విజయవాడ : రాయలసీమలో ఫ్యాక్షన్ బారినపడి నష్టపోయిన కుటుంబాలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసానికి పిలుపించుకుని మాట్లాడారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం కామిరెడ్డిపల్లికి చెందిన దాసరి నరసింహులు టీడీపీ (TDP) లో మొదటి నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. దీంతో ప్రత్యర్థులు దారికాచి 2011లో ద్విచక్రవాహనంపై వెళ్తున్న బోయ నరసింహులు సహా అతని కుమారుడు, కుమార్తెను దారుణంగా హత్య చేయడం సంచలనం సృష్టించింది. ఫ్యాక్షన్ బారిన పడి బోయ నరసింహులు కుటుంబం ఎంతో నష్టపోయింది. అప్పట్లో పార్టీ అధినేత చంద్రబాబు ఆ కుటుంబానికి అండగా నిలిచారు.

అండగా ఉంటానని భరోసా ఇచ్చారు
ఇప్పుడు మృతుడి కుటుంబ సభ్యులను ఉండవల్లి,చిన్నారిని లోకేష్ నివాసానికి ఆహ్వానించిన మంత్రి నారా లోకేష్, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మృత్యుంజయ ఆప్యాయంగా మంత్రి (Nara Lokesh) పలకరించారు. ఆనాటి ఫ్యాక్షన్ హత్యా ఘటనలో రెండు నిలల చిన్నారి మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. సదరు బాలుడిని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆప్యాయంగా పలకరించారు. చదువు వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకుని ఉన్నతస్థాయికి వెళ్లాలని, తాను కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఉండవల్లి నివాసానికి (Undavalli residence) పిలుపించుకుని తమ యోగక్షేమాలు వాకబు చేయడం పట్ల బోయ నరసింహులు కుటుంబసభ్యులు మంత్రి నారా లోకేష్ కు కృతఙ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి ఎవరు?
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ (సమాచార సాంకేతిక శాస్త్ర) శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) గారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి ఎవరు?
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖా మంత్రిగా వంగలపూడి అనిత (Vangalapudi Anitha) గారు కొనసాగుతున్నారు. ఆమె 2024లో ఏర్పడిన నూతన రాష్ట్ర మంత్రివర్గంలో ఈ బాధ్యతలు స్వీకరించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Anam Ramanarayana Reddy: మెట్టప్రాంత అభివృద్ధికి కృషిచేస్తాం :మంత్రి ఆనం రామనారాయణరెడ్డి