हिन्दी | Epaper

Karnataka : భర్తను నదిలోకి తోసేసిన భార్య?..అసలు ట్విస్ట్ ఇదే

Sudheer
Karnataka : భర్తను నదిలోకి తోసేసిన భార్య?..అసలు ట్విస్ట్ ఇదే

ఇటీవల కర్ణాటక (Karnataka ) రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఓ యువతి తన భర్తతో కలిసి నదీ ఒడ్డున సెల్ఫీలు తీసుకుంటుండగా, ఆకస్మాత్తుగా భర్త నదిలో పడిపోయి మృతి చెందాడు. ఇందుకు కారణం భార్యే అని, తానే తోసిందని ఆరోపణలు రావడంతో ఈ కేసు చుట్టూ అనేక అనుమానాలు నెలకొన్నాయి. వీడియోలు, స్థానికుల వాదనలు దీనికి మరింత మలుపు తెచ్చాయి.

మరోవైపు షాకింగ్ ట్విస్ట్ – బాల్యవివాహం ఆధారాలు బయటకు

తాజాగా బాలల హక్కుల కమిషన్ దర్యాప్తులో ఈ కేసుకు సంబంధించి సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. భార్యగా ఉన్న ఆ యువతి వయస్సు 16 సంవత్సరాలు కూడా నిండకముందే ఆమెకు తాత వయస్సున్న వ్యక్తితో పెళ్లి జరిగినట్లు కమిషన్ గుర్తించింది. ఈ మేరకు మృతుడి కుటుంబ సభ్యులపై POCSO (Protection of Children from Sexual Offences) చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని అధికారులు ఆదేశించారు. ఇది కేసును పూర్తిగా కొత్త కోణంలోకి తీసుకువెళ్లింది.

తాను తోసలేదని అంటున్న భార్య – మ‌రింత దర్యాప్తు కీలకం

ఇంకా నదిలో భర్త మృతి జరిగిన పరిణామాలపై విచారణ కొనసాగుతోంది. యువతి ప్రకారం, తన భర్త ప్రమాదవశాత్తు నదిలోకి జారిపోయాడని, తానేం చేయలేదని చెప్పింది. ఇదే సమయంలో బాల్యవివాహం అంశం వెలుగులోకి రావడంతో ఆమె నిజమైన బాధితురాలా? లేక నిందితురాలా? అనే అంశంపై మళ్లీ మల్లగుల్లాలు మొదలయ్యాయి. ఇప్పుడు పోలీసులు రెండు కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు. పూర్తి నిజం వెలుగులోకి రావడానికి ఇంకా కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది.

Read Also : CBN : నాన్నను రాజమండ్రి జైలులో చూడగానే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి – లోకేశ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

హైకోర్టులో పిండంతో ప్రవేశం, మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన

హైకోర్టులో పిండంతో ప్రవేశం, మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన

వంటగ్యాస్ ఆందోళనపై మోదీ సమీక్ష, ఉత్పత్తి పెంపు ఆదేశాలు

వంటగ్యాస్ ఆందోళనపై మోదీ సమీక్ష, ఉత్పత్తి పెంపు ఆదేశాలు

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు..ఎప్పటినుంచి అంటే?

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు..ఎప్పటినుంచి అంటే?

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

పశ్చిమాసియాలో రణరంగం: 11వ రోజు భీకర పోరు

పశ్చిమాసియాలో రణరంగం: 11వ రోజు భీకర పోరు

LPG ఉత్పత్తిని పెంచాలని కంపెనీలకు కేంద్రం ఆదేశం!

LPG ఉత్పత్తిని పెంచాలని కంపెనీలకు కేంద్రం ఆదేశం!

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

📢 For Advertisement Booking: 98481 12870