हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Congress : కాంగ్రెస్ నేతలే తెలంగాణ ద్రోహులు – జగదీశ్ రెడ్డి

Sudheer
Congress : కాంగ్రెస్ నేతలే తెలంగాణ ద్రోహులు – జగదీశ్ రెడ్డి

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీశ్ రెడ్డి (Jagadeesh Reddy) సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. నిన్న తిరుమలగిరిలో జరిగిన సభలో ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో రేవంత్ అసభ్యపదజాలం ఉపయోగించారని ఆయన విమర్శించారు. ‘‘సీఎంకు జ్ఞానమూ, సంస్కారమూ లేవు. పదవిలో ఉన్నవాడిలా కాకుండా, చౌకబారు మాటలతో మాట్లాడుతున్నారు’’ అని మండిపడ్డారు. ప్రజలను ఆకట్టుకోలేకపోతే, బూతులతో దూషించడం శాసనసభ స్థాయికి తగదని పేర్కొన్నారు.

రేషన్ కార్డుల విషయంలో సవాల్ విసిరిన బీఆర్ఎస్ నేత

బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 6.42 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని జగదీశ్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తమ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ‘‘ఈ విషయాన్ని ప్రభుత్వంతో చర్చిద్దాం. మా పాలనలో రేషన్ కార్డులు ఇవ్వలేదని రేవంత్ ధైర్యంగా చెబుతున్నారా? అది అబద్ధమైతే, ఆయన మా చెంపదెబ్బకు సిద్ధంగా ఉండాలి’’ అని సవాల్ విసిరారు. తాము చేసిన అభివృద్ధి కార్యాలను చాటిచెప్పేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు.

రేవంత్‌కు మోదీనే చీకటి గురువు

జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలే నిజమైన తెలంగాణ ద్రోహులు అని మండిపడ్డారు. ‘‘వారు తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు’’ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రాజకీయంగా బీజేపీ ప్రభావంలో ఉన్నారని, మోదీనే ఆయనకు చీకటి గురువు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీ–కాంగ్రెస్ కుట్రలను గుర్తించి, మరోసారి బీఆర్‌ఎస్‌ను మద్దతుగా నిలపాలని పిలుపునిచ్చారు.

Read Also : Mumbai: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు బాంబు బెదిరింపు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870