हिन्दी | Epaper
చిత్తశుద్ధి లేని చట్టాలెందుకు? ప్రతిష్టాత్మక భేరి మానవత్వంలోనూ అత్యున్నతమే! ఔషధ లీల.. మృత్యుహేల అర్హులకు అందలాలు అందేనా? హస్త భూషణమా! మస్తక వ్యసనమా? రాజకీయ నాయకులకూ ‘విరమణ’ అవసరమే! అడ కత్తెరలో ‘ఆక్వాసాగు’! భూభారతితో ‘ధరణి’ సమస్యల పరిష్కారం బదలీ వివాదాల్లో ‘గ్రామాలు’ చిత్తశుద్ధి లేని చట్టాలెందుకు? ప్రతిష్టాత్మక భేరి మానవత్వంలోనూ అత్యున్నతమే! ఔషధ లీల.. మృత్యుహేల అర్హులకు అందలాలు అందేనా? హస్త భూషణమా! మస్తక వ్యసనమా? రాజకీయ నాయకులకూ ‘విరమణ’ అవసరమే! అడ కత్తెరలో ‘ఆక్వాసాగు’! భూభారతితో ‘ధరణి’ సమస్యల పరిష్కారం బదలీ వివాదాల్లో ‘గ్రామాలు’ చిత్తశుద్ధి లేని చట్టాలెందుకు? ప్రతిష్టాత్మక భేరి మానవత్వంలోనూ అత్యున్నతమే! ఔషధ లీల.. మృత్యుహేల అర్హులకు అందలాలు అందేనా? హస్త భూషణమా! మస్తక వ్యసనమా? రాజకీయ నాయకులకూ ‘విరమణ’ అవసరమే! అడ కత్తెరలో ‘ఆక్వాసాగు’! భూభారతితో ‘ధరణి’ సమస్యల పరిష్కారం బదలీ వివాదాల్లో ‘గ్రామాలు’ చిత్తశుద్ధి లేని చట్టాలెందుకు? ప్రతిష్టాత్మక భేరి మానవత్వంలోనూ అత్యున్నతమే! ఔషధ లీల.. మృత్యుహేల అర్హులకు అందలాలు అందేనా? హస్త భూషణమా! మస్తక వ్యసనమా? రాజకీయ నాయకులకూ ‘విరమణ’ అవసరమే! అడ కత్తెరలో ‘ఆక్వాసాగు’! భూభారతితో ‘ధరణి’ సమస్యల పరిష్కారం బదలీ వివాదాల్లో ‘గ్రామాలు’

Cell Phones: హస్త భూషణమా! మస్తక వ్యసనమా?

Vanipushpa
Cell Phones: హస్త భూషణమా! మస్తక వ్యసనమా?

ఆధునిక సమాజంలోని మనుషులు వివిధ రకాల భావజాలాలతో ఉంటారు. అలా మితవాదులు, అతివాదులు, హేతువాదులు వీరంతా వారివారి వాదాలను దృఢంగా నమ్ము తారు. కొన్నిసార్లు వారి వాదాలను పక్కనపెట్టి అందరికీ సమ్మతమైన మానవతావాద దృక్కోణంలో చూస్తా రు. పూర్వకాలంలో పురాణాల్లో రాముడు కోదండపాణి ధారి, కృష్ణుడు చక్రధారి మరి ఆధునిక యుగంలో మన మంతా స్మార్ట్ఫోన్(Smart Phones) ధారులం. పైన చెప్పిన వారి వాదాల కైనా, ఆయుధాలకైనా విరామం ఉంటుందేమో గాని విశ్వ మానవాళి స్మార్ట్ఫోన్కు బానిసై నిర్విరామంగా అదే పనిగా చూస్తూ, అందులోనే మునిగిపోతున్నారు. వారి విలువైన కాలాన్ని వృధాగా గడిపేస్తున్నారు. ఎప్పుడో ముసలితనంలో మనిషికి ‘చాదస్తం’ అనే ‘మూడో హస్తం’ మొలుస్తుందంటారు. కానీ నేటి ఆధునిక టెక్నాలజీ యుగంలో చిన్నతనం లోనే స్మార్ట్ఫోన్ అరచేతిని ఆక్రమించింది. పుస్తకం ‘హస్త భూషణం’ అనేది పాత మాట, స్మార్ట్ఫోనే ‘హస్తభూషణం’ అనేది నేటిపాటగా మారింది. పొద్దస్తమానం ఆన్లైన్లో ఉంటారు. రింగ్ంగో అంటూ మ్రోగుతోంది. డ్రగ్స్, గంజాయి, మద్యం(Drugs) ఇవే కాదు డిజిటల్ (Digital)రూపంలోనూ వ్యసనం యువతను, పిల్లల్ని వెంటాడుతోంది. వారు సెల్ఫోన్ వద ల్లేకపోతున్నారు. చిన్నపిల్లలు అయితే మొబైల్ ఇస్తేనేతింటాం, చెప్పింది చేస్తామంటూ మారం చేస్తున్నారు.

Cell Phones: హస్త భూషణమా! మస్తక వ్యసనమా?
Cell Phones: హస్త భూషణమా! మస్తక వ్యసనమా?

స్మార్ట్ఫోన్ చెరలో బాల్యం బందీ

తల్లిదండ్రులు కూడా వారిని బుజ్జగించే క్రమంలో పిల్లల చేతిలో మొబైల్ పెట్టేస్తున్నారు. దీంతో ఆడుతూ పాడుతూ గడపాల్సిన బాల్యం స్మార్ట్ఫోన్ చెరలో బందీ అవుతోంది. పిల్లలు వారికి తెలియకుండా ఆవలలో చిక్కుకుంటున్నారు. వారించే ప్రయ త్నం చేస్తే తల్లిదండ్రులని కూడా చూడకుండా క్రూరంగా దాడులకు తెగబడుతున్నారు. ఏ అలవాటైనా వ్యసనంగా మారినప్పుడు ఎవరైనా నిరోధించడానికి ప్రయత్నిస్తే తీవ్ర ప్రతిఘటనకు దారితీస్తుంది. ఆ కోపంలో దాడి చేసేందుకు కూడా వెనకాడరని మానసిక నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి వారికి ఒకపద్దతి ప్రకారం నచ్చచెబుతూ వాటినుంచి దూరం చేయాలని సూచిస్తున్నారు. రోజులో ఒక ఖచ్చితమైన సమయంలో ఫోన్ చూసేందుకు అనుమతించాలి. అరగంటలేదా గంట గడువు పెట్టాలి. ఇది పిల్లలు స్క్రీన్పై ఎక్కువ సమ యం గడపకుండా నిరోధిస్తుంది.

పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యానికి ఆటలు

దినచర్యలో నిర్ణీత సమయం భాగమైనప్పుడు వ్యసనం కూడా అడ్డుకట్ట వేయ వచ్చు. ప్రస్తుతం చాలా మంది పిల్లలు ఆటలకు దూరం అవుతున్నారు. పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యానికి ఆటలు ఎంతో ముఖ్యం. రోజూ ఒక గంటపాటు అవుట్ డోర్ ఆటల వైపు మళ్ళించడం వల్ల ఫోన్, ఇతర వ్యసనాల బారిన పడ కుండా చూసుకోవచ్చు. హోంవర్క్ చేస్తే, అన్నం తింటేఫోన్ ఇస్తానని పిల్లలకు కొందరు తల్లిదండ్రులు ఆశ చూపుతుంటా రు. ఆ పని చేసిన వెంటనే ఆడుకోవడానికి ఫోన్ ఇచ్చేస్తుం టారు. ఇలా చేయడం కూడా వారిని వ్యసనం వైపు మళ్లిస్తుందని గుర్తించాలి. చాలామంది తల్లిదండ్రులు స్మార్ట్ఫోన్లో ఎక్కువ సమయం గడుపుతూ పిల్లలకు మాత్రం ఉపయో గించ వద్దని సూచిస్తుంటారు. దీనివల్ల ఎలాంటి ప్రయోజ నం ఉండదు. ముందు మీరు క్రమశిక్షణ పాటించాలి. దీంతో పిల్లలు మిమ్మల్ని చూసి అనుసరిస్తారు. సామాజిక మాధ్యమాల వినియోగం తగ్గించేలా ఆటలు, ఈత, మ్యూ జిక్, డాన్స్ వంటి వాటిపై దృష్టి సారించేలా చేయాలి. చిన్న ప్పటి నుంచి ప్రత్యేక లక్ష్యం దిశగా పిల్లల్ని నడిపించాలి.

స్మార్ట్ఫోన్ కూడా వ్యసనంగా మారుతోంది

డ్రగ్స్, గంజాయి, మద్యం వంటి వాటికి అలవాటు పడితే బయటపడడం చాలా కష్టం. ఆపాలని చూసినా కొందరు చాలా క్రూరంగా మారిపోతారు. ఇప్పుడు స్మార్ట్ఫోన్ కూడా వ్యసనంగా మారుతోంది. పిల్లలకు అర్థమయ్యేలా చెప్పి ఒప్పించడంలో తల్లిదండ్రులదే కీలకపాత్ర. కచ్చితంగా కొంత సమయమే వినియోగించేలా చూడటం. పిల్లలతో ఎక్కువ సమయం గడపడం, అవసరమైతే కౌన్సిలర్ సలహా తీసు కోవడం వంటి చర్యలతో వ్యసనం నుంచి క్రమేపి దూరం చేయాలి. స్మార్ట్ ఫోన్ అతి వినియోగానికి అడ్డుకట్టుట వేయడం ద్వారా భావితరం జీవితాలు ప్రమాదంలో పడ కుండా చూడాల్సిన బాధ్యత మనందరిది.

ప్రపంచ దేశాలలో సామాజిక మాధ్యమాల వినియోగంపై కఠిన నిబంధనలు

ప్రపంచ దేశాలలో సామాజిక మాధ్యమాల వినియోగంపై కఠిన నిబంధనలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించడం పై నిషేధం విధించింది. దేశం లోని పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ చర్యలు తీసుకుంది. స్వీడన్లో 13 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు మూడు గంటల కంటే ఎక్కువ సమయం సామాజిక మాధ్యమాలను వినియోగించకూడదు. దక్షిణకొరియాలో 16 ఏళ్లలోపు పిల్లలు మధ్య రాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు ఆన్లైన్ గేమ్ లు ఆడకూడదు. చైనాలో రోజుకు 40 నిమిషాలకు మించి టిక్టాక్ ఆన్లైన్ గేమింగ్పై నిషేధం. ఇంగ్లాండ్లో 16 ఏళ్లలోపు పిల్లలకు సామాజిక మాధ్యమాల వినియోగానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. స్పెయిన్ లో 16 ఏళ్ల వరకు సోషల్ మీడియా వినియోగంపై బ్యాన్ విధించింది. ఇలా ఇతర దేశాలవలె పిల్లల సామాజిక మాధ్య మాల వినియోగంపై కఠిన నిబంధనలు రావాలి. మన దేశంలో .

Read hindi news: hindi.vaartha.com

Read Also: Rajiv Shukla: కోహ్లీ, రోహిత్‌ రిటైర్మెంట్ పై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870