జమ్మూ కాశ్మీర్‌కు (Jammu Kashmir) 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా (Article 370)ను రద్దు చేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే , రాహుల్ గాంధీ(Mallikarjun Kharge, Rahul Gandhi) సంయుక్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాసారు. ఈ లేఖలో వారు జమ్మూ కాశ్మీర్ (Jammu Kashmir)కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

రాబోయే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో చట్టాన్ని తయారు చేయాలని కోరుతూ ప్రధాని మోదీకి ఇవాళ ప్రతిపక్ష నేతలు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సంయుక్తంగా లేఖ రాశారు. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో లడాక్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని కలపాలని కోరుతూ చట్టాన్ని చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గత అయిదేళ్లుగా జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)ప్రజలు రాష్ట్ర హోదాను కోరారని రాహుల్, ఖర్గేలు తమ లేఖలో తెలిపారు. తమ డిమాండ్ చట్టపరమైందని, రాజ్యాంగ.. ప్రజాస్వామ్య హక్కుల పరిధిలో ఉందన్నారు.గతంలో కేంద్ర పాలిత ప్రాంతాలకు రాష్ట్ర హోదా ఇచ్చారని, విభజనచేపట్టి పూర్తి స్థాయి రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారని ఖర్గే ఆరోపించారు. కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా ఇస్తామని గతంలో పలుమార్లు చెప్పినట్లు మోదీ గురించి కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. గతంలో ఆర్టికల్ 370 గురించి కూడా పార్లమెంట్‌లో మాట్లాడుతూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను ఇవ్వనున్నట్లు ప్రధాని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
జమ్మూ కాశ్మీర్ ని ఎవరు నియంత్రిస్తారు?
జమ్మూకశ్మీర్ అనేది భారతదేశంచే కేంద్రపాలిత ప్రాంతంగా నిర్వహించబడుతున్న ప్రాంతం మరియు ఇది పెద్ద కాశ్మీర్ ప్రాంతం యొక్క దక్షిణ భాగాన్ని కలిగి ఉంది, ఇది 1947 నుండి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య మరియు 1959 నుండి భారతదేశం మరియు చైనా మధ్య వివాదానికి సంబంధించిన అంశంగా ఉంది.
జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఏ పార్టీ?
JKNC మొత్తం 42 సీట్లు గెలుచుకుని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది, BJP 29 సీట్లు గెలుచుకుని రెండవ స్థానంలో నిలిచింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Sourav Ganguly: టాపార్డర్ వైఫల్యంతోనే టీమిండియా ఓడింది