విజయవాడ : రాష్ట్రంలో పనిచేస్తున్న వాణిజ్య పన్నుల శాఖఅధికారుల పనితీరు దేశానికే ఆదర్శమని వారు పనితీరులో ఎవ్వరికీ తీసిపోరని ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) అన్నారు. శుక్రవారం రాష్ట్ర వాణిజ్య పన్నుల సంస్థ కార్యాలయంలో జేసీ, డీసీ (జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు) లతో ఏర్పాటు చేసిన రెవెన్యూ వర్క్ షాపు కార్యక్రమానికి ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. సందర్భంగా మంత్రి అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ అనుభవాన్ని ఉపయోగించి సంస్థ మరింత పురోభివృద్ధి చెంది ఆదాయాన్ని ఆర్జించేలా కృషి చేయాల్సిన ఆవశ్యకత మనందరి పై ఉందని మంత్రి అన్నారు. అధికారులు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని వ్యాపారాలు చేసుకొనే ఏ ఒక్కరికీ ఇబ్బందులు కలగకుండా జీఎస్టీ పన్నుల రెవెన్యూను పెంచాలన్నారు. ఇందులో ఏ ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వ పరంగా అధికారులకు అండగా ఉంటామని తెలిపారు.

పన్నుల వసూళ్లలో వృద్ధి.. అభివృద్ధి కోసం సమర్థవంతంగా పని చేయాలి: ఆర్థిక మంత్రి పయ్యావుల
ఈ వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ల వర్క్షాపుల్లో ప్రసంగిస్తున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) ప్రభుత్వానికి రాష్ట్రంలో పెట్టుబడులు ఎంతముఖ్యమో అదే విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కూడా అంతే ముఖ్యమన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈఏడాది పన్నుల వసూళ్లలో వృద్ధి సాధించామని ఇందుకు టీమ్ గా పనిచేసిన (Worked as a team) సిబ్బందిని అభినందిస్తున్నానన్నారు. ఇదే స్ఫూర్పిని మున్ముందు కూడా కొనసాగించాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి అయ్యిందని ఇంకా మరింత బాధ్యతాయుతంగా అధికారులు, సిబ్బంది పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. నెలలోపు శాఖ ప్రగతిలో మార్పులు తప్పనిసరిగా కనిపించాలన్నారు. మన డాటాని ఆధారం చేసుకుని వ్యవస్థలో లోపాలతో పన్నులను ఎగ్గొట్టేవారికి మనం అంటే చూపించాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు. అదే స్ఫూర్తిని తీసుకుని నేను కూడా ఎంతో ఇష్టంగా పనిచేస్తున్నానన్నారు. ఇదే స్ఫూర్తితో ఉద్యోగులు కూడా సమర్థవంతంగా తమ సేవలను రాష్ట్రాభివృద్ధి కోసం ఉపయోగించాలన్నారు.
ఆర్థిక స్థిరత కోసం చర్యలు తీసుకోండి – అక్రమాలకు అడ్డు వేసే సమర్థవంతమైన వ్యూహాలు అవసరం: మంత్రి పయ్యావుల
రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాల యాక్షన్ ప్లాన్ (Action plan) తో ముందుకు వెళ్లుతుందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి అక్రమంగా వచ్చే ఆయిల్ తదితర దిగుమతులు చేసుకునే వాళ్లు పన్ను వసూళ్లు నుంచి తప్పించుకోకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వాటిని సమర్థవంతంగా అరికట్టాలన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్స్ ను సమర్థవంతంగా అరికట్టే విధంగా ఇతర శాఖలతో కలసి జాయింట్ కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని సంయుక్తంగా తనిఖీలతో వాటిని సరిచేయాలన్నారు. ఫీల్డ్ లో సమర్ధవంతంగా పనిచేసినప్పుడే మనం ఆశించిన రిజల్ట్స్ వస్తాయన్నారు. గత ప్రభుత్వం విధానాల వల్ల ఆర్థిక ఇబ్బందులు మన ప్రభుత్వానికి అందించిందని, వాటిని సరిచేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. వ్యాట్ పన్నులు పెంచేందుకు పనిచేసిన వారికి అవార్డులు అందిస్తామని మంత్రి తెలిపారు. యానాం నుంచి మన రాష్ట్రానికి డీజిల్ దిగుమతి అవుతుందనే సమాచారం ఉందని అలాంటి వాటిపై అధికారులు దృష్టి సారించాలన్నారు.
పన్నుల వసూళ్ల పెంపు కోసం మంత్రి పయ్యావుల కేశవ్ ఏమి సూచించారు?
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, అక్రమ వాణిజ్య కార్యకలాపాలను అరికట్టాలని ఆయన సూచించారు.
ఆర్థిక స్థిరత సాధించేందుకు మంత్రి ఏమి చర్యలు సూచించారు?
ఇతర శాఖలతో కలిసి జాయింట్ తనిఖీలు నిర్వహించి, అక్రమ రిజిస్ట్రేషన్లు అరికట్టాలని పయ్యావుల సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: CM Pawan kalyan: ఉప్పాడ తీరం కోతకు శాశ్వత పరిష్కారం