हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Ghazal Srinivas: తెలుగు భాషా విధానంపై అంతర్జాతీయ లఘు చలన చిత్ర పోటీలు

Ramya
Ghazal Srinivas: తెలుగు భాషా విధానంపై అంతర్జాతీయ లఘు చలన చిత్ర పోటీలు

ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ (Ghazal Srinivas)

విజయవాడ: మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు-2026 సందర్భంగా ఆంధ్ర సారస్వత పరిషత్తు అథ్వర్యంలో తెలుగు భాషా వికాసంపై ‘అంతర్జాతీయ లఘు చలన చిత్ర పోటీలు నిర్వహించనున్నట్లు ఆ పరిషత్తు అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ (Ghazal Srinivas) తెలిపారు. తెలుగు భాష చారిత్రక వైభవం, ఆంధ్ర సారస్వత దీప్తి, తెలుగు భాషా వికాసం, తెలుగు వెలుగులు, తెలుగు భాషా రక్షణ ప్రాచుర్యం అంశాలుగా పోటీలు ఉంటాయని, చిత్ర ప్రదర్శన వేడుకకు భారతీయ విద్యా భవన్ ప్రాంగణం, గుంటూరు, అమరావతి (Amaravati) వేదికగా 14 సెప్టెంబు 2025 వరకు నిర్వహిస్తామన్నారు. లఘు చలనచిత్ర పోటీలలో పంపే ఎంట్రీలు నిడివి-5 నిముషాలు మాత్రమే ఉండాలని, 4 నిముషాలకు తక్కువగా ఉండరాదన్నారు. ఏ వయసు వారైనా పాల్గొనవచ్చని, రాజకీయ పార్టీల అంశాలు, విద్వేషాలు కల్గించే అంశాలు ఉండరాదని, జాతీయ సమైక్యతకు భంగం వాటిల్లే అంశాలు ఉండరాదని తెలిపారు. ఒకసారి పంపిన ఎంట్రీ వెనక్కు తీసుకోవడానికి వీలు కాదని లఘు చిత్రం యొక్క క్వాలిటీ 720/1040 మెగా ఫిక్సెల్ ఉండాలని, ఎంట్రీలు ఆగస్టు 14వ తారీఖుకు రావాలని తెలిపారు. ఎంట్రీలు ఎఎస్పిషార్ట్ఫిల్మాకాంటెస్ట్ అట్ ది రేట్ ఆఫ్ జి మెయిల్. కాం కు ట్రాన్సఫర్ ద్వారా పంపవల్సి ఉంటుంది.

తెలుగు భాషకు స్పూర్తిగా లఘు చిత్రాల పోటీ – 2026లో బహుమతులు

ఈ పోటీలకు (competitions) ముఖ్య సమన్వయ కర్తగా ప్రముఖ నటుడు, నిర్మాత లోహిత్కుమార్, సాకేత్ ఉదయగిరి, 9182612419 సహ సమన్వయ కర్తగా వ్యవహరిస్తారని తెలిపారు. ఎన్ఎసి తప్పక ముఖ్య సాంకేతిక సభ్యుల నుండి ఇవ్వాలని, ఒక సంస్థ రెండు ఎంట్రీలు వరకు ఇవ్వవచ్చని తెలిపారు. డాక్యుమెంటరీ, కథాపరమైన చిత్రాలు ఇందులో అనుమతించ బడతాయని, చిత్రాలు రాబోయే తరాల వారికి, తెలుగు జాతికి స్పూర్తి కల్గించే విధంగా ఉండాలి. తెలుగు భాష రక్షణకు స్పూర్తి కల్గించాలని కోరారు. మొదటి బహుమతి లక్ష రూపాయలు, రెండవ బహుమతి -75వేల రూపాయలు, మూడవ బహుమతి 50వేల రూపాయలు, మూడు ప్రశంసా బహుమతులు, ఒక్కొక్కరికి 10.116 బహుతులు, ఉత్తమ నటుడు, నటి, ఉత్తమ రచన, ఉత్తమ ఛాయాగ్రాహకులకు వ్యక్తిగత బహుమతులుంటాయని తెలిపారు. విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందచేయబడతాయని తెలిపారు. బహుమతి ప్రదానం 3వ ప్రపంచ మహాసభలు, గుంటూరు వేదికపైన 2026 జనవరి 3వ తారీఖున జరుగుతుందని విజేతలయిన చిత్రాలు, ప్రదర్శనలకు అర్హమైన చిత్రాలను ప్రపంచ తెలుగు మహాసభలలో ప్రదర్శిస్తామని రెడ్డప్ప దవేజి,పి. రామచంద్రరావు తెలిపారు. ఫేస్బుక్, యూ ట్యూబ్లలో ఇతర సామాజిక మాధ్యమాలలో అప్లోడ్ చేసుకోవాలని ఆంధ్ర సారస్వత పరిషత్తుకు సర్వ హక్కులు ఉంటాయని, పోటీలో పాల్గొనే వారు నిర్వాహకులు ఇచ్చిన ఆన్లైన్ లింక్లో చిత్రాలను అప్లోడ్ చేయాలని, ఈ పోటీల కోసమే లఘు చలనచిత్రాలు నిర్మించబడి ఉండాలని కోరారు.

మూడవ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఏ పోటీలు నిర్వహించబడుతున్నాయి?

తెలుగు భాషా వికాసంపై అంతర్జాతీయ లఘు చలన చిత్ర పోటీలు నిర్వహించనున్నట్టు గజల్ శ్రీనివాస్ తెలిపారు.

ఎంట్రీల నిడివి ఎంత ఉండాలి?

లఘు చిత్రాల నిడివి గరిష్ఠంగా 5 నిమిషాలు, కనీసం 4 నిమిషాలు ఉండాలి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: CM Pawan kalyan: ఉప్పాడ తీరం కోతకు శాశ్వత పరిష్కారం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870