हिन्दी | Epaper
నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు

RCB: పోలీసులు ఆర్‌సీబీ దుర్ఘటనకు కారణమని తేల్చిచెప్పిన జ్యుడీషియల్ కమిషన్

Anusha
RCB: పోలీసులు ఆర్‌సీబీ దుర్ఘటనకు కారణమని తేల్చిచెప్పిన జ్యుడీషియల్ కమిషన్

వివరాల నివేదిక

గత నెల జూన్ 4వ తేదీన బెంగళూరులో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనపై స్పందనలు వస్తూనే ఉన్నాయి. ఈ ఘటన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయోత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద చోటుచేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఈ నేపథ్యంలో పదవీ విరమణ పొందిన న్యాయమూర్తి జాన్ మైఖేల్ డి’కున్హా నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య న్యాయ విచారణ కమిటీ తన వివరాల నివేదికను ప్రభుత్వం కు సమర్పించింది. నివేదికలో ఈ ఘటనకు పాల్పడిన బాధ్యులపై స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు.ఈ దుర్ఘటనకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), పోలీసుల నిర్లక్ష్యమే కారణమని స్పష్టం చేసింది.చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన దుర్ఘటనలో మొత్తంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. ఈక్రమంలోనే కర్ణాటక సర్కారు జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

జాయింట్ కమిషనర్

విచారణలో భాగంగా ఘటనతో సంబంధం ఉన్న ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది.పలువురు ప్రత్యక్ష సాక్షులు, క్రికెట్ సంఘం అధికారులు, పోలీస్ అధికారుల వాంగ్మాలాలు రికార్డు చేసింది. అలాగే స్టేడియం లోపల మొత్తంగా 79 మంది పోలీసులు మాత్రమే ఉన్నారని, ఇక బయలు ఎవరూ లేరని పేర్కొంది. ఘటనా స్థలం వద్ద అంబులెన్సులు కూడా లేవని, పోలీసుల యంత్రాంగం పూర్తిగా విఫలం అయింది చెప్పింది. అలాగే ఘటన జరిగిన తర్వాత సాయంత్రం 4 గంటల సమయంలోనే జాయింట్ కమిషనర్ (Joint Commissioner) వచ్చారని, 5.30 గంటల తర్వాతే పోలీసు కమిషనర్‌కు ఈ విషయంపై సమాచారం ఇచ్చారని వెల్లడించింది.అలాగే న్యాయ కమిటీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సమర్పించిన ఈ నివేదికలో.. తొక్కిసలాటకు దారితీసిన పలు లోపాలను ఎత్తి చూపినట్లు తెలుస్తోంది.

RCB: పోలీసులు ఆర్‌సీబీ దుర్ఘటనకు కారణమని తేల్చిచెప్పిన జ్యుడీషియల్ కమిషన్
RCB: పోలీసులు ఆర్‌సీబీ దుర్ఘటనకు కారణమని తేల్చిచెప్పిన జ్యుడీషియల్ కమిషన్

అనవసరమైన రద్దీ

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారాలు, ఉచిత పాస్‌ల గురించిన ప్రకటనలు భారీ జన సమూహాన్ని ఆకర్షించాయని నివేదిక పేర్కొంది. ఇది తొక్కిసలాటకు ప్రధాన కారణాలలో ఒకటిగా మానట్లు వెల్లడించింది. అంతేకాకుండా నిర్వాహకులు డిజిటల్ ప్రత్యామ్నాయాలు లేకుండా ఫిజికల్ టిక్కెట్ల (Physical tickets) ను జారీ చేయడాన్ని కూడా నివేదిక తీవ్రంగా విమర్శించింది. దీనివల్ల అనవసరమైన రద్దీ ఏర్పడిందని, భద్రతా చర్యలు పూర్తిగా విఫలం అయ్యాయని స్పష్టం చేసింది. ఇవి మాత్రమే కాకుండా జన నియంత్రణకు సంబంధించిన పద్ధతుల్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని కమిటీ స్పష్టం చేసింది. పోలీసులకు, నిర్వాహకులకు మధ్య సమన్వయం లేకపోవడం కూడా ఈ దుర్ఘటనకు దారి తీసిందని నివేదిక హైలైట్ చేసింది. అవసరమైన బారికేడింగ్ లేకపోవడం, జన సమూహం కదలికలకు స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం వంటి లోపాలను కూడా కమిటీ తన నివేదికలో గుర్తించింది.

పునరావృతం కాకుండా

ఈ నివేదికను అందుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. దానిని జూలై 17న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో పరిశీలనకు ఉంచుతామని తెలిపారు. మంత్రివర్గం చర్చించిన అనంతరం ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.విష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి, పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడే కార్యక్రమాలను నిర్వహించడానికి ఒక ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (Standard Operating Procedure – SOP) రూపొందించాలని నివేదిక ప్రభుత్వాన్ని కోరింది. ఈ న్యాయ నివేదిక, తొక్కిసలాట వంటి దుర్ఘటనలకు కేవలం వ్యవస్థాపరమైన లోపాలు మాత్రమే కాకుండా, నిర్వాహకులు, భద్రతా బలగాల మధ్య సమన్వయం లోపించడమే ప్రధాన కారణమని స్పష్టం చేస్తోంది.

RCB ఇప్పుడు CSK కంటే ధనవంతమైన ఫ్రాంచైజీనా?

తాజా నివేదిక ప్రకారం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీ విలువ ప్రస్తుతం $269 మిలియన్ డాలర్లకు (సుమారుగా ₹2,240 కోట్లు) చేరుకుంది. దీని వలన RCB, గతంలో పై స్థానం లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ముంబయి ఇండియన్స్‌లను అధిగమించి అత్యంత విలువైన ఐపీఎల్ ఫ్రాంచైజీగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Radhika Yadav: టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ హత్యపై కో-స్టార్ ఏమన్నారంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870