हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Superman Review: సూప‌ర్ మ్యాన్ ట్విట్ట‌ర్ రివ్యూ!

Ramya
Superman Review: సూప‌ర్ మ్యాన్ ట్విట్ట‌ర్ రివ్యూ!

సూపర్‌మ్యాన్: లెగసీ – అభిమానుల అంచనాలకు మించి!

Superman Review: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సినీ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసిన భారీ హాలీవుడ్ చిత్రం సూపర్‌మ్యాన్: లెగసీ (Superman) ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేసింది. ఇప్పటికే అనేక దేశాల్లో పెయిడ్ ప్రీమియర్లు, నైట్ షోలు విజయవంతంగా ప్రదర్శించబడగా, మన భారతదేశంలోనూ పలు ప్రాంతాల్లో షోలు పడిపోయాయి. ఒక బాలీవుడ్ లేదా టాలీవుడ్ స్ట్రెయిట్ భారీ చిత్రం థియేటర్‌కు వచ్చిందా అన్న రీతిలో, ఈ సినిమా 1000కి పైగా థియేటర్లలో విడుదలై భారతీయ బాక్సాఫీసును ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ చిత్రంలో డేవిడ్ కోరెన్‌స్వెట్ (David Corenswet) కొత్త సూపర్‌మ్యాన్‌గా కనిపించనుండగా, రాచెల్ బ్రాస్నహన్, నికోలస్ హౌల్ట్ కీలక పాత్రల్లో నటించారు. గతంలో భారీ విజయం సాధించిన చిత్రాలు సూసైడ్ స్క్వాడ్, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సినిమాలను తెరకెక్కించిన జేమ్స్ గన్ (James Gunn) ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం చూసిన ప్రేక్షకులు ఎలాంటి రివ్యూలు ఇస్తున్నారో, వారి అభిప్రాయాలేంటో ఇక్కడ చూద్దాం.

Superman Review: సూప‌ర్ మ్యాన్ ట్విట్ట‌ర్ రివ్యూ!
Superman Review: సూప‌ర్ మ్యాన్ ట్విట్ట‌ర్ రివ్యూ!

కథాంశం, ప్రారంభ సన్నివేశాలు: ఒక కొత్త ఆరంభం!

Superman Review: సినిమా ఆరంభం ఒక మిషన్‌లో పాల్గొని తీవ్రంగా దెబ్బతిని పడి ఉన్న సూపర్‌మ్యాన్‌ను చూపిస్తూ ప్రారంభమవుతుంది. లూథర్ అనే వ్యక్తి ఎలాగైనా సూపర్‌మ్యాన్‌కు ప్రజల్లో ఉన్న మంచి గుర్తింపును, ఫాలోయింగ్‌ను పూర్తిగా నాశనం చేసి అతన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తాడు. అనేక కుట్రలతో ఒక వీడియోను విడుదల చేస్తాడు. దాంతో సూపర్‌మ్యాన్‌కు అంతటా చెడ్డ పేరు వస్తుంది, జనంలో తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది. అదే సమయంలో, ప్రపంచాన్ని నాశనం చేసే శక్తులు రంగంలోకి దిగుతాయి. అందులో సూపర్ పవర్స్ ఉన్న విలన్ లవర్ సైతం ఉంటుంది. ఈ నేపథ్యంలో, హీరో కోల్పోయిన తన పరువును తిరిగి ఎలా సంపాదించుకున్నాడు, ఆ శక్తివంతమైన విలన్‌లను ఎలా అడ్డుకున్నాడు అనే పాయింట్‌తో సినిమా సాగుతుంది.

విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల అభిప్రాయాలు!

ఈ సినిమా ఇప్పటివరకు వచ్చిన అన్ని సూపర్‌మ్యాన్ చిత్రాలను మించి ఉందని, ఎక్కడా తప్పు పట్టడానికి, వేలెత్తి చూపించడానికి అవకాశం లేకుండా ఉందని ఘంటాపథంగా చెబుతున్నారు. చాలా రోజుల తర్వాత అద్భుతమైన సూపర్ హీరో మూవీ వచ్చిందని, ఎక్కడా నిరాశపరచదని, కుటుంబమంతా కలిసి సినిమాను చూడవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా విలన్‌తో వచ్చే మొదటి సన్నివేశం, ఆపై హీరోయిన్‌తో రొమాన్స్, గొడవ సీన్లు ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటాయని, వారి పాత్రలు హైలెట్‌గా ఉన్నాయని కామెంట్లు పెడుతున్నారు. అదేవిధంగా, హీరో పెంపుడు కుక్క క్రిప్టో సైతం మంచి మార్కులు కొట్టేస్తుందని, పిల్లలు బాగా ఇష్టపడతారని అంటున్నారు.

విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్, ఇతర పాత్రలు!

ఇక అన్నింటికి మించి విజువల్ ఎఫెక్ట్స్ మోస్ట్ అడ్వాన్స్‌డ్‌గా, అద్భుతంగా ఉన్నాయని, ఇటీవల ఇంత పర్ఫెక్ట్ గ్రాఫిక్స్ చూడలేదని, కలర్ కరెక్షన్ కూడా బాగా సెట్ అయిందని అంటున్నారు. అంతేకాక, హక్ గర్ల్, మిస్టర్ టెర్రిఫిక్, గై గార్డెన్ పాత్రలు ఆకట్టుకుంటాయని, మధ్యలో వచ్చే జస్టిస్ లీగ్ మెంబర్స్, సర్ప్రైజ్ క్యామియోస్ మంచి ఎనర్జీని ఇస్తాయని పోస్టులు పెడుతున్నారు. యాక్షన్ సన్నివేశాలు, వాటిని చిత్రీకరించిన విధానం నభూతో అన్న రీతిలో ఉన్నాయని, కేవలం యాక్షన్ ప్రియులే కాకుండా కుటుంబం అంతా కలిసి తప్పకుండా చూడాల్సిన సినిమా అని, ఈ మధ్య ఇంత మంచి సినిమా రాలేదని చూస్తే ఆశ్చర్యపోతారంటూ సూపర్‌మ్యాన్: లెగసీ (Superman) సినిమాను ఆకాశానికెత్తేస్తూ చాలామంది ట్వీట్లు చేస్తున్నారు.

సూపర్ మ్యాన్ సినిమా మంచిదేనా?

ఇది నేను చూసిన అత్యంత హాస్యభరితమైన సూపర్ హీరో సినిమా , శుభవార్త ఏమిటంటే హాస్యం ఉద్దేశపూర్వకంగా రూపొందించబడింది. ఇది యాక్షన్‌తో నిండి ఉంది, దృశ్యపరంగా అద్భుతమైనది, మంచి మలుపులు కలిగి ఉంది మరియు నాకౌట్ ప్రదర్శనలతో నిండి ఉంది… కంటెంట్ కుప్పకూలింది. ఇది ఒక చమత్కారమైన సమతుల్య చిత్రం, సరళమైన ఆనందం మరియు నిజమైన నాటకీయ పందాల మిశ్రమం.

సూపర్మ్యాన్ గురించి గొప్పది ఏమిటి?

అక్కడ మనకు సూపర్‌మ్యాన్ ఉన్నాడు. అతను స్వీయ-అవగాహన, వినయం, దయ మరియు ఉదారత కలిగినవాడు . అధికారం బాధ్యతతో విడదీయరాని విధంగా ముడిపడి ఉందని మరియు పాలించడం కంటే సేవ చేయడం మంచిదని అతను నమ్ముతాడు. బలవంతుల హక్కులకు వ్యతిరేకంగా బలహీనుల హక్కులను అతను సమర్థిస్తాడు మరియు మానవుల నుండి చెట్ల వరకు అన్ని జీవులకు నిజమైన న్యాయం కోరతాడు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Sanjay Dutt: సౌత్ ఇండస్ట్రీపై సంజయ్ దత్ సంచలన వ్యాఖ్యలు!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870