 7 అక్టోబర్ 2023న ప్రారంభమైంది, HAMAS ఇజ్రాయెల్‌లో ఆకస్మిక దాడిని ప్రారంభించి దాదాపు 1,200 మందిని చంపింది.
ప్రస్తుతం హమాస్ అధ్యక్షుడు ఎవరు?
అయితే, 6 ఆగస్టు 2024న, యాహ్యా సిన్వర్ అధికారికంగా హమాస్ పొలిటికల్ బ్యూరో తదుపరి ఛైర్మన్‌గా మరియు హమాస్ వాస్తవ నాయకుడిగా నియమితులయ్యారు, అతని పూర్వీకుడు ఇస్మాయిల్ హనియే హత్య జరిగిన ఆరు రోజుల తర్వాత.
Read hindi news: hindi.vaartha.com
Read also: Buddhism: ప్రపంచాన్ని ఊపేస్తున్న బౌద్ధసన్యాసుల లైంగిక సంబంధాలు