అత్తింటి వేధింపులతో తీవ్ర మానసిక క్షోభకు గురైన ఓ ఇల్లాలు.. విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. తన శరీరంపైనే సూసైడ్ నోట్ రాసి(Suicide Note).. వివాహిత(Married) ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో(Uttara Pradesh) వెలుగుచూసింది. పెళ్లైన కొద్ది రోజుల నుంచే భర్త, అతడి కుటుంబసభ్యులు అదనపు కట్నం కోసం వేధించి, చిత్రహింసలకు గురిచేసినట్టు బాధితురాలు ఆరోపించింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. భాగ్‌పత్ జిల్లాకు చెందిన మనీషా(Manisha) (28)కు నొయిడాకు చెందిన కుందన్ అనే వ్యక్తిత 2023లో వివాహం జరిగింది.

కారుతో పాటు అదనపు కట్నం కోసం వేధింపులు
పెళ్లి సమయంలో మనీషా తల్లిదండ్రులు కట్నం కిందట రూ.20 లక్షలు, బుల్లెట్ ఇచ్చారు. కానీ, వివాహమైన కొద్ది నెలల నుంచే అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. కారుతో పాటు అదనపు కట్నం తీసుకురావాలని వేధించారు. వారు చెప్పినట్టు చేయలేదని కరెంట్ షాక్‌తో చంపడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో రోజు రోజుకూ వారి ఆగడాలు ఎక్కువ కావడంతో తట్టుకోలేక జులై 2024లో పుట్టింటికి వచ్చేసింది. ఆమె పరిస్థితిని అర్ధం చేసుకున్న తల్లిదండ్రులు విడాకుల కోసం ప్రయత్నించారు.
పొట్ట మీద హిందీలో సూసైడ్ నోట్
మనీషా తన చేతులు, కాళ్లు, పొట్ట మీద హిందీలో సూసైడ్ నోట్ రాసుకుంది. అందులో “నా చావుక కారణం భర్త కుందన్, అతడి కుటుంబమే” అని ఆమె పేర్కొంది. అంతేకాదు, ఓ సెల్ఫీ వీడియోనకూ కూడా రికార్డు చేసిన మనీషా.. ‘తన భర్త, అత్త, మామ, మరిది కలిసి కట్నం పేరుతో వేధించారని కన్నీటిపర్యంతమైంది.
బలవంతంగా అబార్షన్
అలాగే, తనను చిత్రహింసలకు గురిచేశారని, ఒకసారి బలవంతంగా అబార్షన్ కూడా చేయించారని ఆమె వీడియోలో ఆమె వెల్లడించారు. ఆఖరికి అదనపు కట్నం తీసుకురాలేదని కరెంట్ షాకుతో చంపే ప్రయత్నం చేశారని తెలిపింది. 2023లో కుందన్‌తో పెళ్లైన కొద్ది నెలల వ్యవధిలోనే వేధింపులు మొదలయ్యాయని బాధితురాలు పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీడియో, సూసైడ్ నోట్ ఆధారంగా కేసులో నిందితులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Indore : మరోసారి క్లీన్ సిటీగా ఇండోర్.. అవార్డు అందజేసిన రాష్ట్రపతి ముర్ము