న్యాయపోరాటానికి అండగా ఉంటా-మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ (ధర్నాచౌక్) : గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన సర్పంచులకు ఇవ్వవలసిన పెండింగ్ బిల్లులు ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నాచౌక్వద్ద రెండు సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంకు ముఖ్య అతిధిగా హాజరై శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) మాట్లాడుతూ సర్పంచుల సమస్యలను రాజకీయ కోణంలో చూడకూడదని, వారు తమ స్వంత నిధులతో గ్రామాలను అభివృద్ధి చేశారని గుర్తు చేశారు.

పెండింగ్ బిల్లులను చెల్లించి, వారికి న్యాయం
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా సర్పంచులకు ఏ సమస్య వచ్చినా, వారికి అండగా నిలిచానని, ఇప్పుడు కూడా ప్రజా ప్రతినిధుల ఫోరం నాయకునిగా, తెలంగాణ ఉద్యమకారునిగా, సర్పంచులు (Sarpanches) చేస్తున్న న్యాయపోరాటానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్పందించి, సర్పంచుల సమస్యలను రాజకీయ కోణంలో చూడకుండా, పెండింగ్ బిల్లులను చెల్లించి, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జేఏసీ అధ్యక్షులు సుర్వి యాదయ్యగౌడ్ మాట్లాడుతూ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా సర్పంచులపై కక్షసాధించటం న్యాయం కాదని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సర్పంచుల సంఘం (Sarpanch Association) జేఏసీ నేతలు గుంటి మధుసూదన్రెడ్డి, మాట్ల మధు, రాంపాక నాగయ్య, పూడూరి నవీన్ గౌడ్, నెమలి సుభాష్ గౌడ్, వెంకటాపూర్ రాజేందర్, కేశబోయిన మల్లేష్, సముద్రాల రమేష్, శారద, కల్పన, రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు పెద్దఎత్తున హాజరయ్యారు.
శ్రీనివాస్ గౌడ్ ఎవరు?
శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు. ఆయన భారతీయ రాష్ట్ర సమితి (భారత రాష్ట్ర సమితి – BRS, మునుపటి TRS) పార్టీకి చెందిన ఎమ్మెల్యే,మాజీ మంత్రి.
ఆయన ఏ శాఖల మంత్రిగా పనిచేశారు?
తెలంగాణ రాష్ట్రంలో పూర్వంలో శ్రీనివాస్ గౌడ్ పర్యాటక, సాంస్కృతిక, క్రీడా, యువజన సేవల శాఖ మంత్రిగా పనిచేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Ponnam Prabhakar: గురుకులాల్లో ఏ ఘటన జరిగినా అధికారులదే బాధ్యత