గుంతకల్లు రైల్వే : నైరుతి – రైల్వే హుబ్లీ డివిజన్ పరిధిలో అత్యంత కీలకమైన తోరణగళ్లు-రంజిత్ పురా స్టేషన్ల మద్య రూ.458.83కోట్ల అంచనా వ్యయంతో డబ్లింగ్ రైలు మార్గాన్ని చేపట్టేందుకు రైల్వే శాఖ మంజూరు చేసింది. గతంలో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) గుంతకల్లు డివిజన్ పరిధిలోని ఇనుప ఖనిజం గనులున్న డోనమలై ఎన్ఎండిసి సెక్టార్లో కేంద్రప్రభుత్వ సంస్థ అయిన జాతీయ ఖనిజ ఉత్పత్తి అభివృద్ధి సంస్థ(ఎన్ఎండిసి) ఇనుప ఖనిజాన్ని వెలికి తీసి యాసిన్ కిరా, హొస్పేటల మీదుగా వివిధ ప్రాంతాలలోని ఓడరేవుల ద్వారా 1960దశకంలో రవాణా వ్యవస్థను ప్రారంభించింది. కాలక్రమేనా దేశ విదేశాల్లో మన ఇనుప ఖనిజానికి భారీగా డిమాండ్ పెరగడంతో 19702 దశకంలో గుంతకల్లు-హొస్పేట్, తోరణగళ్లు-రంజిత్ పురా మద్య బ్రాడ్ గేజ్ రైలు మార్గాన్ని ఏర్పాటు చేసి మద్రాసు హార్బర్కు (Madras Harbor) బాక్స్-ఎన్ వ్యాగన్ల గూడ్స్ ద్వారా ఇనుప ఖనిజాన్ని రవాణా చేయడం ప్రారంభించారు.

రైల్వే ఆదాయం
తద్వారా రైల్వే ఆదాయం భారీగా పెరిగింది. యూనిగేజ్ ప్రాజెక్టులో భాగంగా- హొస్పేట్ -హుబ్లీ- వాస్కోడిగామా మద్య బ్రాడ్ గేజ్ రైలు మార్గం పూర్తి చేసి హుబ్లీ డివిజన్ మీదుగా మళ్లించారు. దాదాపుగా మూడున్నర దశాబ్దాల పాటు రాయలసీమ జిల్లాల మీదుగా మద్రాసు ఓడరేవు ద్వారా విదేశాలకు ఎన్ఎండిసి (NMDC) ఇనుప ఖనిజాన్ని రవాణా చేసింది. అయితే ప్రస్తుతం ఉన్న తోరణగళ్లు-రంజిత్ పురా సింగిల్ లైన్ రైలు మార్గానికి అదనంగా 23కి. మీల డబ్లింగ్ రైలు మార్గం ప్రాజెక్టు చేపట్టేందుకు రైల్వే శాఖ తాజాగా 5.458.835 అంచనా వ్యయంతో నిర్మించేందుకు డబ్లింగ్ రైలు మార్గం ప్రాజెక్టును మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏడాదికి అదనంగా 5.64 మిలియన్ టన్నుల సరుకు రవాణా పెరుగుతుంది.
గుంతకల్లు రైల్వే ఏ రైల్వే జోన్‌కు చెందుతుంది?
గుంతకల్లు రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే (South Central Railway – SCR)కి చెందిన డివిజన్‌గా ఉంది.
గుంతకల్లు రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది?
గుంతకల్లు రైల్వే స్టేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా పరిధిలో ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Kapila Tirtham: కపిలతీర్థం ఆలయం దర్శించుకోనున్నసిఎం చంద్రబాబు