Vastu for House : ఇల్లు దీర్ఘ చతురస్రాకారంలో వుంది. ఇంటికి ఉత్తర ముఖద్వారం ఉంది. తూర్పు ఈశాన్యంలో (East Northeast) సుమారు పది అడుగుల లోతులో పంచాయితీ కుళాయి వుంది. పడ మర వాయువ్య మూలలో మెట్లు వున్నాయి. నైరుతిలో రెండు షాపులు వున్నాయి. మెట్లు షాపుల మధ్యల మధ్య సింహ ద్వారం వుంది. సింహ ద్వారంపై నుండి మెట్లు వచ్చాయి. వాయువ్య మూల పక్క నుండి వీధిరోడ్లను కలుపుతూ రహదారి వుంది. ఈశాన్య మూలలో పది అడుగుల లోతులో కుళాయి గొయ్యి వుండవచ్చా? వాడిన నీరు పడమర డ్రైనేజీలో కలు స్తుంది. సింహ ద్వారంపైన మెట్లు వుండవచ్చా? సింహ ద్వారం ఉత్తర, దక్షిణాలకు మార్చవచ్చా?
మీరు పంపిన ప్లాన్లో సింహ ద్వారంపైన మెట్లున్నట్లు కనిపించడం లేదు. ఉత్తర వాయువ్యంలో మీరు చూపిన విధంగా మెట్లుండవచ్చు. ఈశాన్యంలో కుళాయి గొయ్యి వుండవచ్చు కానీ తూర్పు ఈశాన్యం లేదా ఉత్తర ఈశాన్యంలో వుండాలి. తలుపులకెదురుగా వుండకూడదు. వాడిన నీరు అండర్ గ్రౌండ్ పైప్ లైన్లో వెళ్లి పడమర పశ్చిమ వాయువ్యం ద్వారా బయటకు వెళ్లి, డ్రైనేజీలో కలపవచ్చు. సింహద్వారం పైన మెట్లు వుండకూడదు. పశ్చిమ వీధి గృహానికి దక్షిణ సింహద్వారం వుండకూడదు. ఎన్నో విధాల అరిష్టాలు వస్తాయి. పశ్చిమ వీధి గృహానికి పశ్చిమ సింహ ద్వారం పరమశ్రేష్ఠం. ఉత్తర సింహద్వారం ద్వితీయ శ్రేష్ఠం. ఎన్నో సత్ఫలితాలను పొందవచ్చు.

ఆర్థిక ఇబ్బందులను అధిగమించేదెలా?
Vastu for House : ఇల్లు కట్టినప్పటి నుండి ఆర్థిక సమ స్యలు ఎక్కువయ్యాయి. మనశ్శాంతి వుండటం లేదు. ఎన్నో సమ స్యలు తలెత్తుతు ఉన్నాయి. ఇల్లు కట్టక ముందు డబ్బులు పుష్కలంగా వుండేవి. కానీ ఇల్లు కట్టిన తరు వాత అప్పులు ఎక్కువ య్యాయి. మా తూర్పు వైపున మా పక్కింటివారు ప్రహరీ గోడ కట్టారు. మేం కట్టుకోలేదు. మిగిలిన మూడు వైపుల నిర్మించాం. కానీ లెట్రిన్ వారి గోడకు ఆనుకొని నిర్మించారు. అవి మాకు తలుపు తీయగానే కనబడతాయి. వారి లెట్రిన్ వెంటిలేషన్ కిటికీలు మా వైపే పెట్టారు. అలా వుండవచ్చా?
తూర్పున మీ పొరుగువారు కట్టు కున్న ప్రహరీ గోడ నుండి కనీసం ఒకడుగు ఖాళీ స్థలాన్ని వదిలి మీరు మరొక ప్రహరీ గోడ నిర్మించాల్సి ఉంటుంది. తూర్పు ఈశా న్యాన్ని పెంచుతూ తూర్పు ప్రహరీగోడ నిర్మించండి. అలా కట్టిన ప్పటికీ పశ్చిమాన వున్న వున్న ఖాళీ స్థలం ఎక్కువ ఖాళీ స్థలంకంటే తూర్పున గానే వుండాలి. సెప్టిక్ ట్యాంక్ లు దక్షిణ ఆగ్నే యంలో నిర్మించారు. వాటిని పూడ్చేసి తూర్పున వున్న ఖాళీ స్థలంలో తలు ఠకుల సమస్యలకు ఈ కింది కూపన్ : సాయిశ్రీ వాస్తు , సికింద్రాబాద్ -3 పుకు ఎదురుగా రాకుండా నిర్మించండి.
పశ్చిమాన కట్టిన వరండాకు పశ్చిమ వాలుగా రేకులు వుండకూడదు. అలా వున్న ట్లయితే వాటిని తీసేసి స్లాబ్ పెంచుకోవలసి ఉంటుంది. ఆకాశానికి తెరిపి వున్న వరండా అయితే అలాగే వుండవచ్చు. గార్డెన్స్ లో ఇంత విశాలమయిన గృహ నిర్మాణం చేసుకున్న మీకున్న టేస్ట్ ప్రశంనీయం. ఏ గది దేనికి ఉపయోగిస్తు న్నారో తెలపలేదు. మెట్లు ఎటు వైపు నుండి ఎక్కుతు న్నారో కూడా రాయలేదు. ఒక సారి మీరు ఫోన్లో మాట్లాడితే ‘తెలుసుకునే వివరాల వల్ల మరిన్ని సలహా లిస్తే అవకాశం ఉంది.

దక్షిణం వైపు పెంచవచ్చా?
ఇల్లు నాలుగు గదులతో కట్టాను. రెండు వందల గజాల స్థలం. రోడ్డు దక్షిణం వైపు వుంది. ఉత్తరం నుండి గదులు కట్టి దక్షిణం వైపు 23″ వదిలాం. అప్పుడు వాస్తు తెలియక కట్టాం. ఇప్పుడు దక్షిణం వైపు కట్టాల నుకుంటున్నాం. దక్షిణం, ఉత్తరం కంటే కొంచెం ఎత్తుగా వుండాలని అంటున్నారు. పాత ఇంటిని దక్షిణ భాగానికి కలిపి కట్ట వచ్చా? ఒకే ఇల్లు గ్యాప్ లేకుండా కట్టవచ్చా? తెలుపగలరు. మా ఇంటి ప్లాన్ పంపిస్తు న్నాను. ప్లాన్ పరిశీలించి, సలహా ఇవ్వగలరు.
గృహానికి దక్షిణంలో ఉత్తరంలో కన్నా ఎక్కువ ఖాళీ స్థలం వుండకూడదు. అలా వున్నప్పుడు గృహాన్ని దక్షిణానికి పెంచి కట్టుకోవడం వల్ల ఒక వాస్తు దోషం సవరిం పబడుతుంది తప్ప తప్పు కాదు. ఒక ఇంటికి దక్షిణంలో వున్న స్థలం కొని కలుపుకోవటం దోషమవుతుంది. కొని, కలుపుకునే ఖాళీ స్థలం ఉత్తర ఖాళీ స్థలంకంటే ఎక్కువగా వున్నప్పుడే దోషమవుతుంది. కొంతమంది దక్షిణ సరిహద్దు మీద గృహ నిర్మాణం చేసుకొని, కిటికీలు, వెంటిలేటర్స్ లేక బాధపడి దక్షిణంలో రెండు, మూడడు గుల స్థలం కొని కలుపుకోవటం వల్ల (ఉత్తర పు ఖాళీ స్థలం దక్షిణంలో కలుపుకున్న స్థలంకంటే ఎక్కువగా ఉన్నప్పుడు) దోషం కాదు. మీ విషయంలో పాత ఇంటిని కలుపుకుని గ్యాప్ లేకుండా దక్షిణం పెంచుకోవచ్చు.(Vastu for House)