Telugu Short Stories: ఒక రాజ్యంలో విక్రమసేనుడు అనే రాజు ఉండేవాడు. ఆయన చాలా దయగలవాడు, నిజాయతీపరుడు. ప్రజలను కన్నబిడ్డల్లా పరిపాలించేవాడు. ఆయనకు ఎప్పుడూ ఒక సందేహం ఉండేది. తన రాజ్యంలో ప్రజలందరూ తనలాగే నిజాయితీగా ఉంటున్నారా, లేదా అని తెలుసుకోవాలని అనుకునేవాడు.

“నేను కొన్ని బంగారు నాణేలు ఇస్తాను. అవి తీసుకుని మీ ఆకలి తీర్చుకోండి. అలాగే అధిక పంట దిగుబడికి కావలసినవి కూడా కొనుక్కోండి” అని చెప్పి పది బంగారు నాణేలు ఇచ్చాడు. రైతు అది చూసి చాలా ఆశ్చర్యపోయాడు.
“అయ్యా, మీరు ఎవరో నాకు తెలియదు. కానీ, మీరు నాకు సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు జీవితాంతం రుణపడి ఉంటాను, కానీ ఉచితంగా వచ్చే వాటిని నేను ఆశించను’ అని కృతజ్ఞతలు తెలిపాడు. రాజు చిరునవ్వుతో “మీ పంట పండిన తరువాత నాకు తెలియజేసే నేను కొనుగోలు చేసాను. అందుకోసం ముందుగా ఈ నాణేలు తీసుకోండి” అన్నాడు.
ఆ మాటలకు రైతు కాసేపు ఆలోచించి “అయ్యా!
మీరు చెప్పింది బాగానే ఉంది కానీ తమరి చిరునామా నాకు తెలియదుగా?” అన్నాడు.
అందుకోసం మారువేషంలో రాజ్యంలో సంచరిస్తుండేవాడు.
ఒకరోజు రాజు అలా మారు వేషంలో తిరుగుతుండగా ఒక పేద రైతు తన పొలంలో పని చేయడం చూసాడు. ఆ రైతు చాలా దీనంగా, ఆకలితో ఉన్నట్లు కనిపించాడు. రాజు అతని దగ్గరకు వెళ్లి “అయ్యా, మీరు చాలా నీరసంగా కనిపిస్తున్నారు. మీకు ఆకలిగా ఉందా?” అని అడిగాడు. మారు వేషంలో వున్న రైతు రాజును గుర్తుపట్టలేదు. “అవునయ్యా, చాలా ఆకలిగా ఉంది. కానీ, నా దగ్గర తినడానికి ఏమీ లేదు. నేను పండించిన పంటలో కొంత భాగం అమ్మి, ఆహారం కొనుక్కోవాలి” అని బదులిచ్చాడు.


“రాజు గారి కోట వద్దకు వచ్చి రాజయ్య అని అడిగితే ఎవరైనా చెప్తారు” అంటూ ఐదు నాణేలు ఇచ్చి అక్కడ నుండి రాజు వెళ్ళిపోయాడు.
రెండు నెలల తరువాత రైతు పంటను కోసి ధాన్యం బస్తాలు తీసుకుని కోట వద్దకు వచ్చి రాజయ్య గురించి అడగసాగాడు. కోట బురుజు నుండి చూసిన రాజు అన్న మాట ప్రకారం ధాన్యం తెచ్చిన రైతు నిజాయితీకి ఆశ్చర్యపోయాడు. రాజు ఆ రైతును సభకు పిలిపించి అతడి నిజాయితీని సభలోని వారందరికీ వివరించాడు. తరువాత ఆ రైతుకి బహుమానంగా అతడు తెచ్చిన ధాన్యంతో పాటు కొంత ధనం ఇచ్చి పంపించాడు.
నీతి: నిజాయితీ ఎప్పుడూ గుర్తింపును తెస్తుంది. విశ్వసనీయత ఉన్నవారికి భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు.