ఫిష్ ఫింగర్స్ (Fish fingers) అనేవి రుచికరమైన మరియు ప్రోటీన్ పరంగా మంచి ఆహారం. ఫిష్ ఫింగర్స్ (Fish fingers) ముఖ్యంగా స్టార్టర్ గా లేదా ఈవెనింగ్ స్నాక్ లా వాడతారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే (Everyone likes it)డిష్ ఇది. ఒక గిన్నెలో చేప ముక్కలు, నిమ్మరసం, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి పావుగంటపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి.

కావలసిన పదార్థాలు
చేప ముక్కలు (చర్మం, ముళ్లు తీసి నిలువుగా, సన్నగా కోసినవి): ఒక కప్పు, గుడ్లు: రెండు, మైదా: పావు కప్పు, బ్రెడ్ క్రంబ్స్: అర కప్పు, చిన్నగా తురిమిన అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి: అర టీస్పూన్ చొప్పున, ఆవాల పేస్ట్, రెడ్‌చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి: అర టీస్పూన్ చొప్పున, నిమ్మరసం: రెండు టీస్పూన్లు, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం
ఒక గిన్నెలో చేప ముక్కలు, నిమ్మరసం, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి పావుగంటపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. తర్వాత చేప ముక్కల్లో గుడ్లు, తురిమిన అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆవాల పేస్ట్, రెడ్‌చిల్లీ ఫ్లేక్స్, మైదా వేసి బాగా కలిపి మరో అరగంటపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి వేడిచేయాలి. ఒక ప్లేటులో బ్రెడ్ క్రంబ్స్ వేసి దాంట్లో ఒక్కో చేప ముక్కనూ బాగా దొర్లించి, కాగిన నూనెలో దోరగా కాల్చుకుంటే ఫిష్ ఫింగర్స్ (Fish fingers)సిద్ధం.
ఫిష్ ఫింగర్స్ ఏ దేశానికి చెందినది?
ఇగ్లో ప్రతినిధి ఆల్ఫ్రెడ్ జాన్సెన్ ప్రకారం, చేపల వేళ్లు UKలో కనుగొనబడ్డాయి, అక్కడ కాడ్ ముక్కలను బ్రెడ్‌క్రంబ్స్‌లో కప్పి వేయించేవారు. ఇగ్లో యొక్క UK-ఆధారిత సోదరి బ్రాండ్ BirdsEye 1955లో UK మార్కెట్లో మొదటిసారిగా భారీగా ఉత్పత్తి చేయబడిన ఘనీభవించిన ఆహార ఉత్పత్తులను ప్రారంభించింది.
ఫిష్ ఫింగర్స్ తినడం ఆరోగ్యమా?
ఫిష్ ఫింగర్స్ బి విటమిన్లు, సెలీనియం మరియు విటమిన్ డి (ముఖ్యంగా మీరు చిన్న ఎముకలను తినేటప్పుడు) యొక్క మంచి మూలం .” సామాన్యమైన చేప వేలు యొక్క తెల్ల చేపలో తక్కువ ఒమేగా-3 ఉంటుంది, కానీ ఇప్పటికీ ఇది చాలా మంచి వనరుగా పరిగణించబడుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Sweet potato fritters: చిలగడదుంప బజ్జీలు ఎలా తాయారు