నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ (Bhanuprakash) చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి విడదల రజని (Rajani) ఈ వ్యాఖ్యలను ఖండించారు. మాజీ మంత్రి రోజా గారిపై మాట్లాడిన భానుప్రకాశ్ మాటలు మహిళల ఆత్మస్థైర్యాన్ని దిగజార్చేలా ఉన్నాయని రజని వ్యాఖ్యానించారు. “ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా టీడీపీ నేతల మహిళల పట్ల దృక్పథం ఏంటో బయటపడింది” అంటూ ఆమె మండిపడ్డారు.
క్షమాపణలు చెప్పాలని రజని డిమాండ్
భానుప్రకాశ్ చేసిన వ్యాఖ్యలు ఎంత దారుణమైనవో గుర్తించి అతను తక్షణమే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అని విడదల రజని డిమాండ్ చేశారు. మహిళను అగౌరవపరచేలా మాట్లాడడం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించదగిన పని కాదని ఆమె తెలిపారు. సమాజంలో మహిళల గౌరవాన్ని కాపాడాలంటే ఇటువంటి వ్యాఖ్యలకు రాజకీయ పార్టీలే ముందుగా అడ్డుకట్ట వేసేలా ఉండాలని రజని హితవు పలికారు.
వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు
“రూ.2 వేల కోసం రోజా ఏ పనైనా చేస్తుంది” అని గాలి భానుప్రకాశ్ వ్యాఖ్యానించినట్టు ఆరోపణలు రావడంతో, ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రజలు, రాజకీయ విశ్లేషకులు కూడా ఈ వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్నారు. మహిళల పట్ల రాజకీయ వేదికలపై అసభ్యంగా మాట్లాడడాన్ని ప్రజలు ఎప్పటికి సహించబోరని, రాజకీయ నాయకులు మరిచి పోకూడదని పలువురు హితవు పలుకుతున్నారు.
Read Also ; Fish Venkat : నటుడు ఫిష్ వెంకట్ మృతి