తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi Raju). గోవా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్న నేపథ్యంలో, పార్టీకి తన ప్రాథమిక సభ్యత్వంతో పాటు రాజకీయ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
గోవా గవర్నర్‌గా ఎంపిక… ఆ తర్వాతి చర్యలు
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయనను గోవా గవర్నర్ (Governor of Goa) గా నియమించింది. త్వరలోనే గోవా గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిణామం నేపథ్యంలో తనకు ఇప్పటివరకు అనేక అవకాశాలు కల్పించిన టీడీపీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, టీడీపీ పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు, పల్లా శ్రీనివాసరావులకు రాజీనామా లేఖ పంపారు.

ఎన్టీఆర్ హయాంనుంచి రాజకీయ యాత్ర
దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ హయాం నుంచి ఇప్పటి వరకు టీడీపీలో పనిచేసేందుకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఏడు సార్లు ఎమ్మెల్యే…ఎంపీగా ఒకసారి బాధ్యతలు
అశోక్ గజపతి రాజు (Ashok Gajapathi Raju) టీడీపీలో సీనియర్ నేత. విజయనగరం అసెంబ్లీ నియోజవర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీగా ఒకసారి గెలుపొందారు. అశోక్ గజపతి రాజు తన తండ్రి పీవీజీ రాజు బాటలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అశోక్ గజపతి రాజు తొలిసారిగా 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా ఏపీ శాసనసభకు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పటి నుంచి అశోక్ గజపతి రాజు పార్టీలో కొనసాగుతున్నారు.
1983లో టీడీపీ నుంచి పోటీ చేసిన అశోక్ గజపతిరాజు రెండవసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో కూడా విజయనగరం నుంచి విజయం సాధించారు. అయితే, 2004లో అశోక్ గజపతిరాజు ఓటమి పాలయ్యారు. కానీ, 2009లో తిరిగి అక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా కూడా పనిచేశారు.
గౌరవంగా ముగిసిన రాజకీయ ప్రస్థానం
2014లో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన అశోక్ గజపతి రాజు ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాణ శాఖ మంత్రిగా చేశారు. 2018లో ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చేవరకు ఆయన కేంద్ర మంత్రిగా కొనసాగారు. 2019 ఎన్నికల్లో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మరోసారి బరిలో నిలిచిన ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.
కుటుంబ రాజకీయాల్లో వారసత్వం
అదే సమయంలో విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు బరిలోకి దిగి ఓడిపోయారు. అయితే, 2024 ఎన్నికల్లో విజయనగరం నుంచి బరిలో దిగిన అదితి గజపతిరాజు విజయం సాధించారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ