ప్రపంచంలోనే వయస్సులో అత్యంత వృద్ధ మారథాన్ రన్నర్‌గా గుర్తింపు పొందిన ఫౌజా సింగ్ (Fauja Singh)(114) మృతిచెందారు. పంజాబ్‌లోని జలంధర్-పఠాన్కోట్ హైవేపై రోడ్డు దాటుతుండగా ఓ వేగంగా వస్తున్న కారు ఆయనను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలించినప్పటికీ, ప్రాణాలు కోల్పోయారు. ఫౌజా సింగ్ మృతితో అంతర్జాతీయ క్రీడా సమాజం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.
సుదీర్ఘ జీవితం, అప్రతిహత ఆట సమర్ధ్యం
ఫౌజా సింగ్ 1911 ఏప్రిల్ 1న పంజాబ్‌లోని జలంధర్‌లో జన్మించారు. ఆయన జీవితంలో 1992 ఒక మలుపు తీసుకొచ్చింది . తన భార్య జియాన్ కౌర్ మరణంతో ఆయన బాగా మానసికంగా కలతకు గురయ్యారు. ఆ తర్వాత తన కుమారుడితో కలసి ఇంగ్లండ్‌కు వెళ్ళారు. అప్పటి నుంచే మారథాన్ పట్ల ఆసక్తి పెరిగి, ఆటకు మళ్లారు. వయస్సు ఏమాత్రం ఆటలో ఆటంకం కాదని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ఫౌజా.
అంతర్జాతీయ మారథాన్‌లలో చిరస్మరణీయ ప్రదర్శన
ఫౌజా సింగ్ లండన్, టొరంటో, న్యూయార్క్ వంటి ప్రముఖ అంతర్జాతీయ మారథాన్‌లలో పాల్గొన్నారు. 42 కిలోమీటర్ల మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేయడమే కాదు, టొరంటో మారథాన్‌ను 5 గంటలు 44 నిమిషాలు 4 సెకన్లలో ముగించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆశ్చర్యాలు కలిగించిన ఘనత. ఆయన దృఢ సంకల్పం, ఆరోగ్యంపై పట్టుదల ప్రపంచ మారథాన్ ప్రేమికులకు ఆదర్శంగా నిలిచింది. ఆయన మృతి క్రీడా ప్రపంచానికి తీరని లోటు.
Read Also : Chandrababu : నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు