హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో కల్తీ కల్లు (Adulterated toffee) సేవించి బలవుతుండటం కలకలం రేపుతోంది. ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించిన మృతుల సంఖ్య ఆరుగురికి చేరింది. కానీ నాగర్‌కర్నూల్‌లో మరొక వృద్ధురాలి మరణం కూడా కల్తీ కల్లు వల్లేనన్న అనుమానంతో ఆ సంఖ్య ఏడుకు చేరే అవకాశం కనిపిస్తోంది.

కల్తీ కల్లుతో కలకలం – బాధితుల పరిస్థితి విషమం
వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పలు ఆసుపత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించారు. కల్తీ కల్లు ఘటనలో బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గురువారం మరొకరు మరణించడంతో ఆ సంఖ్య ఆరుకు చేరింది. ఓ వృద్ధురాలు నాగర్‌కర్నూల్‌లో మరణించినట్లు సమాచారం. అది నిర్ధారణ అయితే మృతుల సంఖ్య ఏడుకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 51 మంది చికిత్స (51 people treated) పొందుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది.
ఆసుపత్రుల్లో పడకల కొరత – ఎంచుకున్న చికిత్స విధానం
నిమ్స్ ఆసుపత్రిలో 34 మంది, గాంధీలో 15 మంది, ఒకరు ఈఎస్ఐ, మరొకరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన వారిలో నాలుగు మృతదేహాలకు గాంధీలో పోస్ట్‌మార్టం పూర్తిచేసి కుటుంబీకులకు అందించారు. నిమ్స్‌లో పడకల కొరత ఏర్పడకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి వచ్చే కల్తీ కల్లు బాధితుల్లో అత్యవసర చికిత్స అవసరమైన వారిని మాత్రమే చేర్చుకుంటున్నారు. శరీరంలో లవణాల స్థాయిలు స్థిరంగా ఉండి, కొంత అనారోగ్యం ఉన్నవారిని గాంధీకి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కల్తీ కల్లు బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు గాంధీ, నిమ్స్ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా వైద్య బృందాలను అందుబాటులో ఉంచినట్లు వివరించారు.
కల్తీ కల్లు మూలం
నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వారిని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించారు. కల్తీ కల్లు కారణంగా కిడ్నీలు దెబ్బతిన్న ఆరుగురుకి నిమ్స్‌లో డయాలసిస్ చేస్తుండగా, వారి పరిస్థితి కొంత ప్రమాదకరంగా ఉన్నట్టు సమాచారం. మిగిలిన వారంతా కోలుకుంటున్నారని, ఒకటి రెండు రోజుల్లో వారిని ఇంటికి పంపే అవకాశం ఉందని తెలిపారు.
రాజకీయ పార్టీల విమర్శలు – మరణాల లెక్క దాచేవారు?
ఈ విషాదకర ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటే, ప్రభుత్వం ఆ లెక్కను దాస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, జీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ సహా పలువురు రాజకీయ నేతలు కల్తీ కల్లు బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం వెంటనే కల్తీ కల్లు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
బాధిత కుటుంబాల ఆవేదన – ఆర్థిక భారం అధికం
ఈ కల్తీ కల్లు ఘటన కారణంగా అధికారులు కఠినంగా వ్యవహరించాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఆసుపత్రుల వద్ద పడిగాపులు కాయడం, ఆసుపత్రి ఖర్చులు భరించడం మోయరాని భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
న్యాయప్రక్రియలో పోలీసులు
కల్తీ కల్లు కేసులో కల్లు కంపౌండ్లను నిర్వహిస్తున్న పలువురిని ఇప్పటికే పోలీసులు న్యాయస్థానం ముందు హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు. ప్రభుత్వ ఆదేశాలతో బాధితుల సంఖ్య, వారి వివరాలను వెల్లడించడంలో అధికారులు ఆచీతూచి వ్యవహరిస్తున్నారు. కానీ ఈ ఘటనకు పాల్పడిన ప్రధాన ముఠా ఇప్పటికీ బయటే ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి .
కల్తీ అని ఎందుకు అంటారు?
అడల్టరేట్ అనే క్రియ లాటిన్ పదం అడల్టరేర్ నుండి వచ్చింది, దీని అర్థం “తప్పుడు పేరు పెట్టడం” లేదా “పాడు చేయడం.” అసలు, స్వచ్ఛమైన, తాజా లేదా ఆరోగ్యకరమైనది ఏదైనా చెడిపోయినా, కలుషితమైనా, వికృతమైనా, లేదా ఇతరత్రా నాసిరకంగా చేయబడినా, అది కల్తీ చేయబడినట్లే.
Read hindi news: hindi.vaartha.com
Read also: ACB: ఎసిబికి చిక్కిన డిప్యూటీ కలెక్టర్ రాజు, డిప్యూటీ తహసీల్దార్ సతీష్, డ్రైవర్ దుర్గయ్య