हिन्दी | Epaper
అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’ అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’ అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’ అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’

Padmanabhaswamy Temple Treasure : ఆలయాల్లో అనంత సంపద

venkatesh
Padmanabhaswamy Temple Treasure : ఆలయాల్లో అనంత సంపద

Padmanabhaswamy Temple Treasure : 100 కోట్లు.. వెయ్యికోట్లు.. లక్షకోట్లు.. ఇలా అపరిమితమైన ఆదాయం వచ్చే అనంత సంపద కలిగిన ఆలయాలు మనదేశంలో ఒకటి, రెండు కాదు.. ప్రతిరాష్ట్రంలో రెండుమూడైనా ఉన్నాయి. లెక్కించిన సంపదే అంత ఉంటే, ఇక లెక్కల్లోకి రానిది నిజంగా అనంతమే. ఆలయాల సంపద అగణితంగా పెరగడానికి భక్తులలోని మతవిశ్వాసం కావచ్చు, ప్రభువులు లేదా అధికార పెద్దలలోని అభద్రతాభావం కావచ్చు. మాన్యాల మీద వచ్చే ధాన్యాలు కావచ్చు. కారణమేదైనా ఆలయసంపద మాత్రం అపారం. అందుకే ప్రభుత్వాల కన్ను తొలుత దానిపైనే పడుతూంటుంది. ఆలయ నిర్వహణ బోర్డుల దృష్టి కూడా దానిపైనే ఉంటుంది. కొన్ని పెద్ద ఆలయాల ట్రస్టుబోర్డుల నాయకత్వం కోసం ఒక్కొక్కసారి చాలా అధికమైన పోటీయే ఏర్పడుతూంటుంది. ట్రస్టుబోర్డు సభ్యుడుగానైనా కావడానికి పెద్దపెద్ద రాజకీయ నాయకులు సైతం ప్రయత్నించడం చూస్తుంటాం. వ్యాపారవేత్తలు సరేసరి. సంవత్సరానికి 100 కోట్లుపైగా ఆదాయం వచ్చే ఆలయాలు మనదేశంలో కొన్ని డజన్లుపైగా ఉన్నాయి.

Padmanabhaswamy Temple Treasure :

ఈ ఆలయాలలోకి ప్రవేశించడానికి చాలామంది అందుకే మొగ్గు చూపుతుంటారు. ఆ ఆలయాల ట్రస్టుబోర్డు మెంబర్ కావడాన్ని చాలా ప్రత్యేకమైన హోదాగా భావిస్తుంటారు కూడా. దానిలో దైవభక్తి కొంత, ఇతర విషయాలపై అనురక్తి మరికొంత. అటువంటి సంపద ఆలయాలలో తిరువనంతపురంలోని అనంతపద్మనాభస్వామి ఆలయాన్ని ప్రధానంగా చెప్పుకోవచ్చు. తరువాత తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం(Tirumala Temple), ముంబయిలోని సిద్ధివినాయక్ ఆలయం, షిర్డీ సాయిబాబా, అమృత్సర్ స్వర్ణాలయం, మధురమీనాక్షి, గుజరాత్ సోమనాథ్ ఆలయం, శబరిమల అయ్యప్ప, పూరీ జగన్నాథస్వామి, ఢిల్లీ స్వామి నారాయణ్ ఆలయం, జమ్ము వైష్ణోదేవి ఆలయం, వారణాసి విశ్వనాథ ఆలయం చెప్పవచ్చు. ఈ ఆలయాలన్ని చాలావరకు పురాతనమైనవే.

షిర్డీబాబా వంటి కొన్ని ఆలయాలు మినహాయిస్తే మిగిలినవాటికి కొన్ని వందల సంవత్సరాల ఘనమైన చరిత్రే ఉంది. ఈ ఆలయాలలో నిక్షిప్తమై ఉన్న సంపద ఎంత? అనే ప్రశ్నకు కచ్చితమైన లెక్కలు ఎవరూ చెప్పలేకపోయినా, మొన్న అనంతపద్మనాభస్వామి ఆలయంలో లభించిన సంపద, ఇప్పుడు పూరీ జగన్నాథస్వామి ఆలయంలో కనుగొన్న సంపదను చూస్తుంటే కనీసం లెక్కించడం కూడా సాధ్యం కానంత ఉన్నదనే విషయం అర్థమవుతుంది. క్రీస్తుపూర్వం రెండు, మూడు శతాబ్దాల నుంచి క్రీ.శ 16,17వ శతాబ్దం వరకు భారీ ఆలయాల నిర్మాణం జరుగుతూనే ఉంది. 18వ శతాబ్దం నుంచి ఆధునిక రీతిలో ఆలయనిర్మాణం కొనసాగుతోంది. కొన్ని ప్రాచీన ఆలయాలలో నేలమాళిగలు కూడా ఉంటాయి. తమిళనాట ఇటువంటి ఆలయాలు ఎక్కువగా కనిపిస్తాయి. గుజరాత్లో కూడా ఉన్నాయి.

తెలియనివి ఇంకా ఉండవచ్చు. ఈ ఆలయాలు నేలమాళిగలలో ఉన్న గుప్త సంపద నిజంగా అపారమే. గతంలో మహారాజులు, చక్రవర్తులు నిక్షిప్తం చేసిన సంపద అది. ముఖ్యంగా మహమ్మదీయుల దండయాత్రల సమయంలో తమ సంపదనంతా ఆలయాలు నేలమాళిగల్లో వారు దాచి ఉంచేవారు. తాము అత్యధికంగా విశ్వసించే వారికి మాత్రమే ఆ వివరాలు చెప్పేవారు. ఆలయాలను ధ్వంసం చేసి ఆ సంపదనంతా కొల్లగొట్టి పట్టుకువెళ్లిన మహమ్మదీయ రాజులు, మనదేశంలోనే తిష్ఠవేసి ఆ సంపదను అనుభవించిన విదేశీ ప్రభువుల చరిత్ర మనకు పేజీల కొద్దీ దొరుకుతుంది. ఆ దాడులను తిప్పికొట్టి, ఆలయాలను మన రాజులు, చక్రవర్తులు తిరిగి స్వాధీనం చేసుకొని ఆ సంపదను పరిరక్షించిన సందర్భాలూ ఉన్నాయి. అలాగే దండయాత్రలు చేసి కొత్త రాజ్యాలను తమ ఏలుబడిలోకి తెచ్చుకొన్న తర్వాత మహారాజులు ఆలయాలకు భారీగా కానుకల సమర్పించిన ఉదంతాలు అనేకానేకం.

శ్రీకృష్ణదేవరాయలు వంటి చక్రవర్తులు ఎన్నోసార్లు వజ్రవైఢూర్యాలను, మణిమాణిక్యాలను, అత్యంత విలువైన ఆభరణాలను, వందలు, వేలకొద్దీ ఎకరాల భూసంపదను ఆలయాలకు కానుకగా ఇచ్చినట్లు చరిత్రలో చూస్తున్నాం. తెలుగు, కన్నడ, తమిళప్రాంతాలలో సంపన్న ఆలయాలు అధిక సంఖ్యలో కనిపించడానికి అటువంటి రాజులు, చక్రవర్తులే కారణం. దానికి ముందు గుప్తుల కాలంలో కూడా ఎన్నో ఆలయాలు సకలసంపదలతో తులతూగినట్లు చరిత్రలో తెలుస్తుంది. అందుకే విదేశీయుల కన్ను ముందుగా మన ఆలయాలు, వాటి సంపదపై ఎక్కువగా పడుతూంటుంది.

స్వాతంత్ర్యానంతరం ఈ ఆలయాలపై అధికారం కొన్నిచోట్ల ట్రస్టుబోర్డుల చేతుల్లోకి మరి కొన్నిచోట్ల ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లడంతో కథ మారింది. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఈ ఆలయాల అభివృద్ధికి కృషి కూడా ఎక్కువే జరిగింది. అప్పటి నుంచే ఆ ఆలయాల సంపదపై కూడా పాలకుల దృష్టి పడుతూవచ్చింది. దాని ఫలితంగానే ‘లెక్కింపు’ మొదలైంది.

పూరీ ఆలయ సంపద ఎంత?
మనదేశంలోని ప్రాచీన విశిష్ట ఆలయాలలో పూరీ జగన్నాథస్వామి ఆలయం చాలా ముఖ్యమైనది. దాదాపు 1800 సంవత్సరాల క్రితం నాటి ఈ ఆలయం ప్రత్యేకతలు అన్నీఇన్నీ కావు. అలాగే సంపద కూడా. అనంత పద్మనాభస్వామి ఆలయం నేలమాళిగల్లో ఎంత విలువైన సంపద ఉన్నదో తెలిసేవరకు తిరుమల ఆలయసంపదే ప్రథమస్థానం అనుకొనేవారు. కానీ 2012లో పద్మనాభస్వామి సంపద లెక్కింపు ప్రారంభమైన తర్వాత మనదేశంలో అంతకుమించిన సంపద కలిగిన ఆలయం లేదని తేలింది. ఆలయంలోని ఆరు నేలమాళిగాల్లో ఇప్పటికి ఐదు తెరవగలిగారు. వాటిలో బయటపడిన సంపదే దాదాపు ఐదులక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా.

అంతకాకపోయినా, పూరీ జగన్నాథస్వామి ఆలయంలో కూడా అపారనిధినిక్షేపాలు ఉన్నట్లే ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఒడిశాలోని పూరీలో ఉన్న ఈ ఆలయాన్ని 1136 సంవత్సరంలో చోడగంగరాజు నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది. సంప్రదాయం, సైన్స్ సమ్మిళితమైన ఈ ఆలయం చరిత్ర మరింత లోతుగా పరిశీలిస్తే క్రీ.శ. 318లోనే ఉజ్జయిని రాజు ఇంద్రద్యుమ్నుడు నిర్మించినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడున్న ఆలయాన్ని మాత్రం 1136 సంవత్సరంలో అనంతవర్మన్ చోడగంగ దేవ నిర్మించినట్లుగా చెబుతారు.

16వ శతాబ్దందాకా ఆలయంలో చాలా మార్పులు జరిగాయి. మొత్తం 18సార్ల దండయాత్రలకు, దోపిడీలకు గురైన ఈ ఆలయం సంపద ఇంత అని చెప్పలేం కానీ, లక్షల కోట్లే ఉంటుంది. పర్యాటకపరంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయాన్ని యేటా కొన్ని లక్షలమంది సందర్శిస్తుండడంతో ఆదాయం కూడా అదేస్థాయిలో వస్తూంటుంది. యేటా వచ్చే ఆదాయంగాక, గతంలో మహారాజులు, చక్రవర్తుల నుండి లభించిన సంపద ఒక ప్రత్యేకమైన ‘రత్నభండార్ లో కొన్ని శతాబ్దాలుగా అలాగే ఉంచారు. ఆ భాండార్ను అప్పుడప్పుడు తెరచి మరమ్మతులు చేసినా రాజవంశీకుల అధీనంలోనే ఉండడంతో ‘ఇతరుల’ కన్ను పడకుండా వస్తోంది.

స్వాతంత్య్రానంతరం రెండుసార్లు మాత్రమే దానిని తెరచినట్లు తెలుస్తోంది. చివరిసారిగా ఈ ఖజానాను 1978లో తెరిచారనీ, అప్పట్లో దానిలోని సంపదను లెక్కించడానికే 70రోజులు పట్టిందనీ చెబుతారు. తాము అధికారంలోకి వస్తే ఆ భాండాగారాన్ని తెరిపించి సంపద వివరాలు ప్రజలకు తెలియచేస్తామని బిజెపి హామీ ఇవ్వడం, ఆపార్టీ ప్రభుత్వమే ప్రస్తుతం అధికారంలోకి రావడంతో ఇచ్చిన హామీ మేరకు భాండాగారాన్ని తెరిపించడం జరిగింది. ఈ నేపథ్యంలో, ఒడిశా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16మంది సభ్యుల ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైంది.

జూలై 14న ‘భండార్ ‘ను తెరవాల్సిందిగా ఈ కమిటీ చేసిన సిఫారసుతో ప్రభుత్వం మొత్తానికి సంపదను బహిర్గతం చేసిందిగాని అప్పటి నుంచే అందరిలో కొత్త ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఈ సంపద ఎంత? అనేది ఇప్పుడే తెలియకపోవచ్చు. ఎందుకంటే లెక్కింపు జరపడానికి ముందు ఇంకా చాలా తతంగమే ఉంది. భండార్లోని బయట, లోపలి ఖజానా గదులలో లభించిన నిధినిక్షేపాలన్నిటిని బయటకు తెచ్చి ప్రత్యేకంగా నిర్మించిన రెండు స్ట్రాంగ్రూమ్’లలో భద్రపరిచారు. చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లున్న ఈ ‘స్ట్రాంగ్రూమ్’లలో ఆ నిధి అంతా కొంతకాలం ఉంటుంది. భండార్లోని గదుల మరమ్మతులు పూర్తయిన తర్వాత మళ్లీ మొత్తం నిధిని అక్కడు చేర్చి తరువాత లెక్కింపు ప్రారంభిస్తారు. ఆ తర్వాతే సంపద మొత్తం విలువ వెలుగులోకి రావచ్చు.

‘రహస్య గది’లో ఏం దొరికింది?
భండార్లోని బయట (బాహర్భండార్), లోపల (భితరాభండార్) గదులుగాక మరో ‘రహస్య మందిరం’ కూడా ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ మందిరం గురించి ఆకాలంనాటి కొందరికి తెలిసినా, ఇప్పటివారికి ఏమీ తెలియదు. కొన్ని శతాబ్దాలుగా ‘ఒడిశా రాజవంశాలకు చెందిన రాజులతో పాటు నేపాల్ పాలకులు సైతం తమ సంపదనంతా ఆ రహస్య మందిరం’లో దాచి ఉంచినట్లు తెలుస్తోంది. ఆ నిధి అంతా ఈ ‘రహస్య మందిరం’లో ఉన్నట్లు కనుగొనడంతో అమితాశ్చర్యం కలుగవచ్చనే అంటున్నారు. ఆ మొత్తం విలువ తెలిస్తే దాదాపు 46 సంవత్సరాల తర్వాత తెరుచుకున్న జగన్నాథుని ఖజనా ‘రత్న భండార్ లో 1978 నాటి లెక్కల ప్రకారం కొన్ని ఉన్నట్లు తేలింది. 15 చెక్కపెట్టెల్లో స్వర్ణాభరణాలు ఉన్నాయట.(Padmanabhaswamy Temple Treasure)

Padmanabhaswamy Temple Treasure

1805లో అప్పటి పూరీ కలెక్టర్ ఛార్లెస్ గ్రోమ్ రూపొందించిన నివేదిక ప్రకారం బంగారు, వెండి నాణాల లెక్క మాత్రమే తెలిసింది. 1950 తర్వాత జగన్నాథ ఆలయ పరిపాలన చట్టం అమలులోకి వచ్చినపుడు రూపొందించిన ‘రికార్డ్ ఆఫ్ రైట్స్’ ప్రకారం బయటి గదిలో బంగారు ఆభరణాలు, లోపలి గదిలో 180 రకాల వెండి, హారాలు ఉన్నట్లు తెలిసింది. 1978లో రూపొందించిన జాబితా ప్రకారం రెండు గదుల్లోను రాళ్లు 44 బంగారు ఆభరణాలు, 221 కిలోలు పైగా వెండి వస్తువులు ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ లెక్కలన్నిటి మధ్య సరైన పొంతన లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

వాస్తవ నిధికి, సంబంధిత అధికారులు చెబుతున్న లెక్కలకు మధ్య చాలా తేడా ఉన్నదని ఆలయానికి చెందిన అర్చక వంశీయులు అంటున్నారు. అలాగే రాజ వంశీకులు చెబుతున్న లెక్కలు కూడా భిన్నంగానే కనిపిస్తున్నాయి. తాజాగా లెక్కలు వేసి వివరాలు తెలిసిన తర్వాతనే వాస్తవమేమిటో తెలియగలదని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పూరీ శ్రీక్షేత్రం రత్నభాండాగారం దిగువన రహస్య గది ఉందనీ, సొరంగ మార్గం ద్వారా వెళ్లగలిగే ఆ గదిలో చాలా విలువైన సంపద దాచారనీ కొందరు చరిత్రకారులు చెబుతున్నారు.

1902లోనే ఈ సొరంగ మార్గం అన్వేషణకు ప్రయత్నించి విఫలమయ్యారనీ, దానిపై ఇప్పుడు దృష్టి పెట్టాలనీ అంటున్నారు. పూరీ రాజు కపిలేంద్ర దేవ్ తూర్పున, దక్షిణ ప్రాంతాలను జయించిన తర్వాత అక్కడి నుంచి తెచ్చిన సంపదనంతా జగన్నాథునికి సమర్పించినట్లు చరిత్రలో ఉంది. రహస్య గదిలో ఆ నిధి వున్నదనీ, దానిలో 34 బంగారు కిరీటాలు, రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు ఉన్నాయనీ చరిత్ర చెబుతోంది. ఇప్పుడు ఆ వివరాలన్నీ చెబుతారా? అన్నది చూడవలసి ఉంది. ఉత్కళ సామ్రాజ్యం మీద ముస్లిం దండయాత్రలు చాలాసార్లు జరిగాయి. అయితే నిధులు వారి బారిన పడకుండా జగన్నాథుని రహస్య గదుల్లోను, సొరంగ మార్గం గదుల్లోను దాచారని కూడా తెలుస్తోంది. ఆ వివరాలు కూడా బయటకు రావలసి ఉంది.

అసలు తాళాలు మాయం?
రహస్య గది అసలు తాళాలు మాయమయ్యాయనీ, డూప్లికేట్ తాళాలను ఉపయోగించినా తెరచుకొనకపోతే వాటిని పగులగొట్టి అధికార బృందం లోపలికి వెళ్లిందనీ అంటున్నారు. అసలు తాళాలు ఎందుకు మాయమయ్యాయి? డూప్లికేట్ తాళాలు ఎవరు చేయించారు? అనే అంశాలపై తప్పక దర్యాప్తు జరిపించవలసి ఉంది. ఏదో విధంగా తాళాలు తెరచుకున్నాయి గదా అని వదిలేస్తే, ఎంతో సంపదకు సంబంధించిన వివరాలు పూర్తిగా మరుగున పడే అవకాశం ఉంది. 2018లో ఒకసారి హైకోర్టు భాండార్ తెరవాల్సిందిగా దేశాలు జారీ చేసింది. అయితే తాళాలు మాయమయ్యాయనే వంకతో రహస్య గదిని తెరవకుండా చేశారు. అనంత పద్మనాభస్వామి ఆలయంలో మాదిరిగా ‘నాగబంధం’ వంటిదేమీ లేకపోవడంతో భాండార్ గదులు తేలికగానే తెరవగలిగారు. అందుకే ఎక్కువ అనుమానించవలసి వస్తోందని కూడా పరిశీలకులు అంటున్నారు.

జులై 14, 18న రెండు పర్యాయాలు భాండార్ గదులను తెరచి తాము చూసిన నిధి నిక్షేపాల వివరాలు నిబంధనల ప్రకారం ప్రస్తుతం వెల్లడించలేమనీ, లెక్కింపు తర్వాతనే అన్ని వివరాలు తెలుస్తాయనీ ఒడిశా న్యాయ శాఖమంత్రి పృథ్వీరాజ్ అంటున్నారు. భాండార్ నుంచి అధికారులు నిధుల బాక్సులను బయటికి తెస్తుండగా ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాయి కూడా తర్వాత ఒక ప్రకటన చేస్తూ అన్ని వివరాలు పారదర్శకంగా ప్రజలకు వెల్లడిస్తామని అన్నారు. దీనినిబట్టి నిధికి సంబంధించిన వాస్తవాలు తప్పక వెలుగు చూస్తాయనే అనుకోవాలి.

సొరంగ మార్గం ఎక్కడ ఉంది?

Padmanabhaswamy Temple Treasure

ఆలయంలోని రత్న భండార్ నుంచి రాజ ప్రాసాదం వరకు సొరంగ మార్గం ఉందనీ, ఆ మార్గం మధ్యంలో ఉన్న గదుల్లో అనంతమైన సంపద ఉందనీ చరిత్ర గ్రంథాలలో ఉంది. కానీ ఇప్పుడు ఆ మార్గం గురించి అధికారులు నోరు మెదపకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. జగన్నాథుడికి సేవలందించే జగన్నాథ స్వయిన్ మహాపాత్ర చెబుతున్న ప్రకారం కూడా సొరంగ మార్గం ఉన్నదనీ, దానిలో ఐదు రహస్య గదులున్నాయనీ తెలుస్తోంది. ప్రస్తుత పూరీ రాజు గజపతి దివ్యసింగ్తోవ్ 1971లో కొత్త రాజప్రాసాదం నిర్మించారు. అంతకుముందు బలిసాహిలో పురాతన రాజమహల్ ఉండేది. ఈ కొత్త రాజప్రాసాదానికి కూడా సొరంగ మార్గం ఉన్నదనీ, పాత మహల్ నుంచి చాలా సంపదను రాజవంశీకులు ఈ కొత్త మహల్కు చేర్చారని కూడా తెలుస్తోంది. దానిపై సమగ్ర విచారణ జరగవలసి ఉంది. అసలు జగన్నాథుని సంపద ఎంతో తెలియాలంటే ఈ వివరాలన్నీ కూడా బహిర్గతం కావాలి. ఎఎస్ఐ(ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా) దానిపై సమగ్ర పరిశోధన జరిపితే చాలా రహస్య విషయాలు వెలుగులోకి వసాయి.

పూర్తిగా తేలని ‘పద్మనాభుని’
Padmanabhaswamy Temple Treasure : సంపద తిరువనంతపురంలోని ప్రాచీన అనంత పద్మనాభస్వామి ఆలయంలోని నేలమాళిగలలో లక్షన్నర కోట్లు విలువ చేసే అపార సంపద బయల్పడినట్లు తొలుత వెల్లడించారు. 2012లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ లెక్కింపు మొదలయింది. ఆరు మాళిగలలో చివరిది తెరిచే విషయం ఇంకా అస్పష్టంగానే ఉంది. వివాదాలు, ఊహాగానాలు నడుస్తూనే ఉన్నాయి. ఐదు మాళికగల్లోని సంపద ఇప్పటికి ఐదు లక్షల కోట్లు దాటిందనీ, ఇంకా పెరగవచ్చని అంటున్నారు. అక్కడి లెక్కింపు కూడా అసమంద్రంగానే ఉంది. లెక్కింపును డిజిటలైజ్ చేయడానికి ప్రత్యేక యంత్రం రూపొందించారుగానీ ఎవరి అలసత్వమో, లేక ఇతర కారణాలేమిటోగానీ ఇంతవరకు పూర్తి వివరాలు బయటకు రాకపోవడం ఆశ్చర్యకరం. నేలమాళిగల్లో 1860లో మూసివేసిన కొన్ని గదులకు 1950లో సీల్ వేశారు.

Padmanabhaswamy Temple Treasure

రాజకుటుంబీకుల పర్యవేక్షణలో ఉన్న ఆలయ సంపదను లెక్కించాలంటూ ఒక న్యాయవాది సుప్రీంకోర్టులో దావా వేయడంతో తేనెతుట్టె కదిలింది. బంగారు కొబ్బరికాయలు, బంగారు శంఖాలు కొన్ని డజన్ల సంఖ్యలో ఉన్న ఆలయ సంపద ఇంత అని చెప్పలేం. రెండు వేల కంఠాభరణాలు ‘దొరికిన’ జాబితాలోనే వున్నాయంటే వాటి విలువ లెక్కకట్టగలమా! ‘నాగబంధం’ రక్షణగా ఉన్న ఆరో గది కూడా తెరవగలిగితే బయల్పడే సంపదకు అంకెలు చాలవేమో! పూరీ జగన్నాథుని ఆలయం, తిరువనంతపురం అనంత పద్మనాభుని ఆలయం సంపదలే (Padmanabhaswamy Temple Treasure) ప్రస్తుతం ఎంతో మిస్టరీగా వుంటే, ఇంకా అగళిత సంపద వున్న మిగిలిన ఆలయాల వరాలు తెలిస్తే మరింత ఆశ్చర్యం కలుగుతుంది. అందుకే మన దేశాన్ని ‘సోనేకి చిడియా’ అంటే ‘బంగారు పిచ్చుక అంటారు. అది నిజంగా నిజమే. పురాతన దేవాలయాలు, కోటలు, సొరంగాలలో ఇప్పటికీ దాగి వున్న సంపదను వెలికితీయగలిగితే, నిజాయితీగా దానిని బహిర్గతం చేయగలిగితే ఇండియాలో ప్రతిఒక్కరు బిలయనీరే అవుతారు. బీహార్లోని సోన్ భండార్ గుహలు, కర్ణాటకలోని మూకాంబిక ఆలయం, రాజస్థాన్లోని జైఘర్ కోట వంటిచోట్ల నిక్షిప్తమై ఉన్న నిధుల గురించి కూడా వెలుగులోకి రావలసి ఉంది. తిరుమలేశుని ఆలయం కూడా ఆ వరుసలోనిదే!(Padmanabhaswamy Temple Treasure)

Read This : https://vaartha.com/category/cover-stories/

Read Also : 270 ఏళ్ల తర్వాత పద్మనాభస్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870