हिन्दी | Epaper
కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? ‘కులిశ వేధ’ అంటే ఏమిటి? చెత్తను ఎటువైపు ఊడవాలి? కుట్టక వేధ అంటే ఏమిటి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే? అలవాట్లపై వాస్తు ప్రభావం పిశాచ స్థలాలు అంటే? కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? ‘కులిశ వేధ’ అంటే ఏమిటి? చెత్తను ఎటువైపు ఊడవాలి? కుట్టక వేధ అంటే ఏమిటి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే? అలవాట్లపై వాస్తు ప్రభావం పిశాచ స్థలాలు అంటే? కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? ‘కులిశ వేధ’ అంటే ఏమిటి? చెత్తను ఎటువైపు ఊడవాలి? కుట్టక వేధ అంటే ఏమిటి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే? అలవాట్లపై వాస్తు ప్రభావం పిశాచ స్థలాలు అంటే? కుటుంబంలో గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో ఎన్ని అడుగులు పెంచాలి? ‘కులిశ వేధ’ అంటే ఏమిటి? చెత్తను ఎటువైపు ఊడవాలి? కుట్టక వేధ అంటే ఏమిటి? సింహద్వారం పై మెట్లు ఉంచవచ్చా? అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా? పరిస్థితులు మారాలంటే? అలవాట్లపై వాస్తు ప్రభావం పిశాచ స్థలాలు అంటే?

Dreams : కలలు నిజం అవుతాయా?

venkatesh
Dreams : కలలు నిజం అవుతాయా?

Dreams : చాలామంది తమ కలలో వాళ్ల పూర్వీకులు లేదా గతించిపోయిన పెద్దవాళ్లు కనిపించారని చెప్తూ ఉంటారు. కలలో కనిపించటంలో అంతరార్థం ఏమిటో తెలియక సతమతమవుతూ ఉంటారు. కొంతమంది వాళ్లకి కలలో ఈ పెద్దలు నవ్వుతూ కనిపించారని, అది శుభ సూచకమని కూడా నమ్ముతూ ఉంటారు. ఈ విషయాన్ని ఎలా తీసుకోవాలి?

రాత్రి కలలో ఏం కనపడిందో పొద్దున నిద్ర లేచేవరకు చాలావరకు మర్చిపోతారు. కొంత మందికి పడుకోగానే నిద్ర పట్టేస్తుంది. మాకు అసలు కలలే రావు అంటారు. కొంత మందికి ‘సుషుప్తావస్త’లో (Dormant) అంటే నిద్ర పట్టీ పట్టకుండా ఉండే సమయంలో కలలు వస్తాయి. కొంతమంది ఏదో విషయమై తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. దానికి సంబంధించిన కలలే వస్తాయి. కొంత మందికి డీప్ స్లీప్లో కలలు వస్తాయి. మరికొంత మందికి తెల్లవారుజామున కలలు పడతాయి.

Dreams : తెల్లవారుజామున కలలు నిజమవుతా యన్న నమ్మకం చాలామందిలో ఉంటుంది. వీటి గురించి కలల శాస్త్రంలో మీకు ఏ సమయంలో వచ్చే కలలు ఎంతవరకు నిజమవుతాయోనన్న విషయంలో కొంత వివరణ ఉంది. కానీ దాని ప్రామాణికత ఎంతవరకు అన్నది చెప్పలేం. కానీ ఎన్నో దృష్టాంతాల వల్ల కొన్ని నమ్మకాలు కలుగుతాయి. అలా ‘స్వప్న శాస్త్ర ప్రామాణికత’ నమ్మయోగ్యమైనది. రాత్రి వచ్చిన కల తెల్లవారేసరికి మర్చిపోవటం సర్వసాధారణం. కానీ ఒక్కొక్కసారి ఆ మరునాడు ఒక దృశ్యం చూడటం వల్ల కానీ, ఒక సంఘటన వల్ల కానీ, ఒక శ్రవణం వలన కానీ రాత్రి వచ్చిన కల హఠాత్తుగా గుర్తుకు రావటం పరిపాటి.

తెల్లవారుజామున వచ్చే కలలు ‘తెల్లవారుజామున వచ్చే కలలు చాలావరకు నిజమవుతాయి’ అని పేర్కొనటానికి ఒక కారణం ఉంది. తెల్లవారుజామున 4.30 నుండి బ్రహ్మీ ముహూర్త సమయం ప్రారంభమ వుతుంది. ఉదయం నాలుగున్నర నుండి 6.00 గంటల వరకు అంటే దాదాపు ఒక గంటన్నర సమయం ‘బ్రాహ్మీకాలం’. సూర్యోదయం నుండి గంటన్నర ముందు భాగాన్ని బ్రహ్మీ ముహూర్తంగా చెప్పుకోవాలి. ఈ సమయం ఆధ్యాత్మికంగా గొప్ప శక్తివంతమైనది. ఈ సమయంలో ‘తథాస్తు దేవతలు’ భూమి మీద సంచరిస్తూ ఉంటారు. సాయంత్రం కూడా సూర్యాస్తమయానికి 45 నిమిషాల ముందు నుండి సూర్యాస్తమయం తర్వాత 45 నిమిషాల వరకు తథాస్తు దేవతలు భూమి మీద సంచరిస్తూ ఉంటారు. అందుకని ఆ సమయంలో నిద్ర పోకూడదు.



తథాస్తు దేవతలు సంచరించే ఈ సమయాలలో మనం ఏమనుకున్నా, ఏమి మాట్లాడినా, ఏమి కోరుకున్నా తథాస్తు దేవతలు మన కోరికలను మన్నిస్తూ ‘తథాస్తు’ అని దీవిస్తారు. అందుకే ఆ సమయంలో మంచి ఆలోచనలు, మంచ మాటలు మాట్లాడటం/వినటం.. ఇవన్నీ తప్పనిసరి. ఇదే విషయాన్ని తెల్లవారుజాము కలలకి కూడా వర్తింపచేశారు. మనం నిరంతరం ఆలోచించే విషయాలు కానీ ఇంకేమైనా కానీ తెల్లవారుజామున కలలోకి వస్తే అవి ఆలోచితంగా వచ్చినా సరే, అనాలోచితంగా వచ్చినా సరే ‘తథాస్తు దేవతలు తథాస్తు అనే సమయం’ కాబట్టి అవి నిజమవుతాయి అనే నమ్మకం ఇలా వచ్చింది.

నిద్ర-కల-ఆత్మ
ఒక మనిషికి నిద్రలో వచ్చిన కలలో ‘తాను చనిపోయినట్టు’ కల పడకూడదు. అలాంటి కల పడితే ఆ మనిషి హఠాత్తుగా నిద్రలో నుంచి లేచి కూర్చుంటాడు. లేదా అతనికి వెంటనే మెలకువ వస్తుంది. మన ‘జీవితం.. మన ఆత్మకు ఒక కల లాంటిది’. మనిషి ఎప్పుడైతే చచ్చిపోతాడో అప్పుడు ఈ కల గంటున్న ఆత్మ మేల్కొంటుంది. ఇది ఒక ఆధ్యాత్మిక భావన లేదా ఒక ఫిలాసఫీ. ఎంత విచిత్రంగా ఉంది కదా!

కలలో పెద్దలు కనపడితే?
మన నిజ జీవితంలో పెద్దవాళ్లు కలలో కనపడితే దానికి సంబంధించి ‘ఎటువంటి కలలకు ఎటువంటి ఫలితాలు ఉంటాయి?’ అనే మీమాంస సాధారణంగా అందరిలో ఉంటుంది. మరణించిన పెద్దలు కలలో కనపడితే ముఖ్యంగా ‘ఏదో విషయం మనకు చెప్పటానికి ప్రయత్నిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి కలలు వచ్చినప్పుడు సాధారణంగా చాలా మందికి ఒక విధమైన భయం వేస్తుంది. అలా కాకుండా కొంచెం ధైర్యంగా ఉండాలి. వాళ్లు మన పెద్దవాళ్లు. మనకి కీడు తలపెట్టరు. కలలు అయినా సరే, అవి అనుభూతులను కలుగచేస్తాయి.

పెద్దలు కలలో నవ్వుతూ కనపడ్డా, ఎలా కనిపించినాసరే వాళ్లతో స్నేహపూర్వకంగా, అణకువగా ప్రవర్తించే ప్రయత్నం చేయాలి. అప్పుడు వాళ్ల నుండి ఏదైనా ఒక ‘కమ్యూనికేషన్’ వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం మెలకువ వచ్చినట్లయితే ఆ విషయాలను గుర్తున్నంతవరకు అప్పటికప్పుడు ఒక పేపర్ మీద నోట్ చేసి పెట్టుకోవాలి. పొద్దున ఆ పేపర్ని చూసుకుంటే మనకి చాలా విషయాలు గుర్తుకు వస్తాయి. ఇలాంటి కలలు పదే పదే వస్తుంటే, ఉదయం పూట నియమంగా ఒక సాధారణ ధ్యానంలో కూర్చుని, కలలో వచ్చిన పెద్దలను మననం చేసుకుంటే వాళ్లు చెప్పదలచుకున్నది ఏదైనా ఉంటే అది మనకు ‘కమ్యూనికేట్’ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎటువంటి విషయం అయినా సరే ప్రయత్నించటంలో తప్పు లేదు. ఒక్కొక్కసారి అద్భుతాలు కూడా జరగవచ్చు.(Dreams)

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870