తమిళనాడులోని తిరువణ్ణామలైలో అరుణాచలేశ్వరస్వామి గిరి ప్రదక్షిణ(Giri Pradakshina)కు వెళ్లిన యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన భక్తుడు విషాదకరంగా హత్యకు గురయ్యాడు. సౌందరాపురం గ్రామానికి చెందిన విద్యాసాగర్ అనే 32 ఏళ్ల యువకుడు భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు అతనిపై దాడికి పాల్పడ్డారు.
తీవ్ర గొడవ.. కత్తితో దాడి
ప్రదక్షిణ చేస్తుండగా ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంతో వచ్చి విద్యాసాగర్(Vidyasagar)ను ఢీకొట్టారు. కింద పడిన విద్యాసాగర్ వారితో వాగ్వాదానికి దిగాడు. దాంతో ఆగ్రహించిన యువకులు తమ వద్ద ఉన్న కత్తితో విద్యాసాగర్‌పై విచక్షణలేని దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన విద్యాసాగర్‌ను అక్కడే ఉన్న ఇతర భక్తులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు.
నిందితుల అరెస్ట్ – కేసు దర్యాప్తు
ఈ ఘటనపై వెంటనే కేసు నమోదు చేసిన తిరువణ్ణామలై పోలీసులు, నిందితులైన గుగనేశ్వరన్, తమిళరసన్‌లను గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ హత్యతో భక్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. గిరి ప్రదక్షిణ వంటి పవిత్ర యాత్రలో ఇలాంటి ఘటనలు జరగడం పట్ల భక్తులలో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
Read Also : Earthquake: ఢిల్లీలో మరోసారి భూప్రకంపనలు