సిరిసిల్ల: బిసిల రిజర్వేషన్ల(BC Reservations) అమలుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Central Minister Bandi Sanjay Kumar) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల అమలు వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని మండి పడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు పేరుతో ముస్లింల(Muslims)కు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం దుర్మార్గమన్నారు. ముస్లింలను బీసీ రిజర్వేషన్ల జాబితా నుండి తొలగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. తక్షణమే బీసీ జాబితా నుండి ముస్లింలను తొలగించి 42 శాతం రిజర్వేషన్లను పూర్తిగా బీసీలకే దక్కేలా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 51 శాతమున్న బీసీలకు 32 శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం 12 శాతమున్న ముస్లింలకు మాత్రం వందకు వంద శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు సిద్ధమవడం దుర్మార్గమన్నారు.

రెండు రాష్ట్రాల సీఎంలతో సమావేశం ఏర్పాటు
బనకచర్ల విషయంలో కేంద్రం రెండు రాష్ట్రాల సీఎంలతో సమావేశం ఏర్పాటు చేయడాన్ని స్వాగతించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ వాదనను బలంగా విన్పించాలని కోరారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన బండి సంజయ్ విలేకరులతో మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజ కవర్గంలో ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే టెన్త్ విద్యార్థులందరికీ సైకిళ్లను అందజేస్తున్నామని 20 వేలకు పైగా సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టు అంశంపై కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల ముఖ్య మంత్రులతో సమావేశం కాబోతుందన ఈ నేపథ్యంలో బలంగా విన్పించాలని అయన కోరారు. కేంద్రానికి అన్ని రాష్ట్రాలూ సమానమేనని ఏ రాష్ట్రానికి అన్యాయం చేయదని స్పష్టం చేశారు.
బీసీ రిజర్వేషన్ల అమలు వెనుక పెద్ద కుట్ర
రాష్ట్ర వాదనను సీఎంల మీటింగ్ లో రేవంత్ రెడ్డి గట్టిగా విన్పించాలన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలు వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ప్రభుత్వం వాస్తవాలను కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అదనంగా ఇస్తున్న రిజర్వేషన్లు 5 శాతమేనని దీనివల్ల బీసీలకు తీవ్ర అన్యాయం తెలంగాణ వాదనను తెలంగాణలో కాంగ్రెస్ కుట్రలు ప్రజలకు వివరిస్తా బిసి జాబితా నుంచి ముస్లింలను తీసేస్తేనే మద్దతు బిసిలకు జరుగుతున్న అన్యాయంపై ఉద్యమిస్తాం కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్లు జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
బీసీలకు మాత్రం తీవ్రమైన అన్యాయం
అట్లాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతున్నాయని అందులో ముస్లింలు లబ్ది పొందుతుండగా రాష్ట్రంలో 12 శాతం మంది ముస్లింలు ఉంటే… కాంగ్రెస్ 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా ముస్లింలకు ఇకపై వందకు వంద శాతం రిజర్వేషన్లు పొందబోతున్నారని తెలిపారు. బీసీలకు మాత్రం తీవ్రమైన అన్యాయం జరుగుతుందని మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్దం అయినా ఆర్డినెన్స్ తీసుకు వస్తామని చెప్పడం దుర్మార్గమని ఆరోపించారు. తక్షణమే బీసీ రిజర్వేషన్ల జాబితా నుండి ముస్లింలను తొలగించాలని కేంద్ర సహాయ మంత్రి సంజయ్ డిమాండ్ చేశారు. 42కు 42 శాతం రిజరే షన్ల ను బీసీలకు అమలు చేస్తానంటే కేంద్రాన్ని ఒప్పిం చి ఆమోదం తెలిపే బాధ్యతను మేం తీసుకుంటామని లేనిపక్షంలో ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కాంగ్రెస్కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముస్లింలను బీసీ జాబితా నుండి తొలగించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎంఎల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు .
BCలో ఎన్ని నిల్వలు ఉన్నాయి?
2019 నాటికి, బ్రిటిష్ కొలంబియాలో 203 స్వదేశీ దేశాలతో సంబంధం ఉన్న 1,583 నిల్వలు ఉన్నాయి (బ్రిటిష్ కొలంబియాలోని మొదటి దేశాలను కూడా చూడండి)
రిజర్వేషన్ అంటే ఏమిటి?
భారతదేశంలో రిజర్వేషన్, నిశ్చయాత్మక చర్య కోసం కుల కోటాలను విధించే ప్రభుత్వ విధానం . అనుమతి నిరాకరించడం మరియు రిజర్వేషన్, అనేక కామన్వెల్త్ దేశాలలో రాజ్యాంగబద్ధమైన అధికారం.
Read hindi news: hindi.vaartha.com
Read Also: TTD: 19న అక్టోబర్ నెల ఆర్జితసేవల టిక్కెట్లు విడుదల