Ragging : ప్రాణనమానంగా పెంచుకున్న తమ బిడ్డలు తమకళ్లముందే చదువు సంస్కారం ఉందనుకున్న కొందరు వింతపశువుల వికృత చేష్టలకు బలవుతుంటే ఆ గర్భశోకాన్ని ఊహించగలమా? అది ఎప్పటికైనా తీరుతుందా? ఇప్పటికైనా పాలకపెద్దలు ఆలోచించాలి. అలాగే దోషులపై నిర్దిష్టమైన చర్యలు తీసుకోగలిగితే ఇలా వేధించి ర్యాగింగ్ కు పాల్పడేవారికి ప్రోత్సహించేవారికి తిరుగులేని హెచ్చరికలను అందించగలుగుతాం. ఈ ర్యాగింగ్ భూతాన్ని కొంతవరకైనా నియంత్రించగలుగుతాం. ఆ దృఢసంకల్పం లేనప్పుడు అన్ని చట్టాలు, కమిటీలు, విచారణలు అన్ని నిష్ప్రయోజనమే. పాలకుల చేతకాని తనానికి అమాయక విద్యార్థులు ఇలాగే బలైపోతూనే ఉంటారు.

చట్టాలు ఉన్నాయి, కానీ అమలు లేదు
ఎన్ని చట్టాలు చేసినా, కఠిన చర్యలు తప్పవని ఎందరు నేతలు హెచ్చరించినా ర్యాగింగ్ రక్కసి దేశాన్ని వదిలి పెట్టడం లేదు. వికృతరూపం దాల్చింది. ఈ ర్యాగింగ్‌కు ఎందరో అమాయక విద్యార్థులు బలైపోతున్నారు. వీటిలో కొన్ని మాత్రమే వెలుగు చూస్తున్నాయి. తమకు జరిగిన అవమానాలు భరించలేక, బయటకు చెప్పుకోలేక వారిలో వారు కుమిలిపోతుంటే మరికొందరు ఆత్మహత్యలకు పాల్ప డుతున్నారు. ఇంతకాలంగా ఇంతగా కొనసాగుతున్న ర్యాగింగ్ కారకులపై ప్రభుత్వాలు పురనావృతం కాకుండా. పటిష్టమైన చర్యలు తీసుకోలేకపోతున్నాయి. చట్టాలకు సామాన్యులు లోకువైతే సమర్థులకు చట్టాలు లోకువ అన్నట్టు నిందితులు ఏదోరకంగా బయటపడుతున్నారు. అందులోనూ నిందితుల్లో అధికశాతం రాజకీయ అండదండలు, లక్ష్మిప్రస న్నుల పుత్రులు కావడంతో అధికారులు వారి జోలికి వెళ్ల డానికి వెనుకాడుతున్నారనే ఆరోపణలకు జరుగుతున్న సంఘటనలు అద్దంపడుతున్నాయి.
దీంతో ఏంచేసినా, ఎన్ని హెచ్చరికలు చేసినా భయం లేకుండా నిరాటంకంగా కొనసా గుతున్నది. దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యంతో విశ్వ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు ఈ ర్యాగింగ్ ద్వారా అగమ్యగోచరం కాకుండా నిరోధించేందుకు దేశంలోని అనేక రాష్ట్రాలు స్పష్టమైన చట్టాలు చేశాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరిస్తూ విశ్వవిద్యాలయాల్లో నిధుల సంఘం (UGC) ఎంతో కఠినమైన మార్గదర్శకాలు కూడా రూపొందించింది. అయినా ఏమాత్రం మార్పురాక పోగా యేడాదియేడాదికి పెరిగిపోతున్నాయి. ర్యాగింగ్ 2019-2021 మధ్యకాలంలో యుజిసికి అందిన ఫిర్యాదు లు తగ్గినట్లు కన్పించినా చట్టం, యుజిన్ నిబంధనలు కారణం కాదు. అది కేవలం కోవిడ్ ప్రభావంతో తగ్గినట్లు కచ్చితంగా చెప్పొచ్చు.
కోవిడ్ శాంతించిన తర్వాత మళ్లీ 2022 నుంచి ర్యాగింగ్ విస్తరించడం ప్రారంభించింది. 2022లో యుజిసికి 1094 ఫిర్యాదులు అందగా, 2023 లో ఆసంఖ్య 1240కి పెరిగింది. ఆ తర్వాత సంవత్సరం అది ఏకంగా నలభైఐదు శాతానికి పెరిగినట్లు యుజిసి గణాంకాలే చెబుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు మూడు వేల రెండువందలకు పైగా ఫిర్యాదులు ర్యాగింగ్ నిరోధక కమిటీలకు అందాయి. ఇక సీనియర్ విద్యార్థులే కాదు కాలేజీల్లో జూనియర్లకు రక్షణ కవచంగా ఉండాల్సినకొందరు అధ్యాపకులు, సిబ్బందే కంచె చేను మేసినట్లుగా వ్యవహరిం చడం దురదృష్టకరం.
గురువులే గారడీదారులైతే…

మొన్న ఒడిశాలోని బాలాసోర్‌లో ఉన్న ఫకీర్మోహన్ కాలేజీలో విద్యావిభాగం అధిపతి వేధింపులు తట్టుకోలేక ఒక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తనకు జరుగుతున్న వేధింపులను ఆమె కాలేజీ కమిటీకి పలుమార్లు ఫిర్యాదు చేసింది. అయినా ఆ ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకో కపోవడంతో నేరుగా కాలేజీ క్యాంపన్కు వెళ్లిన ఆ విద్యార్థిని ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పు అంటించుకున్నది. బాధి తురాలిని భువనేశ్వర్‌లోని ఎయిమ్స్క తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. ఆ యువతి మృతిచెందినతర్వాత యుజిసి స్పందించి వాస్తవాలను బయటకు తీసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
Ragging : ఇక ఈ సంఘటన మరువక ముందే కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా మూడబిదరలో ఒక విద్యార్థినిపై ఇద్దరు లెక్చరర్లు, వారి మిత్రుడు వేధింపు లకు గురి చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఒక ప్రముఖ కళాశాలలో లెక్చ రర్‌గా పనిచేస్తున్న ప్రబుద్ధుడు ఆ విద్యా ర్దినిని బెదరించి మాయమాటలతో నమ్మించి లైంగిక వేధిం పులకుగురిచేశారు. ఆ తర్వాత ఫొటోలున్నాయని బెదరిస్తూ మరొక లెక్చరర్ ఆమెపై లైంగిక దాడిచేశారు. ఆ తర్వాత వారి మిత్రుడు. ఈ ముగ్గురి వేధింపులు రానురాను పెరిగిపోవడం భరించలేక తల్లిదండ్రులకు ఆ యువతి తెలిపింది.
తల్లిదండ్రులు మహిళా కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇలా విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే వేధింపులకు గురి చేస్తున్న సంఘటనలు తరుచుగా చోటు చేసుకొంటున్నాయి.
చాలావరకు వెలుగు చూడడం లేదు. ఆటు కుటుంబ గౌరవం, ఇటు చదువుకు అటకం కలుగుతుందేమోననే భయం, వీటన్నంటికి మించి పోలీసులు వేసే సవాలక్ష ప్రశ్నలకు జవాబు చెప్పడంలాంటి ఇబ్బందులతో వారిలో వారు కుమిలిపోతున్నారే తప్ప పెదవి విప్పలేకపోతున్నారు. అలాంటి విద్యార్థిని ఇటీవల ఒక లేఖ రాసి తనువు చాలిం చింది. నేను చదువుతున్న కాలేజీలో లైంగింక వేధింపులు జరుగుతున్నాయి. ఫ్యాకల్టీకి చెప్పొచ్చు కదా అని మీరు అనొచ్చు. వారే నీచంగా ప్రవర్తిస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి? నాలాగే ఇక్కడ చాలా మంది అమ్మా యిలు ఈ వేధింపులు భరించలేక బాధపడుతున్నారు. మాలో ఎవరో ఒకరు చని పోతేనే తప్ప ఈ దురాగతాలు బయట ప్రపంచానికి తెలు స్తుంది.
అందుకే నేను ఈ పనిచేస్తున్న’ అంటూ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో ఒక విద్యార్థిని ప్రాణం తీసుకుం ది. ర్యాగింగ్ నిరోధక నిబంధనలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ యుజిసి ప్రతి యేడాది ఎన్నో కాలేజీలకు నోటీసులు ఇస్తూనే ఉంది. ఇటీవల యుజిసి పద్దెనిమిది కాలేజీలకు నోటీసులు ఇచ్చింది. ర్యాగింగ్ అనండి, వేధింపులు అనండి వీటి కారణంగా ఎందరో మెరికల్లాంటి విద్యార్థుల భవిష్యత్ అర్ధాంతరంగా ముగిసిపోతున్నది. ఈ ర్యాగింగ్ గతంలో ప్రొఫెష నల్ కాలేజీల్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు ఇంటర్మీడియేట్ కాలేజీలకు కూడా విస్తరించింది. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి సెకండరీ విద్యను పూర్తి చేసుకొని ఉజ్వల భవిష్యత్‌ను ఊహించుకొని కాలేజీల్లోకి అడుగుపెట్టిన విద్యార్థులకు బెరకు, భయం పోగొట్టడానికి చేపట్టిన పరిచయ వినోద కార్యక్రమం ఇది. 19వ శతాబ్దంలో ప్రారంభ దశలో అంత వరకే పరిమితమైనా అది శృతిమించి కొందరి విద్యార్థులకు ప్రాణాంతక వికృత క్రీడగా మారిపోయింది.
చట్టాలు ఉన్నాయి, కానీ అమలు ఎందుకు లేదు?

పాశ్చాత్య సంస్కృతి విషవలయంలో చిక్కుకొని ఆలోచనారహితంగా చేస్తున్న ఈ ర్యాగింగ్‌ను లేత మనసులు తట్టుకోలేకపోతు న్నాయి. అశ్లీల సాహిత్యం, నీలి చిత్రాలు, ప్రధానంగా మత్తు పదార్థాలు, ఇతర బలహీనతలు తోడు కావడంతో ఎంతో మంది విద్యార్థులు బలైపోయారు. ఆకారణంగా మెరి కల్లాంటి పిల్లలను కోల్పోయిన ఆ కుటుంబాల గర్భశోకం ఎలా తీరుతుందో పెద్దలు మనసుపెట్టి అలోచించాలి. ఇక Ragging కు భయటపడి మరెందరో విద్యార్థులు విద్యాభ్యాసా నికే స్వస్తి చెప్తున్న సంఘటనలు చాలా ఉన్నాయి. పాలకులు ఏమీ చేయడం లేదని చెప్పడం లేదు. ఈ విషసంస్కృ తిని నిరోధించేందుకు ఎన్నో చట్టాలు, నిబంధనలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 1997 మార్చి పద్దెని మిదిన రాష్ట్ర శాసనసభ ఆమోదించిన చట్టం ప్రకారం ఎన్నో కఠినశిక్షలు రూపొందించారు. మరణానికి కారకులైన, ఆత్మ హత్యకు ప్రేరేపించినా జీవితకాలం పాటు కానీ పదేళ్ల జైలు శిక్ష విధించే విధంగా చట్టాన్ని రూపొందించారు. అన్నింటి కంటే మించి ర్యాగింగ్ చేసిన విద్యార్థులను ఆయా విద్యా సంస్థల నుంచి తొలగించడమేకాక వారిని ఎక్కడా చేర్చుకో రాదని చట్టంలోచేర్చారు. చట్టాలు చేశారు కానీ దాన్ని త్రిక రణశుద్ధిగా అమలు చేసే మనసు పాలకులకు లేకుండాపోయింది.
Ragging : దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. ఇప్పటివరకు ఒక్కకేసులో కూడా తిరుగులేని సాక్ష్యాలు సేకరించి న్యాయ స్థానాల ముందు రుజువు చేసేందుకు తీసుకున్న చర్యలు లేవనే చెప్పొచ్చు. పొరుగునున్న తమిళనాడులో జరిగిన సంఘటనలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో తీసుకున్న చర్య లు అక్కడ ర్యాగింగ్ భూతం చాలావరకు తగ్గిందనే చెప్పొ చ్చు. ర్యాగింగ్ శృతిమించి జూనియర్ వ్యతిరేకించడంతో’ హత్యకు దారితీసింది. పకడ్బందీ సాక్ష్యాలతో అక్కడి యం త్రాంగం నిందితుడిని న్యాయస్థానం ముందు నిలబెట్టింది. చదువుకొని గొప్ప వైద్యుడిగా పేరు ప్రతిష్టలు సంపాదించి పెడతారని కుమారుడిపై ఆశలు పెంచుకున్న ఆ తల్లిదండ్రు లను దృష్టిలో ఉంచుకొని నిందితునికి మరణశిక్ష వేయడం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానిస్తూ ఇరవై ఎనిమిది సంవత్స రాలు కఠిన కారాగారశిక్ష విధించారు.
తమిళనాడులో ఒక మంచి ఉదాహరణ

Ragging : ఇది తమిళనాడులోని విద్యార్థిలోకంలో భయాన్ని నెలకొల్పింది. ప్రాణ సమానంగా పెంచుకున్న తమ బిడ్డలు తమకళ్లముందే చదువుసంస్కారం ఉందనుకున్న కొందరు వింతపశువుల వికృత చేష్టలకు బలవుతుంటే ఆ గర్భశోకాన్ని ఊహించగలమా? అదిఎప్పటికైనా తీరుతుందా? ఇప్పటికైనా పాలక పెద్దలు ఆలోచించాలి. అలాగే దోషులపై నిర్దిష్టమైన చర్యలు తీసు కోగలిగితే ఇలా వేధించి ర్యాగింగ్‌కు పాల్పడేవారికి ప్రోత్సహించేవారికి తిరు గులేని హెచ్చరికలను అందించగ లుగుతాం. ఈ ర్యాగింగ్ భూతాన్ని కొంతవరకైనా నియంత్రించగలుగుతాం. ఆ దృఢ సంకల్పం లేనప్పుడు ఎన్ని చట్టాలు, కమిటీలు, విచారణలు అన్ని నిష్ప్రయోజనమే. పాలకుల చేతకాని తనానికి ఆమా యక విద్యార్థులు ఇలాగే బలైపోతూనే ఉంటారు.
– దామెర్ల సాయిబాబ
Read This : https://vaartha.com/category/smpaadhakiyam/
Read Also : Reservations: స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు సాధ్యమేనా?