రాష్ట్రంలో ఇకపై ఎసి ఎలక్ట్రానిక్ బస్సులు మాత్రమే కొనుగోలు
విజయవాడ : రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి మహిళలకు అమలుచేయనున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళలకు జీరో ఫేరో టిక్కెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) అధికారులకు సూచించారు. ఎక్కడ నుంచి ఎక్కడకు ప్రయాణం చేస్తున్నారు… ఉచిత ప్రయాణంతో ఎంతమేర వారికి డబ్బులు ఆదా అయ్యాయి అనే అంశంపై స్పష్టత ఉండాలన్నారు. 100 శాతం ప్రభుత్వం ఇస్తున్న రాయితీ. వంటి వివరాలు ఆ టిక్కెట్లో పొందుపరచాలని చెప్పారు. సోమవారం సచివాలయంలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు (AP Free bus) ప్రయాణ పథకంపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. మహిళలకు ఉచిత బస్సు (Free bus) ప్రయాణం పథకంతో ఏఏ రాష్ట్రాలకు ఆర్ధికంగా ఎంత భారం పడింది.. మన రాష్ట్రంలో ఎంత వ్యయం కానుందనే అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. జీరో ఫేర్ టిక్కెట్ ఇవ్వడం ద్వారా ఎంత లబ్దిపొందారనే విషయం రాష్ట్రంలోని మహిళా ప్రయాణికులు అందరికీ సులభంగా తెలుస్తుందని ముఖ్యమత్రి అన్నారు. ఇందుకు సంబంధించి సాఫ్ట్వేర్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.. ఎట్టిపరిస్థితుల్లో పథకాన్ని ఆగస్ట్ 15 నుంచి సమర్ధవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.

ఆర్టీసీని లాభాల బాట పట్టించండి
AP Free bus: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం (travel plan) త్వరలో అమలు చేస్తున్నందున ఆర్టీసీకి భారం కాకుండా అధికారులు కార్యచరణ చేపట్టాలన్నారు. ఇతర ఆదాయ మార్గాలు పెంపొందించుకోవడం, నిర్వహణా వ్యయం తగ్గించుకోవడంద్వారా సంస్థను లాభాలబాట పట్టించాలని సిఎం సూచించారు. లాభాల ఆర్జనకు ఎలాంటి మార్గాలున్నాయి అనే అంశంపై చర్చ జరగాలన్నారు. ఆదాయం వృద్ధికి ఎటువంటి విధానాలు తీసుకురావాలి అనే దానిపై ఒక కార్యాచరణ రూపొందించాలన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఇకపై ఎసీ ఎలక్ట్రానిక్ బస్సులుమాత్రమే కొనుగోలుచేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు. ప్రస్తుతం ఉన్నవాటిని ఎలక్ట్రికల్ బస్సులుగా మారిస్తే నిర్వహణా వ్యయం తగ్గుతుందని, అలాగే ఇందుకు అవసరమయ్యే విద్యుత్ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలని సూచించారు. అన్ని ఆర్టీసీ డిపోల్లోనూ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేఅంశంపైనా అధ్యయనం చేయాలని సిఎం స్పష్టం చేశారు.
ఏపీలో ఉచిత బస్సు ఉందా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సామాజిక బాధ్యతగా, APSRTC నగరాలు మరియు మోఫుసిల్ ప్రాంతాలలో నడిచే బస్సులలో ప్రయాణించడానికి వివిధ వర్గాల ప్రయాణికులకు వివిధ రకాల ఉచిత/ రాయితీ బస్ పాస్‌ల సౌకర్యాన్ని విస్తరిస్తోంది.
Ap బస్సు పాస్ ధర?
సిటీ ఆర్డినరీ మరియు మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల ద్వారా ప్రయాణానికి నెలవారీ జనరల్ బస్సు టిక్కెట్లు వరుసగా రూ. 1010/- మరియు రూ. 1140/- చొప్పున జారీ చేయబడతాయి. పాస్ ఉన్నవారికి పాస్ చెల్లుబాటు అయ్యే సేవల ద్వారా ఎటువంటి పరిమితులు లేకుండా ప్రయాణించడానికి అనుమతి ఉంటుంది.
Ap ఉచిత బస్సు పాస్ వయోపరిమితి?
12 సంవత్సరాల లోపు బాలుర నుండి 7వ తరగతి వరకు ఉచిత బస్ పాస్‌లు మరియు 18 సంవత్సరాల లోపు బాలికల నుండి 10వ తరగతి వరకు ఉచిత బస్ పాస్‌లు సెప్టెంబర్ 30 వరకు మాత్రమే జారీ చేయబడతాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: Adulterated liquor: కల్తీ మద్యం తయారీ ముఠా గుట్టురట్టు