The Crow’s Evil Plan: రామచిలుక, వడ్రంగి పిట్ట మంచి స్నేహితులు. ఒకరోజు అవి ఆకాశంలో ఆనందంగా ఎగరసాగాయి. ఎండ వేడి పెరగటంతో ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవాలనుకున్నాయి. కిందకు చూశాయి. ఓ పెద్ద మర్రిచెట్టు కనపడింది.
ఆనందంతో రెండు పక్షులు (birds) చెట్టు మీద వాలాయి. కాసేపు సేద తీరాలని నిర్ణయించుకున్నాయి. మాటల మధ్య ఎవరు గొప్పో అనే చర్చ వచ్చింది.
“నేను గొప్ప” అంటే “కాదు, నేను గొప్ప” అని వాదించుకోసాగాయి. అప్పటిదాకా స్నేహంగా మెలిగిన అవి బద్ధశత్రువుల్లా మారిపోయాయి. ఇదంతా దూరం నుంచి ఒక కాకి గమనించింది. పక్షులున్న కొమ్మ మీదకు ఎగురుకుంటూ వచ్చింది.
విరోధులుగా మారిన స్నేహితులను(friends) చూసి లోలోపల ఆనందపడింది. దానికి ఎప్పటి నుంచో వాటిని చంపి తినాలని కోరిక. ఆ విషయం బయటపడకుండా వాటిని ఉద్దేశించి మాట్లాడింది.

చిలుక అందం పై కాకి పొగడ్తల మాయ
“ఇప్పటిదాకా మీరు స్నేహితుల్లా మెలిగారు. ఒక్కసారిగా బద్ధశత్రువులుగా మారటం బాధాకరం. మిత్రుల మధ్య అలకలు ఉండాలి కానీ అపార్థాలు ఉండకూడదు” అంటూ లేని ప్రేమను కనబర్చింది చిలుక, వడ్రంగి పిట్టకు.
కాకి దొంగ పొగడ్తలతో చిర్రెత్తుకొచ్చింది. “నీ మాటలు కట్టిపెట్టు. మా ఇద్దరిలో ఎవరు గొప్పో తేల్చు” అన్నాయి. ముందుగా చిలుకతో: “పక్షుల్లో నీ అంత అందమైన పక్షి లేదు. ఆకుపచ్చని రంగు బాగుంటుంది. అలాగే నీ ముక్కు కూడా. పండ్లను నీలా ముక్కుతో పొడిచి అందంగా తినటం మరో పక్షి చేయలేదు. అంతెందుకు, నీ అందంలో కొద్దిగైనా ఆ దేవుడు నాకు ఇవ్వలేదు. పైగా నీ మాటలు ముద్దొస్తాయి” అని పొగిడింది.

అలాగే వడ్రంగి పిట్టతో: “నీ ముక్కు పొడవు, అది నీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. పదునైన ముక్కుతో చెట్లకు రంధ్రాలు చేసి నివాసాలుగా మార్చుకోవటం ప్రశంసనీయం.
నీలా చెట్లకు రంధ్రాలు చేయటం మరో పక్షికి చేతకాదు. దాంతో నువ్వెంత బలవంతురాలివో అర్థమవుతుంది” అన్నది. దానికి రెండు పక్షులు: “మమ్మల్ని అతిగా పొగడటం మాని మాలో ఎవరు గొప్పో తేల్చు” అన్నాయి అవి తన దారిలోకి వస్తున్నాయని గ్రహించింది కాకి.
తన దురుద్దేశాన్ని బయట పడనీయలేదు. “మీరిద్దరూ అన్నింట్లో సమానమే. పోటీ కాబట్టి ఎవరు గొప్పో నేను నిర్ణయిస్తాను” అన్నది.
చిలుక, వడ్రంగిపిట్టల మధ్య పోటీ
కాకి మాటలకు రెండూ అంగీకరించాయి. కాకి పక్షులను ఉద్దేశించి: “ఇక్కడ నుంచి దూరంగా కనపడుతున్న గుట్ట వద్దకు ముందుగా వెళ్లి తిరిగి వస్తారో వారే విజేతలు” అన్నది. వెంటనే అవి గుట్ట వైపు ఎగరసాగాయి.
కొద్దిదూరం పోయాక అలసటతో ఒక చెట్టు మీద వాలాయి. అక్కడో కోతి కనపడింది. అది కాకి పెట్టిన పోటీ గురించి తెలుసుకుని పెద్దగా నవ్వసాగింది. ఎందుకు నవ్వుతున్నావ్?” అని చిలుక, వడ్రంగి పిట్ట ప్రశ్నించాయి.
కోతి వాటితో “కాకి ఎప్పటి నుంచో మిమ్మల్ని తినాలని ప్రయత్నిస్తోంది. పోటీలో ముందుగా వచ్చిన పక్షిని తిని, వెనుక వచ్చినదాన్ని తర్వాత ఆరగిస్తుంది. మీ ఇద్దరిలో ఎవరు గెలిచినా ఓడినా కాకికి ఆహారం కావాల్సిందే!” అన్నది.

కోతి మాటలతో వాటి కళ్లు తెరచుకున్నాయి. “బతుకుజీవుడా!” అనుకుంటూ అటునుంచి అటే మరో ప్రదేశానికి ఎగిరిపోయాయి. లొట్టలు వేసుకుంటూ ఎదురు చూసిన కాకికి నిరాశే ఎదురైంది.
Read also:hindi.vaartha.com
Read also: Rabbit and Lion Story: కుందేలు తెలివి