కావలసిన పదార్థాలు
- మునక్కాయలు: ఐదు
- కారం: రెండు టేబుల్ స్పూన్లు
- వేయించిన పల్లీల పొడి: నాలుగు టేబుల్ స్పూన్లు
- దనియాల పొడి: రెండు టేబుల్స్పూన్లు
- కొత్తిమీర తరుగు: పావుకప్పు
- ఇంగువ: పావుచెంచా
- టమాటలు: రెండు
- పచ్చిమిర్చి పేస్టు: చెంచా
- వెల్లుల్లి పేస్టు: రెండు చెంచాలు
- అల్లం పేస్టు: చెంచా
- నిమ్మరసం: రెండు చెంచాలు
- గరంమసాలా: చెంచా
- ఉప్పు: తగినంత
- నువ్వుల పొడి: మూడు స్పూన్లు
- నూనె: పావుకప్పు
- జీలకర్రపొడి: టేబుల్స్పూను
- జీలకర్ర: అర చెంచా
- సెనగపిండి: రెండు టేబుల్స్పూన్లు
- బెల్లం తరుగు: టేబుల్ స్పూన్లు
- పసుపు: అర చెంచా

తయారు చేసే విధానం
స్టౌ మీద కడాయి పెట్టి చెంచా నూనెవేయాలి. అది వేడెక్కాక సెనగపిండి వేసి రెండు మూడు నిమిషాలు వేయించుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పిండిలో కారం, పల్లీల పొడి, దనియాల పొడి, కొత్తిమీర తరుగు, వెల్లుల్లిపేస్టు, నిమ్మరసం, గరంమసాలా, సరిపడా ఉప్పు, నువ్వుల పొడి, జీలకర్రపొడి, బెల్లంతరుగు వేసుకుని అన్నింటినీ కలుపుకోవాలి.
ఇప్పుడు ఓ గిన్నెలో మూడు కప్పుల నీళ్లు(water) తీసుకుని స్టౌ మీద పెట్టాలి. అవి మరుగుతున్నప్పుడు పసుపు, తగినంత ఉప్పు, మునక్కాయ ముక్కల్ని వేసి మూత పెట్టాలి. ఆ ముక్కలు ఉడికాక దింపేసి, నీటిని విడిగా తీసుకోవాలి.
స్టౌ మీద కడాయి పెట్టి మిగిలిన నూనె వేసి జీలకర్ర, అల్లం పేస్టు, పచ్చిమిర్చి పేస్టు, ఇంగువ, టొమాటో ముక్కలు వేసి అన్నింటినీ వేయించాలి. టమాట(tomato) ముక్కలు ఉడుకుతున్నప్పుడు చేసి పెట్టుకున్న సెనగపిండి మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలయ్యాక మునక్కాయ ముక్కలు, అవి ఉడికించిన నీటిని కూడా పోసి మూత పెట్టి కూర దగ్గరకు అవుతున్నప్పుడు దింపాలి.

Read also:hindi.vaartha.com