ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్థాన్ పట్ల పలు దేశాలు విమర్శిస్తున్నా వాటిని పట్టించుకోకుండా, ఉగ్రవాదులకు (terrorists) మద్దతు ఇస్తూనే ఉంది. తాజాగా టెర్రరిస్టులకు,హైజాకర్లకు ఆశ్రయం ఇవ్వడం, మహిళలకు బహిరంగంగా,బట్టలు ఊడదీయడం వంటి నేరాలకు మరణశిక్షను రద్దు చేసి, దానికి,బదులుగా జీవిత ఖైదును విధించేలా బిల్లుకు ఆమోదం లభించింది. పాకిస్థాన్,పార్లమెంటులో క్రిమినల్ లాస్ (అమెండ్మెంట్) బిల్లు-2025 ఆమోదం పొందింది. ఈ బిల్లుకు పాక్ హోంశాఖ సహాయమంత్రి తలాల్ చౌదరి (Talal Chaudhry) చట్టసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పాకిస్థాన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 354-ఎ,402-సిలలో సవరణలు చేస్తుంది. సెక్షన్ 354-ఎ ప్రకారం, ఎవరైనా మహిళపై దాడి చేసి, ఆమె బట్టలు ఊడదీసి, బహిరంగంగా అవమానిస్తే, మరణశిక్షలేదా జీవితఖూదు, జరిమానాతో శిక్షలు ఉంటాయి. ఈ కొత్తబిల్లు ఈ నేరాలకు, మరణశిక్షను తొలగించి, జీవితఖైదును తప్పనిసరి శిక్షగా విధిస్తుంది.

ఖైదీలకు ఊరట..
ప్రస్తుతం ఈ బిల్లుపై పాకిస్థాన్‌లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పాకిస్థాన్‌లో ఉగ్రవాదం వేల్లూనుకునిపోయాయి. భారతదేశంపై,పలు ఉగ్రసంస్థలు తరచూ దాడులకు పాల్పడుతున్నాయి. ఇటీవల పహల్గాం (Pahalgam) లో,ఉగ్రవాదులు 26మందిని పొట్టన పెట్టుకున్న ఉదంతం మర్చిపోలేనిది. ఈబిల్లుతో ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పించేవారికి భవిష్యత్యులో మరణశిక్షలుండవు. కేవలం జీవితాంతం ఖైదీగానే మిగిలిపోతారు.
పాకిస్తాన్ కరెన్సీ ఏది?
పాకిస్తాన్ దేశపు అధికారిక కరెన్సీ పాకిస్తానీ రూపీ (Pakistani Rupee).
పాకిస్తాన్ స్థాపకుడు ఎవరు?
పాకిస్తాన్ స్థాపకుడు ముహమ్మద్ అలీ జిన్నా (Muhammad Ali Jinnah).
Read hindi news: hindi.vaartha.com
Read Also: Olivia Smith:ప్రపంచంలోనే అత్యంత రెమ్యూనరేషన్ పొందుతున్న ఒలీవియా స్మిత్