ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జిపిఒ
హైదరాబాద్: రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతంచేసి భూ సమస్య లపై సామాన్యులకు మెరుగైన సేవలందిం చడానికి వీలుగా సిఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి జీపీవో (GPO for revenue village), ప్రతి మండలానికి భూ విస్తీర్ణాన్ని బట్టి4 నుంచి 6మంది వరకు లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించబోతున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) తెలిపారు.

రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ ఇందుకు సంబం నిర్వహిస్తామని తర్వాత 28, 29 తేదీల్లో జెఎన్టియు ఆధ్వర్యంలో ల్యాబ్ ప్రాక్టికల్ పరీక్ష నిర్వహిస్తామని, ఆగస్టు 12వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. తుది పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు 40 రోజుల పాటు అప్రెంటిస్ శిక్షణ ఉంటుందని తెలిపారు. భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ (Survey Map) తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు అవసరమైన సర్వేయర్లను అందుబాటులోకి తీసుకురావలన్న లక్ష్యంతో లైసెన్స్డ్ డ్ సర్వేయర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించగా 10 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని ఇందులో తొలివిడతలో 7వేల మందికి 33 కేంద్రాల్లో మే 26వ తేదీనుంచి శిక్షణ అంధించి ఈనెల 26తో 50 రోజుల శిక్షణ పూర్తవుతుందని తెలిపారు. మిగిలిన 3వేల మందికి ఆగస్టు 2వ వారం నుంచి శిక్షణ ప్రారంభిస్తామని తెలిపారు.
రెవెన్యూ, సర్వే విభాగానికి మధ్య అవినాభావ సంబంధం ఉందని, సర్వేవిభాగం బలోపేతంతో రెవెన్యూ వ్యవస్థలో మెరుగైన సేవలు అందించగలుగు తామని దీనిని దృష్టిలో పెట్టుకొని సర్వేవిభాగాన్ని బలోపేతం చేస్తున్నా మన్నారు. మరోసారి అవకాశం కల్పించాలన్న రెవెన్యూ సంఘాల అభ్యర్ధన మేరకు ఈనెల 27న మరోసారి వీరికి అర్హత పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. ఐదు నక్షా గ్రామాల్లో రీసర్వే పూర్తి గత ప్రభుత్వం నక్షా లేని గ్రామాలను గాలికి వదిలేస్తే సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం దీనికి పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో నక్షా లేని 413 గ్రామాలకు గాను 5 గ్రామాలలో ప్రయోగాత్మకంగా రీ సర్వేను విజయవంతంగా పూర్తి చేశామన్నారు .
పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఏ మంత్రి?
పొంగులేటి శ్రీనివాస రెడ్డి భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన 2023 డిసెంబర్ 7వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఆదాయ శాఖ, గృహ నిర్మాణం, సమాచార మరియు ప్రజాసంబంధాల శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Jitender Reddy: కాన్‌స్టిట్యూషన్ క్లబ్ కోశాధికారిగా మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి?