విజయవాడ : స్వయంఉపాధి రంగంలో మహిళలు నిలదొక్కునేందుకు ఏపీ ప్రభుత్వ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది. మోటారు వెహికిల్ రంగంలోను వారికి అండగా నిలుస్తోంది, మోటారు వాహనాలపై ప్రయాణికులను తీసుకుని వెళ్ళేందుకు వీలుగా వారికి రాయితీపై విద్యుత్తు బైక్లు, స్యూటీలుఅందిస్తోంది. ఆటో రిక్షాలను అందిస్తోంది. మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసేందుకు ఏర్పడినవే స్వయం సహాయక సంఘాలు వడ్డీ లేని రుణాలు (Interest Free Loans) ఇస్తూ స్వయం సమృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వాటిని మరింత బలోపేతం చేసి మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు సీఎం చంద్రబాబు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద ప్రధాన నగరాల్లో ఇప్పటికే మహిళలు ఈ ర్యాపిడో సేవల్లో ఉన్నారు.
ఉపాధికి బాటలు
విజయవాడ, విశాఖలో 400 మంది చొప్పున లబ్దిదారులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తరించి 4 వేల 800 మందిని ర్యాపిడో నెట్వర్క్ల్లో చేర్చడమే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. విజన్ 2047కు అనుగుణంగా మహిళలు అభ్యున్నతి సాధించేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందంటున్నారు. మెప్మాతో ర్యాపిడోను అనుసంధానం చేసి మహిళలకు 12 వేల వరకు సబ్సిడీ కింద విద్యుత్ వాహనాల (Electric vehicles) అందిస్తూ ఉపాధికి బాటలు వేశారు. సాధారణంగా ర్యాపిడో అంటేనే పురుష డ్రైవర్లు కనిపిస్తారు కానీ ఇక్కడ మహిళా ర్యాపిడో డ్రైవర్లన చూడొచ్చు.

అనుసంధానం
మెప్మాలో ఉన్న మహిళలక మరింత అండగా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అతివలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చేందుకు సబ్సిడీ కిండా విద్యుత్ వాహనాలు అందించింది. కొందరి క్ స్కూటీలు, మరికొందరికి ఆటోలు పంపిణ చేసింది. అంతేకాకుండా మెప్మా (Mepma) తో ర్యాపిడోన అనుసంధానం చేసింది. ర్యాపిడో యాపి ఉపయోగించడంపైనా శిక్షణ ఇచ్చారు. ర్యాపిడ్ సర్వీసులను మహిళలు నిర్వహించే విధంగా ఏపీ ప్రభుత్వం మెప్మా ద్వారా అందిస్తోంది. సహకారం వారికి డ్వాక్రా గ్రూప్ ద్వారా వాహనాలు తీసుకుంటే ద్విచక్రవాహనానికి రూ.12 వేలు, ఆటో తీసుకుని ర్యాపిడో వాడుతుంటే రూ.30 వేల సబ్సిడీ పొందవచ్చు.
MEPMA యొక్క పూర్తి రూపం (Full Form)?
MEPMA stands for Mission for Elimination of Poverty in Municipal Areas.
ఆంధ్రప్రదేశ్ MEPMA డైరెక్టర్ ఎవరు?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర MEPMA (Mission for Elimination of Poverty in Municipal Areas)మిషన్ డైరెక్టర్ గా శ్రీ ఎన్. తేజ్ భరత్ (IAS) గారు పనిచేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: AP High Court: కారాగారంలో మూడేళ్లుగా నిర్బంధం.. తప్పుపట్టిన హైకోర్టు