తమిళ స్టార్ హీరో అజిత్ (Hero Ajith) అభిమానులకు కాస్త ఆందోళన కలిగించే విషయం ఇది. ఇటలీలోని మిసానోలో జరుగుతున్న GT4 యూరోపియన్ సిరీస్‌లో పాల్గొంటున్న సమయంలో, రేస్ 2లో అజిత్ కారుకు ప్రమాదం జరిగింది. రేసింగ్ ట్రాక్ మధ్యలో ఆగి ఉన్న ఓ వాహనాన్ని అజిత్ డ్రైవ్ చేస్తున్న కారు ఢీకొంది. ఈ సంఘటనలో అతనికి ఎలాంటి గాయాలు కాకపోవడం ఒక ఊరట కలిగించిన విషయం.
రేస్‌కి స్వస్తి – శ్రేయోభిలాషుల నుంచి మెసేజ్‌లు
ప్రమాదం తర్వాత జాగ్రత్తగా వ్యవహరించిన అజిత్ ఎలాంటి ఉద్వేగం చూపకుండా రేసింగ్ నుంచి వైదొలిగారు. కారుకు జరిగిన నష్టం వల్ల రేస్‌ను కొనసాగించలేకపోయినప్పటికీ, ప్రొఫెషనల్ వైఖరిని చూపించిన ఆయనపై రేసింగ్ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేసింది. అభిమానులు, సహచర హీరోల నుంచి ‘సేఫ్‌టి ఫస్ట్’ అంటూ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
సహాయానికి ముందుకొచ్చిన అజిత్ – నెటిజన్ల ప్రశంసలు
ప్రమాదం అనంతరం ట్రాక్‌లో ఉన్న క్లీనింగ్ వర్కర్లకు అజిత్ స్వయంగా సహాయం చేయడం నెటిజన్లను ఆకట్టుకుంది. కేవలం హీరోగానే కాకుండా, మంచి వ్యక్తిత్వం కలిగిన మనిషిగా ఆయన మళ్లీ నిరూపించుకున్నాడు. సామాన్యంగా రేసర్లకు అలాంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేకపోయినా, అజిత్ సహాయం చేయడం నిజమైన స్పోర్ట్స్‌మెన్‌షిప్‌గా అభినందించబడుతోంది. ఇది ఒక్కటే కాదు – రీల్ లైఫ్ హీరోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ అజిత్ హీరో అని అభిమానులు మరలా నిర్ధారించారు.
Read Also : Manikrao Kokate : అసెంబ్లీలో మంత్రి రమ్మీ ఆడారు – ప్రతిపక్షాలు