తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో నిర్వహించిన కార్యకర్తల సభలో ఓ ప్రత్యేకమైన ఫ్లెక్సీ అందరినీ ఆకట్టుకుంది. “3.0 లోడింగ్.. 2028లో రప్పా రప్పా వడ్డీతో సహా చెల్లిస్తాం” అనే సృజనాత్మక నినాదంతో రూపొందించిన ఫ్లెక్సీ సభకు హైలైట్గా నిలిచింది. ఈ ఫ్లెక్సీలో కేటీఆర్ (KTR) కు తలపాగా కట్టిన ఫోటోను చేర్చి, ఆయన వచ్చే సమయంలో పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న సంకేతాన్ని ఇచ్చేలా రూపొందించారు. ఫ్లెక్సీ చుట్టూ కార్యకర్తలు సందడి చేస్తూ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అవి వెంటనే వైరల్ అయ్యాయి.

ఖమ్మంలో కేటీఆర్ పర్యటనకు భారీ స్పందన
ఈరోజు ఖమ్మం జిల్లాలో (Khammam district) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పర్యటించారు. కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో ఆయన, బీఆర్ఎస్ త్వరలో తిరిగి అధికారంలోకి వస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడే ఎన్నికలు జరిగితే 100 సీట్లు సాధించగలమన్న ధీమా ఆయన చూపించారు. ఆయన మాటలతో కార్యకర్తల్లో ఉత్సాహం మరింత పెరిగింది.
కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ గట్టి విమర్శలు
తన ప్రసంగంలో కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “రేవంత్ రెడ్డి లాంటి దుర్మార్గులను అంబేద్కర్ గారు కూడా ఊహించలేరు” అంటూ విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు ప్రజలను మోసం చేస్తున్నారని, అన్ని రంగాల్లో అవినీతి పెరిగిందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పతనమవుతుందని భవిష్యత్తు జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రతి ఒక్కరినీ, ప్రతి రంగాన్ని మోసం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Rain Alert: హైదరాబాద్లో కురుస్తున్న భారీవర్షాలు..హెచ్చరించిన వాతావరణ శాఖ