పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే లోక్సభ(Loksabha)లో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ప్రతిపక్షాలు ప్రధానంగా “ఆపరేషన్ సిందూర్” నిలిపివేతపై, అలాగే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలంటూ ఆందోళనకు దిగాయి. ఉదయం ప్రారంభమైన సమావేశాల్లో ప్రతిపక్షాల ఆందోళనతో సభ కార్యకలాపాలు సజావుగా కొనసాగలేదు.
సభను వరుసగా వాయిదా వేసిన స్పీకర్
ఈ గందరగోళాన్ని ఎదుర్కొనలేని పరిస్థితుల్లో, సభాపతి ఓం బిర్లా రెండు సార్లు సభను వాయిదా వేయాల్సి వచ్చింది. చివరగా మధ్యాహ్నం అనంతరం, సభను సాయంత్రం 4 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతిపక్షాల హంగామా కారణంగా అధికారపక్షం సభ్యులు మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. దాంతో సభలో చర్చలకు మార్గం లేకుండా పోయింది.
రాజ్యసభలో మాత్రం సాధారణ కార్యకలాపాలు
ఇక ఇదే సమయంలో రాజ్యసభ మాత్రం సమావేశాలను నెమ్మదిగా కొనసాగిస్తోంది. అటు రాజ్యసభలో ప్రముఖ అంశాలపై చర్చలు జరుగుతున్నప్పటికీ, లోక్సభలో మాత్రం ప్రతిపక్షాల నిరసనలు, నినాదాలతో సభ వాతావరణం తీవ్రంగా ప్రభావితమవుతోంది. వాయిదాల మధ్య ప్రజా సమస్యలపై చర్చలు జరగకపోవడం పట్ల పలువురు పార్లమెంట్ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Land : ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణ లో రెండెకరాలు వస్తుంది – హరీశ్ రావు