గత కొన్ని రోజుల నుంచి వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు(Gold Rates) రెండు రోజుల నుంచి తగ్గుముఖం పట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల మధ్య పసిడి ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. గత మూడు రోజుల క్రితం ఢిల్లీ(Delhi)లో లక్ష మార్కును తాకిన బంగారం ధర ఇప్పుడు కొంచెం తగ్గి పసిడి ప్రియులకు ఊరటను కల్పించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump).ఈ మధ్య యూరోపియన్ యూనియన్, మెక్సికో(Mexico) నుండి దిగుమతులపై 30 శాతం సుంకం విధిస్తామని హెచ్చరికల తర్వాత బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. పెట్టుబడిదారులు ఈ హెచ్చరికలతో మళ్లీ బంగారం వైపు తమ దృష్టిని నిలిపారు.
సమీప భవిష్యత్తులో భారీగా పెరిగే అవకాశం
అగ్రరాజ్యం అమెరికా గ్లోబల్ వాణిజ్య సుంకాల విధానం వల్ల ఏర్పడిన అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడికి బంగారంను ఎంచుకుంటున్నారు. అయితే బంగారం ధరలు ఇప్పుడ తగ్గినా సమీప భవిష్యత్తులో భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, US డాలర్ ఇండెక్స్‌లో కొనసాగుతున్న బలహీనత, వాణిజ్య సంబంధిత సంఘటనల కారణంగా, రాబోయే వారంలో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 30% సుంకాలు ఆగస్టు 1 నుండి అమల్లోకి రానున్నాయి.

బుధవారం బంగారం ధరలు
జూలై 16, బుధవారం బంగారం ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర 49 రూపాయిలు తగ్గింది. ప్రస్తుతం గ్రాము బంగారం ధర రూ.9,928 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర 45 రూపాయిలు తగ్గి 9,100 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారట్ల గ్రాము బంగారం ధర 37 రూపాయిలు తగ్గి రూ.7,446 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 4,900 తగ్గి రూ. 9,92,800 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.4,500 తగ్గి రూ. 9,10,000 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర రూ. 3,700 తగ్గి రూ. 7, 44,600 వద్ద ట్రేడ్ అవుతోంది.
హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,280 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.91,000 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,460 గా నమోదైంది. విజయవాడ విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,280 దగ్గర ట్రేడ్ అవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Jos Butler: వాషింగ్టన్ సుందర్ వల్లే టీమిండియా ఓడిపోయింది?