తెలంగాణ రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు(Central Government Institutions) ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసి, రాష్ట్రంలో రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కోల్ ఇండియా మరియు ఎన్ఎల్సీ (NLC) ఇండియా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సంస్థలు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేందుకు ఆసక్తిగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
సౌర, పవన్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళిక
కిషన్ రెడ్డి (Kishan Reddy) లేఖలో పేర్కొన్నట్లు, సౌర విద్యుత్, పవన్ విద్యుత్ ఉత్పత్తికి అనువైన ప్రాజెక్టులకు రాష్ట్రంలో అవకాశాలు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేయడానికి కోల్ ఇండియా, ఎన్ఎల్సీ ఇండియా సంస్థలు ముందుకొచ్చాయని తెలిపారు. పర్యావరణ హితమైన విద్యుత్ ఉత్పత్తిని పెంపొందించేందుకు అవసరమైన భూములు, అనుమతులు మొదలైన వాటిపై రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందించాలని అభిప్రాయపడ్డారు.
ఎనర్జీ స్టోరేజ్ రంగంలోనూ పెట్టుబడులు
విద్యుత్ నిల్వ సామర్థ్యం కూడా కీలకం కావడంతో, ఈ సంస్థలు పంప్డ్ స్టోరేజ్ మరియు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నాయి. ఇది రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం స్థిరమైన సరఫరాను అందించడంలో ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే, ఈ ప్రాజెక్టులు రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు, పరిశ్రమల వృద్ధికి దోహదం చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
Read Also : Adilabad : మహారాష్ట్రలో విలీనం కానున్న 14 తెలంగాణ గ్రామాలు!