తిరుమల: స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గోనడానికి శనివారం ఉదయం తిరుపతికి వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) శైవాలయం కపిలతీర్థంలోని కపిలేశ్వరుని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా కపిల తీర్థం (Kapila Tirtham) పుష్కరిణి, జలపాతం, ఆక్కడ భక్తుల లగేజీలను భద్రపరిచే కౌంటర్లు, పరిసరాలు, పార్కింగ్ విషయాలపై టిటిడి ఇఒ శ్యామలరావు, జెఇఒ బ్రహ్మం, సివిఎసీ కెవి మురళీకృష్ణ, ఎస్ఐలు మనోహర్, వెంకటేశ్వర్లు, విఎసి సురేంద్ర, ఆలయ డిప్యూటీ ఇఒ నాగరత్న, ఆరోగ్యశాఖ డిప్యూటీ ఇఒ సోమన్నారాయణతో కలసి తనిఖీ చేశారు.

సిఎం పర్యటన వేళ భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని, భక్తుల నియంత్రణ, స్వచ్ఛాంధ్ర ప్రతినిధులతో భేటీ కానుండటంతో పూర్తిగా సిఎం పర్యటన (CM’s visit) విజయవంతంచేయాలని ఇఒ కోరారు. ఈ రోజు ఉదయం విజయవాడ విమానాశ్రయం నుంచి బయల్దేరిన ముఖ్యమంత్రి 11 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తూకివాకం గ్రామానికి చేరుకుని అక్కడ ఉన్న ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌ను పరిశీలించనున్నారు.
మధ్యాహ్నం 12.15 గంటలకు తిరుపతిలోని కపిలతీర్థం (Kapila Tirtham) చేరుకుని కపిలేశ్వరస్వామిని దర్శించుకుంటారు. అనంతరం స్వచ్ఛాంధ్ర భాగస్వాములతో ముఖాముఖి సమావేశమవుతారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Alipiri: అలిపిరి సమీపంలో జింకను చంపిన చిరుత ..భయంతో భక్తులు