ఇప్పటికే 43,400 మంది స్టేట్ ర్యాంక్లను ప్రకటించిన తెలంగాణ హెల్త్ వర్సిటీ
హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో స్టేట్ నీట్ కౌన్సెలింగ్ ఆగస్టు మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఈ నెల 21 నుంచి ఆలిండియా కోటా, డీమ్డ్ వర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలకు మొదటి విడత కౌన్సెలింగ్ను ప్రారంభించనున్నట్టు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసిసి) ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో, ఆగస్టు మొదటి వారంలో స్టేట్ నీట్ కౌన్సెలింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. అయితే రాష్ట్రాలకు చెందిన కౌన్సెలింగ్ను ఈ నెల 30 నుంచి ఆగస్టు 6 వరకు పూర్తి చేయాలని ఎంసిసి సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మెడిలక్ కాలేజీల్లో అడ్మిషన్ల (Admissions in medical colleges) కోసం కౌన్సెలింగ్ షెడ్యూల్ను కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ ఈ నెలాఖరులో ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఎంబిబిఎస్, బిడిఎస్, బిఎసి సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం నీట్ యూజీ-2025 కౌన్సెలింగ్ షెడ్యూలు ఎంసిసి ప్రకటించిన విషయం తెలిసిందే.
విద్యార్థులు హాజరు
ఈ నెల 21 నుంచి 30 వరకు ఆలిండియా కోటా, డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీలు, రాష్ట్రం పరిధిలోని సీట్లలో చేరికకు సంబంధించిన మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ను ప్రకటించింది. మొత్తం మూడు రౌండ్లలో జరిగే నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 10వరకు కొనసాగనుంది. మొదటి విడత నీట్ స్టేట్ కౌన్సెలింగ్ను ఈ నెల 30 నుంచి ఆగస్టు 6 వరకు నిర్వహిస్తారని ఎంపిసి ప్రకటించింది. మూడు రౌండ్ల నీట్ కౌన్సెలింగ్ సెప్టెంబర్ 18 వరకు కొనసాగనున్నట్టు ఎంసిపి షెడ్యూల్ను విడుదల చేసింది. సెప్టెంబర్ 1వ నుంచి ఎంబిబిఎస్ (MBBS) మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభంకానున్నట్టు వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి నీట్ యూజీ- 2025 పరీక్షకి 70,258 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 43,400 మంది అర్హత సాదించినట్లు ఇప్పటికే కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఈ నెల 10న ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలతోపాటు డీమ్డ్ యూనివర్సిటీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కలిపి మొత్తం 64 మెడికల్ కాలేజీలున్నాయి.

డీమ్డ్ యూనివర్సిటీ కేటగిరీలో
వాటిలో 34 రాష్ట్ర ప్రభుత్వ కాలేజీలు కాగా, 28 ప్రైవేటు కాలేజీలు, మల్లారెడ్డి డీమ్డ్ యూని వర్సిటీ పేరిట 2 కాలేజీలు ఉండగా, ఈఎస్ఐ, బీబీనగర్ ఎయిమ్స్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నవి ఉన్నాయి. ఈ కాలేజీలు అన్నింటిలో కలిపి 9,065 ఎంబిబిఎఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 4,080 సీట్లు ఉండగా, వాటిలో 15 శాతం నేషనల్ పూల్ కోటా.. అంటే 613 సీట్లు ఆలిండియా కోటా సీట్లుగా భర్తీ అవుతాయి. మిగిలిన 3,477 సీట్లు పూర్తిగా తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి. 26 ప్రైవేట్ కాలేజీల్లో 4,850 సీట్లు ఉన్నాయి. మల్లారెడ్డి యూనివర్సిటీకి చెందిన రెండు మెడికల్ కాలేజీ (Medical College) లు అందులో ఒకటి మహిళా కాలేజ్ కొనసాగుతోంది, రెండు కూడా డీమ్డ్ యూనివర్సిటీ కేటగిరీలో కొనసాగుతు న్నాయి. ఈ రెండుకళాశాలల్లో కలిపి 400సీట్లు ఉండగా, డీమ్డ్ యూనివ ర్సిటీ విభాగంలో కౌన్సెలింగ్ జరుగనుంది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 4,850 సీట్లలో 50శాతం కన్వీనర్ కోటా తెలంగాణ విద్యార్థులకే దక్కు తాయి. మరో 50 శాతం సీట్లలో 35 శాతం సీట్లు బి కేటగిరి సీట్లు కాగా.. మరో 15 శాతం సీట్లు సి కేటగిరీలో ఎన్ఆర్ఎ కోటాలో భర్తీ చేస్తారు.
NEET పరీక్షలు మూడు రకాలు పరీక్షలు ఏవి?
NEET పరీక్షలు మూడు రకాలుగా ఉంటాయి.NEET UG (Undergraduate),NEET PG (Postgraduate),NEET SS (Super Specialty).
NEET పరీక్ష కేవలం MBBS కోర్సుకేనా?
లేదు, NEET పరీక్ష కేవలం MBBS కోర్సుకే కాకుండా, BDS (Dental) మరియు ఇతర ఆయుష్ కోర్సులు (BAMS, BHMS, BUMS, BNYS),B.Sc. Nursing కోర్సుల్లో ప్రవేశానికి కూడా అవసరం.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Vivek Venkata swamy: సింగరేణి నిధులు ఇక్కడే ఖర్చు చేస్తాం- మంత్రి వివేక్ వెంకటస్వామి