తెలంగాణ రాష్ట్రం నాగర్కర్నూల్ జిల్లాలోని కల్వకోల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు (Congress Leader Murder) కర్నాటి దామోదర్ గౌడ్ (48) హత్యకు గురైన ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ ఘటన స్థానికంగా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అదృశ్యం… చివరకు మృతదేహం
దామోదర్ గౌడ్ (Damodar Goud) రెండు రోజులుగా కనిపించకుండా పోవడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి సీరియస్గా దర్యాప్తు ప్రారంభించారు. అన్వేషణలో భాగంగా పోలీసులకు సింగోటం రిజర్వాయర్ (Singotam Reservoir) లో ఓ శవం తేలిందని సమాచారం రావడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. చివరికి అది దామోదర్ గౌడ్ శవంగా గుర్తించారు.
హత్య వెనుక కారణాలు – వివాహేతర సంబంధమే ముప్పు?
దామోదర్ గౌడ్ కు అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సదరు మహిళతో గడిపేందుకు వెళ్లాడు. దామోదర్ గౌడ్ ఆ మహిళతో సన్నిహితంగా ఉండగా సదరు మహిళ భర్త, కొడుకు గమనించారు. ఆగ్రహం పట్టలేక ఇద్దరిపైనా దాడి చేసి దామోదర్ గౌడ్ ను కొట్టి చంపారు. ఆ తర్వాత శవాన్ని సంచిలో మూటకట్టి తీసుకెళ్లి ఎంజీకేఎల్ కెనాల్ లో పడేశారు. రెండు రోజుల తర్వాత దామోదర్ గౌడ్ మృతదేహం సింగోటం రిజర్వాయర్ లో తేలింది.
పోలీసుల విచారణ – ముగ్గురు అదుపులో
ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం ఆ మహిళను, ఆమె భర్త, కుమారుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: TG Rains: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు పలు జిల్లాల్లో వర్షాలు