Water Falls : అతి పెద్ద జలపాతం – ఇగ్వాజుప్రపంచంలోని అతి పెద్ద అద్భుత జలపాతాలలో ఒకటి దక్షిణ అమెరికాలోని ఇగ్వాజుజలపాతం (Iguazu Falls). ఈ భారీ జలపాతం బ్రెజిల్ దేశంలో ఇరవై శాతం, అర్జెంటీనాలో ఎనభై శాతం నెలకొని ఉంది. బ్రెజిల్, అర్జెంటీనా సరిహద్దుల్లో ఇగ్వాజు జలపాతం ఉంది. వీటితో పాటు పరాగ్వే దేశానికి చెందిన ఒక పట్టణాన్ని సైతం ఇవ్వజు నది కొంతమేరకు తాకుతుంది. పరాగ్వే దేశాన్ని కూడా కలుపుకుంటే మూడు దేశాల సరిహద్దులను ఇగ్వాజు జలపాతం కలిగివున్నట్లు గుర్తించారు. ఈ మూడు దేశాల నుండి కూడా పర్యాటకులు ఇగ్వాజు జలపాతాన్ని చేరుకోవడానికి సౌకర్యాలు ఉన్నాయి.

ఈ జలపాతం ఇగ్వాజు నదిని ఎగువ, దిగువ భాగాలుగా విభజించింది. రియోలో దీన్ని ఇగ్వాజు నది అని పిలుస్తారు. ఇగ్వాజు నది పరానా నదికి ఉపనది. ఇగ్వాజు ప్రధాన జలపాతం ఆంగ్ల అక్షరం ‘యు’ ఆకారంతో పాటు మరికొన్ని చోట్ల గుర్రపుడెక్క ఆకారం, ధనస్సు ఆకారం కలిగిన ప్రదేశాలపై నుండి భీకర శబ్దాలు చేస్తూ కిందకు దుముకుతుంది. ఈ నది శాంటా కరోనా, ఫరానా అనే దక్షిణ బ్రెజిల్ ప్రాంతంలో పయనించి ఇగ్వాజు అనే జలపాతంగా మారుతుంది. ఇగ్వాజు నది క్యూరిటిబా అనే ప్రదేశం నుండి ప్రారంభమై బ్రెజిల్ గుండా ప్రయాణించినప్పటికీ జలపాతం అత్యధిక భాగం అర్జెంటీనా వైపునే ఉంది. ఇది నయాగరా జలపాతం కంటే రెండు రెట్లు ఎత్తు, వెడల్పు ఉంటుంది. అగ్నిపర్వతం విస్ఫోటనం ఫలితంగా ఇగ్వాజు జలపాతం ఏర్పడినట్లు తెలుస్తుంది.
ఇగ్వాజు అనే పేరు గురాని లేదా తురి అనే స్పానిష్ పదాల నుండి ఆవిర్భవించింది. ఇగుస్సూ అంటే స్పానిష్ భాషలో నీరు అని అర్థం. ఉసాస్సు అంటే చాలా పెద్ద అని అర్థం. స్థానిక భాషలో ‘గొప్ప జలాలు’ అని అర్థం. ఇగ్వాజు నదికి 2.7 కి.మీ. పొడవునా దాదాపు 21 పెద్ద జలపాతాలు, 275 వరకు చిన్న జలపాతాలు ఉన్నాయి. వీటన్నింటి సముదాయమే ఇగ్వాజు జలపాతం. ఇన్ని జలపాతాలను కలిగి ప్రపంచంలోనే అతి పెద్ద జలపాతంగా ఇగ్వాజు విరాజిల్లుతుంది. ఈ విధంగా ఇగ్వాజు జలపాతంలో విపరీతంగా భారీ స్థాయిలో నీరు చేరి, అత్యధిక వార్షిక జలప్రవాహం కలిగి వుండటం వల్ల ఇగ్వాజు అనే సార్థక నామధేయం ఏర్పడింది.

ఈ జలపాతాన్ని తొలిసారిగా క్రీ.శ.1541లో స్పానిష్ విజేత అల్వార్ నూనెజ్ కాబేజా డి వాకా అనే ఒక యూరోపియన్ అన్వేషకుడు గుర్తించారు. ఆ కారణంగా అర్జెంటినా వైపు ఉన్న జలపాతానికి ఇతని పేరు పెట్టారు. ఈ జలపాతం పొడవు 1.7 మైళ్లు, 190 నుండి 300 అడుగుల వరకు ఎత్తు ఉంటుంది. నవంబర్ నుండి మార్చి వరకు ఈ జలపాతం ఉన్న ప్రాంతంలో వర్షాకాలం. ఆ సమయంలో నీరు విపరీతంగా ప్రవహించడంతో ఉగ్రరూపంలో కనిపిస్తుంది. సాధారణంగా ఇగ్వాజు జలపాతంలో నీటి ప్రవాహం సెకనుకు 62 వేల క్యూబిక్ అడుగులు ఉండగా వర్షాకాలంలో 4 లక్షల 50 వేల క్యూబిక్ అడుగుల నీరు ప్రవహిస్తుంది.
Water Falls : ఇగ్వాజు జలపాతంలో అత్యంత ఆకర్షణీయమైన, లోతైన ప్రవాహ భాగ జలపాతాన్ని ‘ది డెవిల్స్ థ్రోట్’ అంటారు. ఈ ‘భూత అగాథం’ ఆంగ్ల అక్షరం ‘యూ’ ఆకారంలో ఉంటుంది. ఇక్కడ 14 జలపాతాలు 260 నుండి 300 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు నుండి జాలువారతాయి. వరదలు వచ్చినప్పుడు ఈ జలపాతాలన్నీ కలిసి పోతాయి. ఇగ్వాజు చుట్టూ అడవుల్లో దాదాపు రెండు వేల రకాల మొక్కజాతులు ఉన్నాయి. ప్రకృతిలోని నవీన ఏడు అద్భుతాలలో ఇగ్వాజు జలపాతం ఒకటి అని 11 నవంబరు 2011న ప్రకటించారు.
బ్రెజిల్ వైపు నయనానందం చేసే ఇగ్వాజు. ఇగ్వాజు జలపాతం ఉరకలు వేస్తుంటే నీటి బిందువులు మేఘాల రూపంలో అద్భుతంగా కనిపించడమే కాక కొన్ని సందర్భాలలో ఇంద్రధనస్సు లాంటి రంగులు ఏర్పడి నయనానందం చేస్తాయి. ఇగ్వాజు జలపాతం ప్రాంతంలో నివసించే వారిని ఇండియన్స్ ఇది మేఘాలు జన్మించే ప్రాంతం అని భావించి చనిపోయిన తమ బంధువులను పూడ్చిపెడతారు. మూడు దేశాల సరిహద్దులు కలవడంతో ఇక్కడ నిర్మించిన వసతి గృహాలు పర్యాటకులతో కిక్కిరిసిపోయి సందడిగా ఉంటుంది. ఈ ప్రాంతంలో పలురకాల రంగులలో సీతాకోక చిలుకలు కనువిందు చేస్తాయి.

Water Falls : ఎత్తు నుండి జలపాతం తిలకించాలంటే అర్జెంటీనా వైపు నుండి చాలా బాగుంటుందని కొందరి అభిప్రాయం. అర్జెంటీనా వైపు నుండి జలపాతం దూరంగా విహంగ వీక్షణంలో కనిపించడం వల్ల హోరు తక్కువగా వినిపిస్తుంది. ఇగ్వాజు జలపాతాన్ని బ్రెజిల్ వైపు నుండి తిలకించడం అనేది అత్తుత్తమ వీక్షణం అని అనేకమంది పర్యాటకులు భావిస్తారు. ఇగ్వాజును స్పానిష్ భాషలో స్థానికులు ‘కాటరాక్ట్ డెల్ ఇగ్వాజు’ అని, పోర్చుగీసులో ‘కాటరాక్టా ఢూ అయ్ ఇగ్వాజు’ అని పిలుస్తుంటారు.
బ్రెజిల్ నుండి అతి చేరువగా ఇగ్వాజు జలపాతాన్ని వీక్షించవచ్చు. లాంచీలో సైతం ఇగ్వాజు జలపాతాన్ని చేరువగా వెళ్లి తిలకించే సౌకర్యం ఉంది. జలపాతం అంచున నిర్మించిన వంతెన అంచుపై నుండి నడుస్తూ నీటిని తాకగలిగినంత సమీపం నుండి ఇగ్వాజు జలపాతం తిలకించవచ్చు. ఇంత చేరువగా ఇతర జలపాతాన్ని తిలకించలేమంటే అతిశయోక్తి కాదు. బ్రెజిల్ వైపు హెలికాప్టర్లో విహరిస్తూ ఈ జలపాతాన్ని విహంగ వీక్షణం చేయవచ్చు. అయితే అర్జెంటీనా వైపు పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని హెలికాఫ్టర్ సౌకర్యం నిషేధించారు.
అమెరికా మాజీ ప్రథమ మహిళ ఎలియనోరో రూజ్వెల్ట్ ఇగ్వాజు జలపాతాన్ని చూసి ఆశ్చర్యచకితురాలై ‘పూర్ నయాగరా’ అని బిగ్గరగా అరిచినట్లు ఇక్కడి చరిత్ర చెబుతుంది. ఇగ్వాజు జలపాతం నయాగర జలపాతం కంటే ఎంతో పెద్దది అనేది ఆమె భావాల వల్ల సునాయాసంగా అర్థం చేసుకోవచ్చు.
యునెస్కో వారసత్వ గుర్తింపు ఇగ్వాజు జలపాతాన్ని యునెస్కోవారు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు. ఇగ్వాజు జాతీయ ఉద్యానవనం పేరుతో అర్జెంటీనా వైపు ఒక జాతీయ ఉద్యానవనం ఉండగా, బ్రెజిల్ వైపున మరో జాతీయ ఉద్యానవనం ఉంది. ఈ రెండు జాతీయ ఉద్యానవనాలను కూడా యునెస్కో గుర్తించింది. పరాగ్వే-బ్రెజిల్ సంయుక్తంగా ‘ఇటాయిపు’ పేరుతో భారీ జలవిద్యుత్ ప్లాంట్ను జలపాతం వద్ద నిర్మించారు. అటు అర్జెంటీనా, ఇటు బ్రెజిల్ దేశాల విద్యుత్ అవసరాలు దాదాపు 40 శాతం వరకు ఈ ప్లాంట్ వల్ల తీరుతున్నాయి.
అర్జెంటీనా, బ్రెజిల్ రెండు నగరాలలో విమానాశ్రయాలు ఉన్నాయి. జాతీయ ఉద్యానవనాలు సందర్శించాలన్నా, ఇగ్వాజు జలపాతాన్ని సందర్శించాలన్నా ప్రత్యేకమైన రుసుము చెల్లించాల్సి ఉంటుంది. బ్రెజిల్ వైపు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు; అర్జెంటీనా వైపు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు ఈ జలపాతాన్ని తిలకించే సమయాలుగా నిర్ధారించారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు ప్రపంచ వ్యాప్తంగా వచ్చి ఇగ్వాజు జలపాతాన్ని తిలకించి ఉల్లాసభరితంగా గడిపి వెళుతుంటారు.ప్రపంచంలోని అతి పెద్ద అద్భుత జలపాతాలలో ఒకటి దక్షిణ అమెరికాలోని ఇగ్వాజు జలపాతం. ఈ భారీ జలపాతం బ్రెజిల్ దేశంలో ఇరవై శాతం, అర్జెంటీనాలో ఎనభై శాతం నెలకొని ఉంది. బ్రెజిల్, అర్జెంటీనా సరిహద్దుల్లో ఇగ్వాజు జలపాతం ఉంది. వీటితో పాటు పరాగ్వే దేశానికి చెందిన ఒక పట్టణాన్ని సైతం ఇవ్వజు నది కొంతమేరకు తాకుతుంది. పరాగ్వే దేశాన్ని కూడా కలుపుకుంటే మూడు దేశాల సరిహద్దులను ఇగ్వాజు జలపాతం కలిగివున్నట్లు గుర్తించారు. ఈ మూడు దేశాల నుండి కూడా పర్యాటకులు ఇగ్వాజు జలపాతాన్ని చేరుకోవడానికి సౌకర్యాలు ఉన్నాయి.
ఈ జలపాతం ఇగ్వాజు నదిని ఎగువ, దిగువ భాగాలుగా విభజించింది. రియోలో దీన్ని ఇగ్వాజు నది అని పిలుస్తారు. ఇగ్వాజు నది పరానా నదికి ఉపనది. ఇగ్వాజు ప్రధాన జలపాతం ఆంగ్ల అక్షరం ‘యు’ ఆకారంతో పాటు మరికొన్ని చోట్ల గుర్రపుడెక్క ఆకారం, ధనస్సు ఆకారం కలిగిన ప్రదేశాలపై నుండి భీకర శబ్దాలు చేస్తూ కిందకు దుముకుతుంది. ఈ నది శాంటా కరోనా, ఫరానా అనే దక్షిణ బ్రెజిల్ ప్రాంతంలో పయనించి ఇగ్వాజు అనే జలపాతంగా మారుతుంది. ఇగ్వాజు నది క్యూరిటిబా అనే ప్రదేశం నుండి ప్రారంభమై బ్రెజిల్ గుండా ప్రయాణించినప్పటికీ జలపాతం అత్యధిక భాగం అర్జెంటీనా వైపునే ఉంది. ఇది నయాగరా జలపాతం కంటే రెండు రెట్లు ఎత్తు, వెడల్పు ఉంటుంది. అగ్నిపర్వతం విస్ఫోటనం ఫలితంగా ఇగ్వాజు జలపాతం ఏర్పడినట్లు తెలుస్తుంది.

Water Falls : ఇగ్వాజు అనే పేరు గురాని లేదా తురి అనే స్పానిష్ పదాల నుండి ఆవిర్భవించింది. ఇగుస్సూ అంటే స్పానిష్ భాషలో నీరు అని అర్థం. ఉసాస్సు అంటే చాలా పెద్ద అని అర్థం. స్థానిక భాషలో ‘గొప్ప జలాలు’ అని అర్థం. ఇగ్వాజు నదికి 2.7 కి.మీ. పొడవునా దాదాపు 21 పెద్ద జలపాతాలు, 275 వరకు చిన్న జలపాతాలు ఉన్నాయి. వీటన్నింటి సముదాయమే ఇగ్వాజు జలపాతం. ఇన్ని జలపాతాలను కలిగి ప్రపంచంలోనే అతి పెద్ద జలపాతంగా ఇగ్వాజు విరాజిల్లుతుంది. ఈ విధంగా ఇగ్వాజు జలపాతంలో విపరీతంగా భారీ స్థాయిలో నీరు చేరి, అత్యధిక వార్షిక జలప్రవాహం కలిగి వుండటం వల్ల ఇగ్వాజు అనే సార్థక నామధేయం ఏర్పడింది.
ఈ జలపాతాన్ని తొలిసారిగా క్రీ.శ.1541లో స్పానిష్ విజేత అల్వార్ నూనెజ్ కాబేజా డి వాకా అనే ఒక యూరోపియన్ అన్వేషకుడు గుర్తించారు. ఆ కారణంగా అర్జెంటినా వైపు ఉన్న జలపాతానికి ఇతని పేరు పెట్టారు. ఈ జలపాతం పొడవు 1.7 మైళ్లు, 190 నుండి 300 అడుగుల వరకు ఎత్తు ఉంటుంది. నవంబర్ నుండి మార్చి వరకు ఈ జలపాతం ఉన్న ప్రాంతంలో వర్షాకాలం. ఆ సమయంలో నీరు విపరీతంగా ప్రవహించడంతో ఉగ్రరూపంలో కనిపిస్తుంది. సాధారణంగా ఇగ్వాజు జలపాతంలో నీటి ప్రవాహం సెకనుకు 62 వేల క్యూబిక్ అడుగులు ఉండగా వర్షాకాలంలో 4 లక్షల 50 వేల క్యూబిక్ అడుగుల నీరు ప్రవహిస్తుంది.
ఇగ్వాజు జలపాతంలో అత్యంత ఆకర్షణీయమైన, లోతైన ప్రవాహ భాగ జలపాతాన్ని ‘ది డెవిల్స్ థ్రోట్’ అంటారు. ఈ ‘భూత అగాథం’ ఆంగ్ల అక్షరం ‘యూ’ ఆకారంలో ఉంటుంది. ఇక్కడ 14 జలపాతాలు 260 నుండి 300 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు నుండి జాలువారతాయి. వరదలు వచ్చినప్పుడు ఈ జలపాతాలన్నీ కలిసి పోతాయి. ఇగ్వాజు చుట్టూ అడవుల్లో దాదాపు రెండు వేల రకాల మొక్కజాతులు ఉన్నాయి. ప్రకృతిలోని నవీన ఏడు అద్భుతాలలో ఇగ్వాజు జలపాతం ఒకటి అని 11 నవంబరు 2011న ప్రకటించారు.
బ్రెజిల్ వైపు నయనానందం చేసే ఇగ్వాజు. ఇగ్వాజు జలపాతం ఉరకలు వేస్తుంటే నీటి బిందువులు మేఘాల రూపంలో అద్భుతంగా కనిపించడమే కాక కొన్ని సందర్భాలలో ఇంద్రధనస్సు లాంటి రంగులు ఏర్పడి నయనానందం చేస్తాయి. ఇగ్వాజు జలపాతం ప్రాంతంలో నివసించే వారిని ఇండియన్స్ ఇది మేఘాలు జన్మించే ప్రాంతం అని భావించి చనిపోయిన తమ బంధువులను పూడ్చిపెడతారు. మూడు దేశాల సరిహద్దులు కలవడంతో ఇక్కడ నిర్మించిన వసతి గృహాలు పర్యాటకులతో కిక్కిరిసిపోయి సందడిగా ఉంటుంది. ఈ ప్రాంతంలో పలురకాల రంగులలో సీతాకోక చిలుకలు కనువిందు చేస్తాయి.
ఎత్తు నుండి జలపాతం తిలకించాలంటే అర్జెంటీనా వైపు నుండి చాలా బాగుంటుందని కొందరి అభిప్రాయం. అర్జెంటీనా వైపు నుండి జలపాతం దూరంగా విహంగ వీక్షణంలో కనిపించడం వల్ల హోరు తక్కువగా వినిపిస్తుంది. ఇగ్వాజు జలపాతాన్ని బ్రెజిల్ వైపు నుండి తిలకించడం అనేది అత్తుత్తమ వీక్షణం అని అనేకమంది పర్యాటకులు భావిస్తారు. ఇగ్వాజును స్పానిష్ భాషలో స్థానికులు ‘కాటరాక్ట్ డెల్ ఇగ్వాజు’ అని, పోర్చుగీసులో ‘కాటరాక్టా ఢూ అయ్ ఇగ్వాజు’ అని పిలుస్తుంటారు.
బ్రెజిల్ నుండి అతి చేరువగా ఇగ్వాజు జలపాతాన్ని వీక్షించవచ్చు. లాంచీలో సైతం ఇగ్వాజు జలపాతాన్ని చేరువగా వెళ్లి తిలకించే సౌకర్యం ఉంది. జలపాతం అంచున నిర్మించిన వంతెన అంచుపై నుండి నడుస్తూ నీటిని తాకగలిగినంత సమీపం నుండి ఇగ్వాజు జలపాతం తిలకించవచ్చు. ఇంత చేరువగా ఇతర జలపాతాన్ని తిలకించలేమంటే అతిశయోక్తి కాదు. బ్రెజిల్ వైపు హెలికాప్టర్లో విహరిస్తూ ఈ జలపాతాన్ని విహంగ వీక్షణం చేయవచ్చు. అయితే అర్జెంటీనా వైపు పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని హెలికాఫ్టర్ సౌకర్యం నిషేధించారు.

అమెరికా మాజీ ప్రథమ మహిళ ఎలియనోరో రూజ్వెల్ట్ ఇగ్వాజు జలపాతాన్ని చూసి ఆశ్చర్యచకితురాలై ‘పూర్ నయాగరా’ అని బిగ్గరగా అరిచినట్లు ఇక్కడి చరిత్ర చెబుతుంది. ఇగ్వాజు జలపాతం నయాగర జలపాతం కంటే ఎంతో పెద్దది అనేది ఆమె భావాల వల్ల సునాయాసంగా అర్థం చేసుకోవచ్చు.
యునెస్కో వారసత్వ గుర్తింపు ఇగ్వాజు జలపాతాన్ని యునెస్కోవారు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు. ఇగ్వాజు జాతీయ ఉద్యానవనం పేరుతో అర్జెంటీనా వైపు ఒక జాతీయ ఉద్యానవనం ఉండగా, బ్రెజిల్ వైపున మరో జాతీయ ఉద్యానవనం ఉంది. ఈ రెండు జాతీయ ఉద్యానవనాలను కూడా యునెస్కో గుర్తించింది. పరాగ్వే-బ్రెజిల్ సంయుక్తంగా ‘ఇటాయిపు’ పేరుతో భారీ జలవిద్యుత్ ప్లాంట్ను జలపాతం వద్ద నిర్మించారు. అటు అర్జెంటీనా, ఇటు బ్రెజిల్ దేశాల విద్యుత్ అవసరాలు దాదాపు 40 శాతం వరకు ఈ ప్లాంట్ వల్ల తీరుతున్నాయి.
అర్జెంటీనా, బ్రెజిల్ రెండు నగరాలలో విమానాశ్రయాలు ఉన్నాయి. జాతీయ ఉద్యానవనాలు సందర్శించాలన్నా, ఇగ్వాజు జలపాతాన్ని సందర్శించాలన్నా ప్రత్యేకమైన రుసుము చెల్లించాల్సి ఉంటుంది. బ్రెజిల్ వైపు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు; అర్జెంటీనా వైపు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు ఈ జలపాతాన్ని తిలకించే సమయాలుగా నిర్ధారించారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు ప్రపంచ వ్యాప్తంగా వచ్చి ఇగ్వాజు జలపాతాన్ని తిలకించి ఉల్లాసభరితంగా గడిపి వెళుతుంటారు.(Water Falls)