హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో జూలై 17, 2025న జరిగిన “పోలీయాక్ ఇమ్రే – వర్గా జానోస్ మెమోరియల్ 2025” రెజ్లింగ్ టోర్నమెంట్‌లో భారత యువ రెజ్లర్ సుజీత్ కల్కల్ (Sujeet Kalkal) అద్భుత విజయాన్ని సాధించాడు. 65 కేజీల పురుషుల ఫ్రీస్టైల్ విభాగంలో అజర్‌బైజాన్‌కు చెందిన నాలుగు సార్లు యూరోపియన్ పతక విజేత అలీ రహీమ్‌జాదేను 5-1 తేడాతో ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. ఇది భారత్‌కు ఈ ఏడాది ర్యాంకింగ్ సిరీస్ టోర్నీల్లో వచ్చిన తొలి స్వర్ణ పతకంగా నిలిచింది.ఫైనల్ మ్యాచ్‌లో సుజీత్ తొలి నుంచే విశ్వాసంతో పోరాడాడు. మొదటి పిరియడ్‌లో రహీమ్‌జాదే (Rahimzadeh) కు ఒక యాక్టివిటీ పాయింట్ ఇచ్చినప్పటికీ, రెండో పిరియడ్‌లో రెండు టేక్‌డౌన్లు, ఒక యాక్టివిటీ పాయింట్ సాధించి మొత్తంగా 5-1 స్కోర్ తో విజయం సాధించాడు. అతని సాంకేతిక నైపుణ్యం, క్లారిటీ, టెంపోని ఈ విజయం ప్రతిబింబిస్తోంది.
క్వార్టర్-ఫైనల్లో
ఇదే టోర్నీలో పురుషుల 57 కిలోల విభాగంలో భారత్‌కు మరో పతకం దక్కింది. కాంస్య పోరులో భారత రెజ్లర్ రాహుల్ 4-0తో జర్మనీకి చెందిన నిక్లాస్ స్టెచెలే (Niklas Stachele) పై విజయం సాధించి బ్రాంజ్ దక్కించుకున్నాడు. అంతకుముందు జరిగిన క్వార్టర్-ఫైనల్లోరాహుల్ 5-3 తేడాతో కొరియాకు చెందిన కిమ్ సంగ్‌ను ఓడించాడు. కానీ సెమీఫైనల్లోరాహుల్ 6-7 తేడాతో అమెరికా రెజ్లర్ ల్యూక్ జోసెఫ్ చేతిలో ఓటమిపాలయ్యాడు.ఇతర పోటీల్లో భారత్‌కు చెందిన ఉదిత్(61 కిలోల విభాగం), విక్కీ(97 కిలోల విభాగం) ఓటమిపాలయ్యారు. ఈ టోర్నీలో పొందే ర్యాకింగ్ పాయింట్స్.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో క్రొయేషియా (Croatia) లోని జాగ్రెబ్ వేదికగా జరిగే వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో సీడింగ్ పొందేందుకు ఉపయోగపడుతాయి.
రెజ్లింగ్‌ను ఎవరు కనిపెట్టారు?
రెజ్లింగ్ అనేది మనిషి చరిత్రలో అత్యంత పాత క్రీడలలో ఒకటి. ఇది వేయిల సంవత్సరాల క్రితం పుట్టినట్లు ఆధారాలు ఉన్నాయి. రెజ్లింగ్‌కు ప్రత్యేకంగా కనుగొన్న వ్యక్తి లేదా ఒకే సంస్కృతి అనే విషయం చెప్పడం సాధ్యపడదు. ఎందుకంటే ఇది ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో స్వయంగా అభివృద్ధి చెందిన క్రీడ.
రెజ్లింగ్‌లో మూడు ముఖ్యమైన శైలులు ఏవి?
రెజ్లింగ్‌లో మూడు ప్రధాన శైలులు ఉన్నాయి. అవి: folkstyle, freestyle, and Greco-Roman.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Mohammed Siraj: సిరాజ్‌పై ప్రశంసలు కురిపించిన ర్యాన్ టెన్ డస్కాటే