మాక్ సీట్ అలకేషన్లో 77,154 మందికి కేటాయింపు
అనంతరం వెస్ఆప్షన్లలో 44,553 మార్పు
హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఇంజనీరింగ్‌తో పాటు అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎస్ సెట్-2025 కౌన్సెలింగ్‌లో భాగంగా మొదటిసారి విడత సీట్ల కేటాయింపు నేడు(శుక్రవారం) చేయనున్నారు. ఇందుకు సంబంధించి మొదటిసారిగా ఎప్ సెట్ (EAPCET) అధికారులు మాక్ సీట్ అలకేషన్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులో సీట్ ఆలకేషను ఈ నెల 12న. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన వారిలో 77,154 మందికి సీట్ల కేటాయింపు చేశారు. మాక్ సీట్ అలకేషన్లో సీటు పొందిన వారు తమ వెల్ఆప్షన్లను మార్పు కోవడానికి ఈ నెల 15 వరకు అవకాశం కల్పించారు. మాక్సేట్ అలకేషన్లో భాగంగా సీటు పొందిన వారిలో 44,553 మంది తమ వెబ్ ఆప్షన్లలో మార్పులు చేసుకున్నారు.
సర్టిఫికెట్ వెరిఫికేషన్
ఎప్ సెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ అప్పన్ల ప్రక్రియ ఈ నెల 6 నుంచి 10 వరకు కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా 94,354 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. ఈ నెల8తో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ముగియగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ గడువు ముగిసే నాటికి 95,256 మండి హాజరయ్యారు. గడువు ముగిసే లోపుగా 97.533 మంది స్లాట్ బుక్ చేసుకున్నారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన 94,354 మంది 59,31,279 వెబ్ ఆప్షన్లను ఇచ్చారు. రాష్ట్రంలో 83,054 సీట్లు కన్వీనర్ కోటా (Convener Quota) లో అందుబాటులో ఉండగా వాటిలో మాక్ సీట్ అలకేషన్లో భాగంగా 77,154 సీట్లను కేటాయించారు. మరో 5900 సీట్లు ఖాళీగా ఉన్నాయి. సీట్ల కేటాయింపులో ఒక గవర్న మెంట్ కాలేజీలో 195 సీట్లు ఉండగా, 119 సీట్లను (61.03శాతం) కేటాయించారు. 20 యూనివర్సిటీ కాలేజీల్లో 6108 సీట్లు అందుబాటులో ఉండగా వాటిలో 5163 సీట్లను (84.53 శాతం) కేటాయించారు.
సీట్లు కేటాయించలేదని
2 ప్రైవేటు యూనివర్సిటీల్లో 1367 సీట్లు ఉంటే వాటిలో 1357 సీట్లను(99.26 శాతం) కేటాయించారు. 149 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 75,384 సీట్లు అందుబాటులో ఉండగా 70,515 సీట్లను (93.54 శాతం) కేటాయించారు. మొత్తం 172 కాలేజీల్లో 83,054 సీట్లు అందుబాటులో ఉంటే వాటిలో 77,154 సీట్లు(92.89 శాతం) కేటాయించారు. మరో 5900 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన వారిలో 16,905 మందికి సీట్లు కేటాయించలేదని అధికారులు ప్రకటిం చారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో 6021 మందికి సీట్లను కేటాయించారు. నేడు మొదటి విడత సీట్ల (First batch of seats) కేటాయింపు చేయనున్నారు. మొదటి విడతలో సీటు పొందిన విద్యా ర్థులు ఈనెల 18 నుంచి 22 వరకు ట్యూషన్ ఫీజు చెల్లింది. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని ఇప్పటికే అధికారులు ప్రకటించిన కౌన్సెలింగ్ షెడ్యూల్లో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
TS EAPCET అంటే ఏమిటి?
TS EAPCET అనేది తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రవేశ పరీక్ష. ఇది ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తారు.
TS EAPCET పరీక్షను ఎవరు నిర్వహిస్తారు?
TS EAPCET పరీక్షను JNTU Hyderabad (జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్) తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) తరఫున నిర్వహిస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Banakacharla Project: అళగేశన్ డిమోట్ కు దారితీసిన బనకచర్ల వ్యతిరేకత