ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (Mithun Reddy)ను ప్రత్యేక దర్యాప్తు సంస్థ (SIT) శనివారం అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ఆయన ఏ4 నిందితుడిగా నమోదయ్యారు. అనంతరం మిథున్ రెడ్డిని విజయవాడలోని ACB కోర్టులో హాజరు పరిచారు.

వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలింపు
అరెస్టు తర్వాత, మిథున్ రెడ్డి (Mithun Reddy)ని వైద్య పరీక్షల కోసం (medical examinations) విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ బీపీ, ఈసీజీ, షుగర్ వంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వైద్యుల నివేదిక ప్రకారం ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తేలింది. దీంతో మిథున్ రెడ్డిని నేరుగా ACB కోర్టుకు తరలించారు.
రిమాండ్ కోరిన S.I.T
కోర్టులో హాజరైన తర్వాత SIT అధికారులు మిథున్ రెడ్డికి రిమాండ్ విధించాలంటూ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. కేసులో ఆయన పాత్రపై ప్రత్యేక దర్యాప్తు సంస్థకు గల ఆధారాలపై న్యాయ విచారణ సాగనుంది.
మద్యం పాలసీ రూపకల్పనలో కీలక పాత్ర?
మద్యం పాలసీ రూపకల్పనలో మిథున్ రెడ్డి కీలకపాత్ర పోషించారని SIT భావిస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న ఏడు గంటలపాటు విచారించిన అనంతరం, ఆయన్ని అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే ఈ అరెస్ట్ కీలక మలుపుగా మారింది.
ఈ కేసులో ఇప్పటికే పలువురిని SIT విచారించిన సంగతి తెలిసిందే. మద్యం కుంభకోణంపై పలు ఆధారాలు వెలుగులోకి రావడంతో మిథున్ రెడ్డిపై దృష్టి కేంద్రీకరించారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టు గలంత ముందే ఊహించబడినదే .
మిథున్ రెడ్డి ఎలాంటి కేసులో అరెస్ట్ అయ్యారు?
వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయన A4 గా ఉన్నారు
Read hindi news: hindi.vaartha.com
Read also: Kishore AEE: తిరువూరు ఏఈఈ ఆత్మహత్యయత్నం..చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు