చైనా టెక్నాలజీ (China Technology) రంగంలో మరో అడుగు ముందుకేసింది. షెన్‌జెన్ నగరంలో 7-ఎలెవెన్ దుకాణాలకు సరుకులు మానవులు కాదు, ఇప్పుడు రోబోలు (Robots) తీసుకెళ్తున్నాయి. ఈ రోబోలు రైళ్లలో ప్రయాణిస్తూ, డెలివరీ పనులు చక్కగా పూర్తి చేస్తున్నాయి. మానవ శ్రమను తగ్గిస్తూ, సమయాన్ని ఆదా చేస్తున్నాయి.ఈ రోబోలు చాలా తెలివైనవే. దాదాపు ఒక మీటరు ఎత్తు ఉన్న వీటి పనితీరు ఆశ్చర్యపరిచే స్థాయిలో ఉంది. ఇవి ఎలివేటర్లు ఎక్కగలుగుతాయి, స్టేషన్లలో నడుస్తాయి, రైళ్లలో ప్రయాణిస్తాయి కూడా. రద్దీ తక్కువగా ఉన్న వేళల్లో డెలివరీ చేస్తూ, అవాంఛిత ఇబ్బందులకు దూరంగా ఉంటాయి.ఇంతకాలం దుకాణాల సిబ్బంది అందించే సరుకులను, ఇప్పుడు ఈ రోబోలు తీసుకెళ్తున్నాయి. స్టేషన్‌లో ఏదైనా డెలివరీ చేయాల్సి వస్తే, ఇక వారికి కష్టపడాల్సిన అవసరం లేదు. రోబోలు వారి పనిని భరోసాగా భుజాన వేసుకున్నాయి.

ఇప్పటికే 41 రోబోలు సేవలో
ప్రస్తుతం షెన్‌జెన్ స్టేషన్లలో 41 రోబోలు సేవలందిస్తున్నాయి. భవిష్యత్తులో వందకు పైగా 7-ఎలెవెన్ స్టోర్లకు వీటితో సరుకులు పంపించాలని ప్రణాళిక. వీటి చక్రాలు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. లిఫ్ట్‌లు, రైలు బోగీలలో సులభంగా ప్రవేశించేందుకు ఇవి అనుకూలంగా ఉంటాయి.
ప్రయాణికులు కూడా ఆశ్చర్యపోతున్నారు
రైల్లో ప్రయాణించే ప్రజలు ఈ రోబోలను చూసి తలెత్తని ఆశ్చర్యం పడుతున్నారు. రోబోలు ఇలా పని చేయడం టెక్నాలజీ శక్తిని చూపించే విధంగా ఉంది. ఇది నగరాల్లో సరుకు రవాణాలో విప్లవాత్మక మార్పు అని నిపుణులు అంటున్నారు.ఈ రోబో డెలివరీ వ్యవస్థతో చైనా టెక్ రంగంలో ముందున్న దేశంగా నిలుస్తోంది. డిజిటల్ యుగంలో ఇదో గొప్ప ముందడుగు అని చెప్పాల్సిందే.
Read Also : Modi: రక్షణ రంగాన్ని మరింత బలోపేతం దిశగా భారత్ అడుగులు