తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన పోలవరం-బనకచర్ల (Polavaram-Banakacharla ) వివాదంపై ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో భేటీ అయ్యే అవకాశముంది. ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు శ్రమశక్తి భవన్ వేదికగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉండటంతో సమావేశం జరిగే అవకాశం బలంగా కనిపిస్తోంది.
తెలంగాణ వైఖరి మారిందా?
ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం ఈ చర్చకు అనుకూలంగా లేని వైఖరి చూపిన సంగతి తెలిసిందే. నిన్న కూడా అధికారికంగా చర్చకు వ్యతిరేకంగా ప్రకటించినప్పటికీ, రాత్రికి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉందన్న ఊహాగానాలు బలపడుతున్నాయి.
ప్రజల ఆశలు – వివాదానికి పరిష్కారం దిశగా?
ఈ సమావేశం ద్వారా పోలవరం, బనకచర్ల వంటి జలవివాదాలకు పరిష్కారం దొరుకుతుందన్న ఆశలు ప్రజల్లో నెలకొన్నాయి. రెండు రాష్ట్రాల సీఎంలు ఒకే వేదికపై కలుసుకోవడం, కేంద్రం మధ్యవర్తిత్వం చేయడం ద్వారా దీర్ఘకాలంగా కొనసాగుతున్న నీటి సమస్యలకు ఓ సమ్మత పరిష్కారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతుల భద్రత, నీటి పంచాయితీపై స్పష్టత రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు.
Read Also : Good News : భారీగా తగ్గనున్న ఏసీలు, ట్రాక్టర్ల ధరలు?