హైదరాబాద్: ఇంజనీరింగ్ అధికారిగా సుదీర్ఘ అనుభవం కలిగిన వి.అశోక్ (V. Ashok) పంచాయతీరాజ్ (Panchayati Raj) ఇంజనీరింగ్ శాఖ ఇన్చార్జి చీఫ్ ఇంజినీర్ గా నియమితులయ్యారు. కామారెడ్డి జిల్లాకు చెందిన అశోక్ (V. Ashok) ఇంటర్మీడియట్ వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విద్యనభ్యసించారు. అనంతరం ఉస్మా నియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్‌లో లో బీటెక్ పూర్తి చేసి, సూరత్‌లోని ఆస్ఈసీ ఎంటెక్ విద్యను అభ్యసించారు. 1989లో నిర్వహించిన ఎపిపిఎస్సీ పరీక్షలో అర్హత సాధించి పంచాయతీరాజ్ విభాగంలో ఎఇఇగా చేరారు. గజ్వేల్‌లో ఏఈఈగా తన మొదటి పోస్టింగ్ (first posting as AEE) పొందారు.
ఇఎన్సీగా పదోన్నతి
అక్కడ ఐదేళ్లు సేవలందించారు. అనంతరం నిజమాబాద్ జిల్లాలో ఒక సంవత్సరం పని చేసి, డిఈగా ప్రమోషన్ పొందారు. బాన్సువాడ ఆర్ డబ్లూఎస్ విభాగంలో డీఈగా ఆరేళ్లపాటు సేవలందించారు. తర్వాత ప్రమోషన్ పొంది దుబ్బాక, సిద్దిపేట ప్రాంతాల్లో ఇఇగా నాలుగేళ్లు పని చేశారు. హైదరాబాద్ పంచా యతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయంలో ఐదేళ్లపాటు కీలక బాధ్యతలు నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఈఈగా ఆరేళ్లు సేవలందించారు. తర్వాత ఎస్ఈగా హైదరాబాద్ హెడ్ ఆఫీసులో రెండేళ్లపాటు పని చేశారు. అనంతరం ఇఎన్సీగా పదోన్నతి పొందిన గత ఒకటిన్నర సంవత్సరాలుగా హెడ్ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com