అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం (AP Government) ఐదేళ్ల కాలానికి వర్తించే కొత్త అంతరిక్ష విధానాన్ని (Space Policy) అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రంలో అంతరిక్ష పరిశ్రమ, పరిశోధన, మరియు పెట్టుబడుల అభివృద్ధికి దోహదపడే విధంగా రూపొందించిన ఈ పాలసీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను అంతరిక్ష రంగంలో ముందడుగు వేసే రాష్ట్రంగా మార్చుకోవాలని లక్ష్యం పెట్టుకుంది.
స్పేస్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు
ఈ కొత్త స్పేస్ పాలసీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం (AP Government )ఒక ప్రత్యేక సంస్థగా ‘రాష్ట్ర స్పేస్ సిటీ కార్పొరేషన్’ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ కార్పొరేషన్ ద్వారా అంతరిక్ష ప్రాజెక్టుల ప్రణాళిక, అమలు, మానిటరింగ్ వంటి పనులను సమర్థవంతంగా నిర్వహించనున్నారు.
పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, స్టార్టప్‌లు
ఈ స్పేస్ పాలసీ ద్వారా పెట్టుబడులను ఆకర్షించడం, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, స్టార్టప్‌లకు నిధులు (Funding for startups) సమకూర్చడం వంటి లక్ష్యాలను ప్రభుత్వం పెట్టుకుంది. దేశీయ, అంతర్జాతీయ సంస్థలను ఈ ప్రాజెక్టులలో భాగస్వామ్యులుగా చేసుకోవాలని సూచించింది.
స్పేస్ సిటీలు – సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో
ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం, స్పేస్ సిటీ కార్పొరేషన్ అంతరిక్ష ప్రాజెక్టుల అమలుకు సహాయం చేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ స్పేస్ సిటీలు సత్యసాయి మరియు తిరుపతి జిల్లాల్లో ఏర్పాటు చేయబడతాయి. భూ కేటాయింపులు మరియు దరఖాస్తుల పరిశీలన వంటి ప్రక్రియలు ఒక కమిటీ ద్వారా అనుమతులు పొందుతాయని ప్రభుత్వం తెలియజేసింది .
Read hindi news hindi.vaartha.com
Read also Srisailam: శ్రీశైలంలో స్పర్శ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత