భాష అర్థం చేసుకోకపోతే చెంపదెబ్బలు తప్పవు
బాల్ థాకరే గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఒకప్పుడు ముంబయిలో ఒక
వెలుగు వెలిగిన బాల్ థాకరే ‘శివసేన’ పేరుతో పార్టీ పెట్టి, జాతీయనాయకులను సైతం
గడగడలాడించారు. అయన తదనంతరం ఉద్దవ్ థాకరే, బాలాకరేల మధ్య విభేదాలు వచ్చి,
విడిపోయారు. దీనితో రాజ్ థాకరే (Raj Thackeray) మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) పేరుతో కొత్త పార్టీని పెట్టుకుని, తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. రాజకీయాలో తన ఉనికి చాటుకునే ప్రయత్నాల్లో భాగంగా పలు వివాదాస్పద వ్యాఖ్యల్ని చేస్తుంటారు. తాజాగా
మరాఠీభాషపై మరోసారి తనదైన హెచ్చరికలు చేశారు. మరాఠీని అర్థం చేసుకోకుంటే
చెంపదెబ్బలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ‘ఇప్పుడు మరాఠీని మీ చెవిలో చెప్పినా
అర్థం చేసుకోకపోతే, దానికిందే మీకు దెబ్బ తగులుతుంది, ఎలాంటి కారణం లేకుండానే
ప్రజలు గొడవ సృష్టిస్తారు’ అని తీవ్రవ్యాఖ్యలు చేశారు. మరాఠీ (Marathi) లో మాట్లాడనందుకు ఇటీవల ఎంఎన్ఎస్ కార్యకర్తలు కొందరు ఒక దుకాణ యజమానిపై దాడిచేసిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనపై వ్యాపారులు ఆందోళనకు దిగారు
దీనిపై థాకరే వివరణ ఇస్తూ, దుకాణదారు వ్యవహారం వల్లే అలా జరిగిందని చెప్పుకొచ్చారు.
మీరు ఎంత కాలం షాపులు మూసుకుని కూర్చుంటారు, అసలు మేం మీ వస్తువులను కొనడం
ఆపేస్తే మీ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మీరు ఎక్కడ నుంచి వచ్చారో మాకు తెలుసు,
గుట్టుచప్పుడు కాకుండా పనిచేసుకుంటూ పోవాలని, తెలివి తక్కువగా ప్రవర్తిస్తే చెంపదెబ్బ
తప్పదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్పై (Devendra Fadnavis) నా రాజాకరే నిప్పులు చెరిగారు.
రాజ్ ఠాక్రే ఎవరు?
రాజ్ ఠాక్రే మహారాష్ట్రకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. ఆయన పూర్తి పేరు శ్రీరామ థాకరే కానీ రాజకీయంగా రాజ్ ఠాక్రే (Raj Thackeray) అనే పేరుతో ప్రాచుర్యం పొందారు.
రాజ్ థాకరే ఏ పార్టీకి చెందినవారు?
రాజ్ థాకరే మహారాష్ట్ర నవనిర్మాణ సేన (Maharashtra Navnirman Sena – MNS) అనే రాజకీయ పార్టీకి స్థాపకుడు, నాయకుడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: SBI : ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకుగా SBI