విశాఖపట్నం పోలీసులు (Visakha police) పెద్ద మనుషుల ముఠాను పట్టుకున్నారు. దక్షిణాసియా దేశాలకు ఉద్యోగాల పేరుతో యువతను అక్రమంగా తరలిస్తున్న ఈ ముఠా అసలు రూపం వెలుగు చూసింది. కాంబోడియా, మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్ దేశాలకు వారిని పంపుతున్నారు.సీపీ శంకబ్రత బాగ్చి వెల్లడించిన వివరాల ప్రకారం, యువతను చైనా ఆధారిత స్కామ్ కంపెనీలకు పంపిస్తున్న 22 మంది నిందితులను అరెస్టు (Arrest) చేశారు. 85 మంది మోసపోయిన యువతను స్వదేశానికి రప్పించామని తెలిపారు.డేటా ఎంట్రీ జాబ్ పేరుతో లక్షల్లో జీతం వుంటుందని ఆశ చూపుతున్నారు. ఫేక్ ప్రకటనలు, సోషల్ మీడియా పోస్ట్‌లతో యువతను ఆకర్షిస్తున్నారు. అసలు అక్కడ జరిగేది పూర్తిగా నేర కార్యకలాపాలే.
గాజువాకకు చెందిన సురేశ్ అరెస్టు
జూలై 14న కాంబోడియాకు నాలుగుగురు యువతిని పంపించడానికి ప్రయత్నించిన ఏజెంట్ సురేశ్, ఆదిలక్ష్మి అలియాస్ అనును పోలీసులు ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. సురేశ్ గతంలో అక్కడ స్కామ్ కంపెనీలో పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి.సురేశ్ అక్కడ పనిచేసే విజయ్ అలియాస్ సన్నీతో కలిసి కొత్తగా భారతీయ యువతను పంపించేందుకు ప్లాన్ చేశాడు. ఇప్పటివరకు 12 మందిని విదేశాలకు పంపినట్లు సమాచారం లభించింది.
పోలీసుల దగ్గర చూరిన ఆధారాలు
నిందితుల దగ్గర నుంచి 6 మొబైల్ ఫోన్లు, రూ.50 వేలు, 2,000 అమెరికన్ డాలర్లు, 20 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం కేసులో ఇప్పటివరకు 9 కేసులు నమోదయ్యాయి.ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర నుంచి 500 మందికి పైగా విదేశాలకు వెళ్లినట్లు గుర్తించారు. మిగిలిన బాధితులను కూడా తిరిగి రప్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
సీపీ హెచ్చరిక – మోసపోకండి
విదేశీ ఉద్యోగాల పేరుతో అధిక డబ్బు డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని విశాఖ సీపీ సూచించారు. 7995095799 లేదా 1930 నంబర్లకు కాల్ చేయమన్నారు. యువత, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
Read Also : drunk and drive : పగటి వేళల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు