థాయ్‌లాండ్ (Thailand) దేశంలో సంచలనం రేపుతున్న ఘటనలో ఒక యువతి బౌద్ధ సన్యాసులను టార్గెట్ చేసి భారీగా డబ్బు వసూలు చేసినట్లు వెల్లడైంది. 30 ఏళ్ల విలావన్ ఎస్మావత్ అనే యువతి ‘వలపు వల’తో 9 మంది సన్యాసులను మోసగించింది. తన అందచందాలతో వారిని ఆకర్షించి, వారికి దగ్గరవుతూ సన్నిహితంగా ఫోటోలు, వీడియోలు తీసి వారిని బ్లాక్మెయిల్ చేసింది. ఈ బ్లాక్ మెయిల్ ద్వారా ఆమె దాదాపు రూ. 102 కోట్లు వసూలు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
సన్యాసం వదిలిన వ్యక్తితో మిస్టరీ వెలుగులోకి
విలావన్ బెదిరింపులకు ఓ బౌద్ధ సన్యాసి తీవ్రంగా నలిగిపోయి చివరకు సన్యాసం కూడా విడిచిపెట్టాడు. అతని తరఫున జరిగిన విచారణలో ఈ వ్యవహారంపై అధికారులు దృష్టి సారించగా అసలు మోసం బహిర్గతమైంది. బ్లాక్ మెయిల్ వ్యవహారంలో యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతి గతంలో కూడా ఈ తరహా మోసాలకు పాల్పడిందని అనుమానిస్తున్నారు.
‘మిస్ గోల్ఫ్’ పేరుతో బలైన బాధితుల వివరాలు సేకరణ
విలావన్ ‘మిస్ గోల్ఫ్’ అనే నామంతో సోషల్ మీడియాలో సన్యాసులతో పరిచయాలు ఏర్పరుచుకునే ప్రయత్నాలు చేసింది. బాధితుల వివరాలను ఇప్పుడు పోలీసులు సేకరిస్తున్నారు. ఆమె మోజులకు బలైన ఇతరులు కూడా ఉండొచ్చన్న కోణంలో అధికారులు విచారణను విస్తరిస్తున్నారు. థాయ్‌లాండ్‌లో బౌద్ధ సన్యాసులకు ఉన్న గౌరవాన్ని దెబ్బతీసే ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read Also : Amarnath Yatra : అమర్నాథ్ యాత్రకు తాత్కాలిక విరామం